08-12-2021 21:20:36 About Us Contact Us



మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,కీయారా అద్వానీ హీరో హీరోయిన్లుగా.. భారతదేశంలోనే అగ్ర దర్శకులలలో ఒక్కరిగా పేరు పొందిన శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతున్న విషయం విదితమే. సెప్టెంబర్ లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ చివరి వారంలో తొలి షెడ్యూల్ పూణే లో ప్రారంభించి నిన్నటితో పూర్తయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


మెగా పవర్ స్టార్ గడిచిన సంవత్సర కాలంగా అటు ఆర్.ఆర్.ఆర్..,ఇటు ఆచార్య షూట్ లతో బిజీ బిజీ గా గడిపారు. ఇప్పుడు ఆ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయ్యాయి. జనవరి 9న ఆర్.ఆర్.ఆర్.. ఫిబ్రవరి 4న ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కవిడ్ వచ్చినా ఎక్కువ విరామం తీసుకోకుండా వెంటనే షూటింగ్ లోకి దిగేశారు చరణ్. అలాంటి చరణ్.. రెండు భారీ ప్రాజెక్టులు పూర్తి చేశానని ఏ మాత్రం విరామం తీసుకోకుండా వెంటనే మరో భారీ సినిమా షూటింగ్ లో చేరేశారు. చేరడమే కాక తొలి షెడ్యూల్ ని పూర్తి చేసేశారు.





ఎస్.వి.సీ.బ్యానర్ పై వస్తున్న 50వ చిత్రంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలలో ఒక్కరైన దిల్ రాజు గారి నిర్మాణంలో దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒక్కరైన శంకర్ గారి దర్శకత్వంలో అపార నైపుణ్యం కలిగిన నిపుణులను సాంకేతిక బృందంలో చేర్చుకొని.. భారీ తారాగణంతో అత్యధిక వ్యయంతో నిర్మిస్తున్న సినిమా ఆర్.సి 15. తొలి షెడ్యూల్ లో భాగంగా చిత్రంలోని రైల్ ఫైట్ షూట్ చేసేందుకు అక్టోబర్ నెల 21న పూణే చేరుకుంది చిత్ర బృందం. నిన్నటితో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అనేక రాష్ట్రాల నుండి వచ్చిన చిత్ర బృందం చాలా బాగా వచ్చిన ఔట్ పుట్ ని చూసి ఆనందంతో దీపావళి పండుగ జరుపుకునేందుకు తిరిగి వారి.. వారి ఇళ్లకు చేరుకున్నారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం తన చిరకాల మిత్రుడు ఇటీవల మరణించిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి నివాళ్ళు అర్పించేందుకు.. కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపేందుకు నేడు బెంగుళూరు లోని తన స్వగృహానికి వెళ్లనున్నారు. అక్కడ నుండి దీపావళి పండగ సంబరాల్లో పాలుగొనేందుకు రామ్ చరణ్ తన ఇంటికి చేరుకుంటారు.


సెట్ లో జోష్ గా ఉంటూ.. అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ..తన అలసట ని ఏమాత్రం చూపించకుండా.. ఇలా వరస సినిమాలు చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని చూస్తుంటే ఆనాటి మెగా స్టార్ చిరంజీవి గారిని.. ఇప్పటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూసినట్లు ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇలానే అగ్ర కథానాయకులు వరస సినిమాలు చేస్తే చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం లభిస్తుందని ఆనందంగా అంటున్నారు. ఆచార్య.. ఆర్.. ఆర్.. ఆర్.. తో పాటు ఆర్.సి 15 చిత్రాలు భారీ విజయాలు సాధించాలని బి.ఆర్.మూవీ జోన్ బృందం మనస్పూర్తిగా కోరుకుంటుంది.