03-12-2020 23:09:12 About Us Contact Us



రాహుల్ రవీంద్రన్.. టీవీ యాడ్ లో నటుడిగా కెరీర్ ప్రారంభించి.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారి.. దర్శక శాఖలో చేరాలనుకొని.. కథానాయకుడిగా అవకాశం పొంది.. నటుడిగా మంచి పేరు తెచ్చుకొని.. ఇప్పుడు దర్శకుడిగా రెండు సినిమాలు చేశారు.. నేడు అలాంటి రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు..


రాహుల్ పుట్టి.. పెరిగింది అంతా చెన్నై లోనే.. చెన్నైలో కామర్స్ డిగ్రీ పొంది.. ఎంబీఏ ముంబైలో చదివారు.. అక్కడే ఒక ప్రముఖ మీడియా పరిశ్రమలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేశారు.. అలా ఒక రోజు రాత్రి హోటల్లో డిన్నర్ చేస్తుండగా.. తనకు ప్రముఖ యాడ్ డైరెక్టర్ డిబాకర్ బెనర్జీ నుంచి ఒక యాడ్ లో నటించే అవకాశం లభించింది.. ఆ యాడ్ తో బాగా ఫేమ్ రావడంతో రాహుల్ కు అవకాశాలు వచ్చాయి.. అదే సమయంలో పవర్ రేంజర్స్ మిస్ట్రిక్ ఫాస్లో రెడ్ రేంజర్ కు.. ఎస్.పి.డి లో వైట్ రేంజర్ కు తమిళంలో డబ్బింగ్ చెప్పారు.. ఆ తర్వాత అన్ని వదిలి తిరిగి చెన్నై చేరారు..



అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాలి అని భావించిన రాహుల్ కు ప్రముఖ కెమరామెన్ రవి వర్మన్ గారి బృందంలో ఒక్కరు రాహుల్ యాడ్ షూట్ నచ్చడం వల్ల.. రవి వర్మన్ గారు స్వయంగా రాసుకొని.. దర్శకత్వం చేస్తున్న సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది.. సమంత హీరోయిన్ గా చేసిన తొలి సినిమా కూడా ఇదే.. థమన్ సంగీత దర్శకులు.. సినిమా పేరు మొస్కోవిన్ కావేరీ.. సినిమా పేరు.. 2008లో షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా రవి వర్మన్ కు కెమరామెన్ గా మిగతా సినిమాలు ఎక్కువ ఉండటం వల్ల 2010లో విడుదలైంది.. అలా తమిళనాట హీరోగా పరిచయమయ్యారు రాహుల్.. ఆ తర్వాత రెండు తమిళ సినిమాలు నటించారు.. ఆంగ్లంలో ఒక సినిమా చేసినా.. అది విడుదల కాలేదు.. అప్పుడు 2012 లో వచ్చింది అందాల రాక్షసి.. తెలుగు అదే తొలి సినిమా.. భారీ విజయం నమోదు చేసుకుంది.. అక్కడ నుండి అందరికి తెలిసిన విషయాలే.. 2010 నుండి అటు తమిళం.. ఇటు తెలుగులో 15 సినిమాలలో నటించారు రాహుల్.. అందులో జీ5 లో నేరుగా విడుదలైన దృష్టి అనే సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందారు.. U-టర్న్ సినిమాతో రెండు బాషలలో ప్రేక్షకుల వద్ద మంచి నటుడుగా బాగా పేరు సంపాదించుకున్నారు..


2018లో దర్శకుడిగా మారిన రాహుల్.. చి౹౹ ల౹౹ సౌ౹౹ అనే సినిమా చేశారు.. సుశాంత్ కెరీర్ లో మంచి విజయం సాధించిన సినిమా జాబితాలో ఇది ఒక్కటి.. ఈ సినిమాతో డైరెక్టర్ గా మంచి మార్కులు పడ్డాయి.. 2019లో తాను దర్శకుడిగా మన్మథుడు 2 నే సినిమా కూడా చేశారు.. అలా తన 15ఏళ్ళ సినీ ప్రస్థానం లో అటు నటుడిగా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.. హీరో గా.. ఇప్పుడు దర్శకుడిగా చేశారు.. నేడు 38వ పుట్టిన రోజు జరుపుకుంటున్న రాహుల్.. ఇలానే అటు నటుడిగా.. ఇటు దర్శకుడిగా మరిన్ని సినిమాలు చేసి.. భారీ విజయాలు నమోదు చేయాలని కోరుకుందాం.. మా బి.ఆర్. మూవీ జోన్ బృందం తరుపున రాహుల్ రవీంద్రన్ కి జన్మదిన శుభాకాంక్షలు..