24-01-2022 16:40:22 About Us Contact Us2010లో వచ్చిన ‘ఏ మాయ చేసావె’సినిమాతో పరిచయమై,యువతను మాయ చేసిన నటి..తెలుగులో పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,జూనియర్.ఎన్టీఆర్,రామ్ చరణ్,అల్లుఅర్జున్..తమిళంలో విజయ్,విక్రమ్,ధనుష్,సూర్య,లాంటి స్టార్ హీరోలతో జతకట్టింది..పది సంవత్సరాలలో తెలుగు,తమిళంలో కలిపి 41 సినిమాలు చేసి అటు పుట్టిన తమిళ,ఇటు మెత్తిన తెలుగు ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది…సమంత రూత్ ప్రభు (సమంత అక్కినేని)…తన పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు గుర్తుచేసుకుందాం…


జోష్ తర్వాత అక్కినేని వారసుడు నాగ చైతన్య..గౌతమ్ మీనన్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయింది సమంత..సినిమా తొలి ఆట నుండే సమంతకు ఫాన్స్ ఏర్పడ్డారు..అమాయకత్వపు మోహము,సన్నటి వాయిస్ తో అందరిని కట్టిపడేసింది సమంత..తొలి సినిమాతో తెలుగులో మంచి మార్కులు కొట్టిన సమంతకు వెంటనే బృందావనం,దూకుడు,ఈగ,అత్తారింటికి దారేది సినిమాలు వచ్చాయి..దింతో స్టార్ హీరోయిన్ గా మారిపోయారు..తమిళంలో సైతం ఇలానే స్టార్స్ తో జత కట్టడంతో అక్కడ కూడా మంచి పేరు వచ్చింది…


నేటి తరం హీరోయిన్ల సినీ జీవిత కాలం చాలా తక్కువ..ఇలా వస్తారు,స్టార్లు అవుతారు అలా వెళ్లిపోతారు..కొందరు బాలీవుడ్ కి వెళ్ళిపోతే,మరికొందరు పెళ్లి చేసుకొని సినిమాలు ఆపేస్టు వుంటారు..కానీ సమంత అలా కాదు..ఇప్పటికి 10ఏళ్ళు పూర్తి చేసుకున్న సమంత మరో 10ఏళ్ళు సినిమాలు చేసినా ప్రేక్షకులు ఆదరించేలా వున్నారు..దీనికి కారణం ఆమె కథలు ఎంచుకున్న విధానం..అందరి హీరోయిన్ల తో పాటు అందం ప్రాధాన్యత పాత్రలు చేస్తూనే నటిగా మెప్పు పొందే ప్రయత్నం చేశారు సమంత..


మనం సినిమాలో సమంత చేసిన పాత్ర,తాను చేసిన అన్ని సినిమాలలో నటిగా పేరు తెచ్చిన పాత్ర..సినిమాలో నాగార్జున,సమంత మధ్య సన్నివేశాలలో సమంత చాలా బాగా ఒడిగిపోయారు..ఇక రంగస్థలంలో ది గ్లామర్ రోల్ చేసి నటిగా మరో మైలు రాయి పొందారు..నేటి తరం ఏ హీరోయిన్ కి రాని మరో పాత్ర ఓహ్ బేబీ..ఆ సినిమాలో సమంత చేసిన నటన బాగా చేశారు కాదు సమంత ఆ పాత్ర లో జీవించారు అని చెప్పాలి..ప్రతిష్టాత్మక సినిమాలైన ఈగ,మహానటి లో సైతం ఆమె పాత్రలు మనల్ని కదిలిస్తాయి..అంటే కాదు తనకన్నా వయసులో,స్టార్డంలో తక్కువ ఉన్న వారితో కలిసి నటించి కూడా మెప్పు పొందారు సమంత..ఇది కూడా ఒక మైలురాయి అనే చెప్పాలి.గతంలో కొందరు అలా చేసిన ప్రయోగాలు విఫలమైయ్యాయి.


యూ-టర్న్ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రెండు బాషలలో హిట్ కొట్టారు సమంత..పెళ్లి తర్వాత కూడా ఆమె వేగం ఏమాత్రం తగ్గలేదు..మూడు సంవత్సరాలలో 9 సినిమాలు చేశారు…అటు వైవిధ్య పాత్రలు చేస్తూనే,ఇటు గ్లామర్ రోల్స్ చేశారు సమంత..కేవలం తన అమాయకపు ఎక్స్ ప్రెషన్స్ తో ముప్పాయిలలో కూడా టీన్స్ లా కనిపిస్తూ అందరిని అలరిస్తున్నారు సమంత..అంతేనా ఎగువ మధ్యతరగతి కుటుంభం నుంచి వచ్చిన సమంత,తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు..ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో చిన్న పిల్లలకు సహయపడుతున్నారు..తన అవయవదానం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు సమంత..


చెన్నై లో పుట్టి పెరిగి..అటు తమిళ..ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించి,ఎంతో మంది అభిమానులను సంపాదించిన సమంత ఈ 10ఏళ్లల్లో ఎన్నో అవార్డులు,మరెనో రివార్డులు అందుకున్నారు.. రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు చెయ్యాలి అని కోరుకుంటూ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న తమిళ తలైవి,తెలుగు ముద్దుగుమ్మ..క్వీన్ “సమంత అక్కినేని”గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు…