05-12-2020 14:08:50 About Us Contact Us



2016లో కాలేజీ లవ్ స్టొరీ తో ఒక్క కన్నడ సినిమా విడుదలై విజయం సాధించింది.ఎంతలా అంటే భాషతో సంబంధం లేకుండా తెలుగు,తమిళ,మలయాళం యువత మొత్తం ఆ సినిమాని చేసేశారు.ఆ సినిమా పేరే “కిరిక్ పార్టీ”.అయితే ఇందులో హీరోయిన్ మొత్తం దక్షణ భారతదేశ యువతని ఆకట్టుకుంది.ఆ సినిమా నాటికి తన వయసు 20 సంవత్సరాలు.ఆ తర్వాత కూడా కన్నడలో సినిమాలు చేస్తుపోయింది.


2018లో తెలుగు చిత్ర పరిశ్రమకి “ఛలో” తో అడుగుపెట్టింది.తొలి సినిమాతోనే తెలుగులో కూడా విజయం అందుకుంది ఆ ముద్దుగుమ్మ.ఆమె ఎవరో కాదు రష్మికా మందన్న.ఆరు నెలలు లోపే విజయ్ దేవరకొండతో కలిసి “గీతా గోవిందం” అంటూ మళ్ళీ వచ్చింది.ఈ సినిమాతో భారీ విజయం అందుకుంది.సినిమా హాల్ లో హీరోకి సమానంగా అరుపులు కేకలు ఈమె కోసం వేశారు.తన కళ్ళతో ముఖకవళికలతో తనకంటూ అభిమానులని ఏర్పరుచుకుంది.ఆ సినిమా విజయంతో తెలుగు నాట స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మికా.ఇంతలోనే అదే సంవత్సరం చివరిలో నాగార్జున,నాని కలిసి చేసిన మల్టి స్టార్ సినిమా “దేవదాస్” లో నాని సరసన పోలీస్ గా కనిపించింది.ఇలా ఒక 2018లొనే మూడు హిట్స్ అందుకొని లక్కీ చాంప్ గా పేరు తెచ్చుకుంది.


2019లో డియర్ కామ్రడ్ సినిమాతో అన్ని దక్షణ భారత భాషలలో హీరోయిన్ గా పరిచయం అయిపోయింది రష్మికా.ఈ సినిమాతో తన నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంది.ప్రజల్లో నిలిచిపోయె లిల్లి పాత్రలో నవ్వించింది,ఏడిపించింది,మనసులను కదిలించేసింది.ఇక 2020లో ఇప్పటికే రెండు సినిమాలతో ప్రజలను అలరించింది.సంక్రాంతిలో మహేష్ బాబు తో జత కట్టి “సరిలేరు నీకెవ్వరు” అని అనిపించుకున్న రష్మికా,వెంటనే ఫిబ్రవరి లో నితిన్ తో కలిసి “భీష్మ” తో మరో విజయం అందుకుంది.


ఇలా తెలుగు లో కేవలం మూడు సంవత్సరాల లోపే ఆరు సినిమాలు చేసి ఆరు హిట్స్ అందుకుంది రష్మికా మందన్న.దింతో ఈ అమ్మాయి ఉంటే సినిమా హిట్ అనే స్థాయికి వెళ్ళిపోయింది,మరో పక్క సోషల్ మీడియాలో సైతం ఆమె ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది.ఇంటర్వ్యూలలో చాలా సరదాగా మాట్లాడుతూ అందరిని అలరిస్తూ అభిమానులకు మరింత దగ్గరయ్యింది.చాలా హైపర్ ఆక్టివ్ పిల్ల అంటూ తన సహచర నటులంతా చెప్పుకొచ్చారు.బన్నీ,సుకుమార్ సినిమాని ఇప్పటికే సైన్ చేసిన రష్మీకా,కార్తీ సినిమాతో నేరుగా తమిళంలో తొలి సినిమా చేయనుంది.సంవత్సరానికి ఒక సినిమా తగ్గకుండా కన్నడలో సైతం సినిమా చేస్తూనే ఉంది.ఇలా అటు కన్నడ ఇటు తెలుగు నాట కీర్తి గడించిన కన్నడ ముద్దాడ హుడుగి రష్మికా మరిన్ని విభిన్నమైన పాత్రలతో మనందరిన్నీ అలరించాలి అనికోరుకుంటు,రష్మికా కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.