05-12-2020 13:40:39 About Us Contact Us


2013లో జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా సినిమాలో కాజల్ కి చెల్లిగా ఒక అమ్మాయి కనిపించింది.ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో ముగ్గురు జంటలలో ఒక హీరోయిన్ గా మళ్ళీ ఆ అమ్మాయి కనిపించింది.వెంటనే 2014 నా రాకుమారుడు సినిమాలో నవీన్ చంద్ర కు జంట గా కనిపించింది.ఆ తర్వాత 2015లో నాని,విజయ్ దేవరకొండ చేసిన ఎవడే సుభ్రమన్యంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.ఇలా 3 సంవత్సరాలలో నాలుగు సినిమాలలో కనిపించినా తన పేరు గాని,తన గురించి గాని పెద్దగా ఎవరికి తెలియలేదు.

2016లో చిన్న సినిమాగా వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల యువతకు హత్తుకున్న పెళ్లి చూపులు సినిమాతో ఎంతో మందిని ఆకర్షించింది.నటిగా మంచి పేరు తెచ్చుకుంది.ఆ సినిమాతో తన కంటూ అభిమానులను పొందింది,మరో పక్క ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ ఫేర్,నంది అవార్డులతో పాటు మరెనో అవార్డులు గెలిచింది.తనే మన తెలుగు అమ్మాయి రీతూ వర్మ.చూడడానికి పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ వుండడం కళ్ళతో మంచి అభినయానికి పలికిస్తూ ఉండడం,పెళ్లి చూపులు సినిమాతో గుర్తింపు రావడంతో నాటి నుండి ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి.

పెళ్లి చూపులు తర్వాత 2017లో నిఖిల్ తో కేశవలో కనిపించిన రీతూ తమిళంలో స్టార్ హీరో ధనుష్ సూపర్ హిట్ మూవీ వి.ఐ.పి కి సిక్వల్ గా వచ్చిన వి.ఐ.పి.2 లో కనిపించింది.ఆ తర్వాత సౌత్ ఇండియన్ స్టార్ హీరో విక్రమ్ తో,మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మన్ తో కూడా నటించింది.

ఇలా వరసగా నాలుగు సినిమాలు తమిళంలో చేసింది రీతూ,ఇప్పుడు తిరిగి మళ్ళీ మన తెలుగులో నాని తో టక్ జగదీష్ చేస్తుంది.ఇది కాకుండా శర్వానంద్,నాగ శౌర్య లతో కూడా నటిస్తుంది.మొత్తం మీద అటు తమిళం,ఇటు తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ క్షణం తీరిక లేకుండా అటు చెన్నై,ఇటు హైదరాబాద్ తిరుగుతుంది మన తెలుగు అమ్మాయి.

ఇలానే మరెనో సంవత్సరాలు సినిమా రంగంలో బిజీ బిజీ గా ఉండాలి అని,సినిమా రంగంలోకి రావాలి అనుకునే తెలుగమ్మాయిలకు స్ఫూర్తిగా నిలవాలని,ఇలానే మరెనో పుట్టిన రోజులు జరుపుకోవాలి అని కోరుకుంటూ తన అభిమానులు తరుపున,మా బి.ఆర్.మూవీ జోన్ టీం తరపున రీతూ వర్మకి పుట్టిన రోజు శుభాకాంక్షలు..!