05-12-2020 14:20:37 About Us Contact Us



ఒక పక్క హీరోగా.. మరో పక్క సినిమాలలో ముఖ్యమైన పాత్రలు చేస్తూ.. నేటి తరం నటులలో విలక్షణ నటుడిగా పేరు పొందారు సత్య దేవ్.లాక్ డౌన్ లో కూడా వరస సినిమాలు విడుదల చేస్తూ ట్రెండింగ్ హీరోగా నిలిచిన సత్య ఈ నెల(జులై) 8వ తేదీన మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారిని కలిశారు.ఆ అనుభవాన్ని ప్రేక్షకులకు లేఖ ద్వారా పంచుకున్నారు సత్య.


సత్య చిన్నతనంలో.. ఎవరైనా.. ఏదైనా సాధించలేని విషయాన్ని చెప్పినప్పుడు.. తనకు బాగా వినిపించిన మాట.”నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నవా.” ఈ మాట తను స్కూల్ రోజుల్లో తొలిసారి విన్న సంఘటనను గుర్తు చేసుకుంటూ.. ఆ తర్వాత ఆ మాట చాలా సార్లు విన్నాను అని.. “నేను చిరంజీవి ని అనుకోవడం లేదు.. కానీ.. కొన్ని కోట్ల మంది లాగా చిరంజీవి ని అవ్వాలనుకుంటున్నాను..” అని లేఖ లో తెలిపారు.



ఎవరెస్ట్ ఎక్కాలనుకొనే ప్రతి ఒక్కరికి అనుమానాలు.. భయాలు తప్పవు.మధ్యలో.. ఇక నా వల్ల కాదు అని అనిపిస్తుంది.అలాంటప్పుడు ఆ ఎవరెస్ట్ పైన ఉన్న జండా ధైర్యాన్ని ఇస్తుంది.. శక్తి పొంజుకుంటుంది.అలానే.. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి చిరంజీవి గారు ఒక జండా అని చెప్పుకొచ్చారు.చిరంజీవి గారిని తన నివాసంలో కలిశానని.. ఆ యూఫోరియా నుండి ఇంకా తెరుకోలేదని.. ఇంకా కల లానే ఉంది అని..ఇలా మెగాస్టార్ ని కలవడం వల్ల తనకు కలిగిన ఆనందాన్ని.. ఆయన పట్ల తనకు ఉన్న గౌరవాన్ని పంచుకున్నారు.


2019లో బ్రోచేవారెవరురా.. ఇస్మార్ట్ శంకర్.. జార్జ్ రెడ్డి సినిమాలు.. గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే వెబ్ సిరీస్ తో భారీ విజయాలతో పాటు తన నటనకు విమర్శకుల ప్రశంసలు పొందారు సత్య.ఈ సంవత్సరం సరిలేరు నీకెవ్వరు సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించారు.లాక్ డౌన్ లో 47డేస్ అనే సినిమా.. locked అనే వెబ్ సిరీస్ విడుదల చేశారు.త్వరలో.. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.. అనే సినిమా విడుదల కానుంది.ఇలా.. ప్రసృతం ట్రెండింగ్ హీరోగా ఉన్న సత్య.. చిరంజీవిని కలవడం ఆ అనుభవానికి పంచుకోవడంతో ఆ లేఖ ప్రసృతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.