24-01-2022 15:32:05 About Us Contact Us20 సంవత్సరాల సినీ ప్రస్థానంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.. నటుడిగా.. గాయకుడిగా.. సంగీత దర్శకుడిగా.. నిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసేందుకు అహర్నిశలు తపిస్తూ.. ఎందుకే రవనమ్మ.. పాటతో అందరికి సూపరిచితులుగా మారారు రఘు కుంచే.. నేడు అలాంటి రఘు గారి పుట్టిన రోజు.. ఆయన గురించి కొన్ని విషయాలు..


ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరల్లో గదరద అనే పల్లెటూరులో ఒక పిల్లవాడికి చదువుకునే రోజుల్లో ఒక చెట్టు మీద దెయ్యం ఉందని బయపెట్టారు.. అప్పటి నుండి రాత్రి పూట ఆ చెట్టు మార్గం నుండి వెళ్తుంటే భయంతో కృష్ణ గారి సినిమాలోని ఆంజనేయ దండకం పాడటం మొదలు పెట్టాడు.. అలా పిల్ల వాడు ఒకే పాటను గెట్టిగా.. చిన్నగా.. ఇలా అన్ని విధాలుగా పడేవాడు.. ఆ పిల్లవాడు హై స్కూల్ లో.. కళాశాలలో అమ్మయిలు బాగా మాట్లాడుతున్నారు అని.. పాటలు పాడుతూ పోయాడు.. డిగ్రీ చదివే రోజుల్లో కొత్త గాయనీ.. గాయకులకు.. ఆహ్వానం అని దాసరి నారాయణ గారి పత్రికా ప్రకటన చూసి గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కి హైదరాబాద్ బయలుదేరాడు.. రైలు లో పరిచయమై తోటి ప్రయాణికుడు రాధా కృష్ణ గారికి విషయం చెప్పాడు.. అది.. విని నవ్విన ఆయన.. ఆ బోగీలోనే పాట పాదించారు.. ఆ బోగీలో అందరూ పాటను మెచ్చుకున్నారు.. హైదరాబాద్ చేరాక ఇంట్లో భోజనం పెట్టి ఆ దాసరి గారి ఆడిషన్ వద్దకు తీసుకెలమని మనిషిని కుర్మాయించాడు.. అవకాశం రాలేదు.. కానీ డిగ్రీ పూర్తి చేసుకున్న ఆ కుర్రాడిని తిరిగి హైదరాబాద్ పంపమని తాన్ తండ్రికి ఆ రాధా కృష్ణ గారు ఉత్తరం రాయడంతో మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నాడు ఆ యువకుడు.. ఆ పిల్లవాడే ఇప్పటి మన రఘు కుంచే..


అలా వచ్చిన రఘుకు మొదట్లో అవకాశాలు రాలేదు.. కానీ.. తన ప్రయత్నం మాత్రం ఆపలేదు.. ఈ సమయంలోనే తనకు వచ్చిన డబ్బింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.. అలానే నటనలో టీవీ సీరియల్ లో కొన్ని సింగల్ ఎపిసోడ్ పాత్రలు చేశారు.. అలా కాలం గడుపుతున్న రోజుల్లో ఒక కేఫ్ లో మరిచాయమయ్యాడు ఒక మిత్రుడు.. ఆ మిత్రుడు దర్శకుడిగా అవకాశం వచ్చిన రెండవ సినిమా నుండి రఘు కుంచే గారికి వెనుదన్నుగా నిలిచారు.. ఆయనే దర్శకులు పూరి జగన్నాథ్.. 2000 సంవత్సరంలో గాయకుడిగా బాచి లో తొలి సినిమా అవకాశం ఇచ్చింది పూరి గారే.. 2009లో బంపర్ ఆఫర్ సినిమాతో తొలిసారి సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చింది ఆయనే.. పరిశ్రమలోకి వచ్చిన తొలి రోజుల్లోని స్నేహంతో పూరి ఇలా రఘు గారికి అవకాశం ఇచ్చారు అంటే.. రఘు కుంచే గారు ఆ రోజుల్లో పూరి గారికి ఎంతలా తన ప్రతిభ చూపించి ఉంటారో.. ఎంతలా తన తపన పంచుకొని ఉంటారో.. ఊహించవచ్చు..


అలా గాయకుడిగా మారిన రఘు కుంచే గారు ఇప్పటి వరకు 600 పాటలకు పైనే పడ్డారు.. దాదాపు ఇరవై సినిమాలకు సంగీతం అందించారు.. అడపాదడపా సినిమాల్లో కనిపించే రఘు గారు.. ఇటీవల వచ్చిన పలాస సినిమాలో ప్రతి నాయకుడు గురుమూర్తి పాత్రలో నటించి.. విమర్శకుల ప్రశంసలు పొందారు.. ఆయన పాటల గురించి.. ఆయన సంగీతం అందించిన సినిమాల గురించి అందరికి తెలిసినవే కనుక వాటి గురించి ప్రస్తావించడం లేదు.. కష్టం.. ప్రతిభను.. మాత్రమే నమ్ముకొని.. అవకాశాల కోసం ఎవరి భజనా చెయ్యను అని చెప్పారు.. సినిమా.. టెలివిజన్ రంగంలో ఏదో పని చేసుకుంటాను.. కానీ ఖాళీగా ఉండలేను.. అని కూడా తెలిపారు.. ఇటీవల వరసగా రాగల 24 గంటల్లో.. పలాస 1978తో ఫారం లోకి వచ్చినట్లు కనిపిస్తున్న రఘు కుంచే గారు ఇలానే.. మరిన్ని సంవత్సరాలు పరిశ్రమలో ఉండాలని.. మనల్ని మరింత అలరించాలని కోరుకుందాం.. బి.ఆర్. మూవీ జోన్ తరపున రఘు కుంచే గారికి జన్మదిన శుభాకాంక్షలు..