22-10-2020 02:49:25 About Us Contact Us



యాభై నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రాజు విశాఖ తీరంలోని బాపిరాజు కొత్తపల్లి అనే ఊరిలో ఒక అల్పపీడనం పుట్టింది.అది హైదరాబాద్ చేరుకొని రెండు దశాబ్దాల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలో తుఫాన్ గా మారింది. సునామీ వంటి బీభస్థాని సృష్టించిన ఆ తుఫాన్ పేరు పూరి జగన్నాథ్.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బద్రి సినిమాతో పరిచయమై.. తొలి సినిమాతోనే తన సినిమాలో హీరో క్యారెక్టర్లు మున్ముందు ఎలా ఉంటాయో చూపించాడు.. పబ్లిక్ పల్స్ పట్టిన ఆ యువ దర్శకుడు.ఆ రోజు పవన్ కళ్యాణ్ సైతం ఊహించి ఉండదు తను మెడ మీద చెయ్యి పెట్టడం తన మ్యానరిజం అవుతుందని.ఇక యువత బద్రి సినిమాతో పవన్ కళ్యాణ్ గారికే కాక తొలి సినిమా దర్శకత్వం చేసిన దర్శకునికి కూడా బాగా కనెక్ట్ అయ్యారు.నాటి బద్రి నుంచి నిన్నటి ఇస్మార్ట్ శంకర్ వరకు హిట్లు,ఫ్లాప్లు అనే సంబంధం లేకుండా రెండు దశాబ్దాలుగా యువతకు బాగా చేరువైన దర్శకుడు పూరి జగన్నాథ్ గారు.నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ కథనం..


తొలి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో భారీ విజయం అందుకున్న పూరి,వెంటనే జగపతిబాబు గారితో బాచి.. కన్నడలో శివ రాజ్ కుమార్ తో మన తెలుగు తమ్ముడిని రీమేక్ చేశారు.2001లో రవితేజతో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం.. 2003 కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో అప్పు.. తెలుగులో రవితేజను స్టార్ హీరో చేసిన ఇడియట్ సినిమా చేశారు..ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆ తర్వాత అమ్మ నాన్న ఓ తమ్మిళ అమ్మాయి సీనిమాతో పూరి,రవితేజ కంబోగా వరస హాట్-ట్రిక్ హిట్స్ అందుకున్నారు.


అక్కడ నుండి వెనక్కు తిరిగి చూడలేదు.. అలనాటి అగ్ర హీరోలు నాగార్జున,బాలకృష్ణ.. నేటి తరం స్టార్లు పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,తారక్,బన్నీ,రామ్ చరణ్,ప్రభాస్,రానా,గోపిచంద్,రవితేజ,వరుణ్ తేజ్,రామ్ పోటీనేని వంటి హీరోలతో సినిమాలు చేశారు..బాలీవుడ్ లో బద్రి ని రీమేక్ గా షార్ట్ సినిమా.. తన అభిమాన నటుడు బిగ్ బి అమితా బచ్చన్ గారితో బుద్దా హోగా తెర బాప్ అనే సినిమాని డైరెక్ట్ చేశారు పూరి.



చిరుత.. తో నేనింతే.. అని చెప్పిన ఎక్ నిరంజన్.
ఒక పక్క జ్యోతిలక్ష్మి తో.. 143.. నేను నా రాక్షసి..అంటూ,మరో పక్క కెమరామెన్ గంగతో రాంబాబు గా మారి.. మేరీ మెహబూబా అని చెప్పిన.. ఇద్దరమ్మాయిల రోమియో. వారికి గోలిమార్ తో హార్ట్ ఎటాక్.. తెప్పించిన ఆంధ్రవాలా.. దేశముదురు.. పోకిరి.. లోఫర్..రోగ్.. మన బుజ్జిగాడు. చివరకు దేవుడు చేసిన మనుషులు.. ఇంతే అనే ఇజం నమ్మిన శివమణి.. తన టెంపర్..తో సూపర్.. బిజినెస్ మ్యాన్ గా పైసా వసూల్ సాధించారు.
ఇట్లు..
ఇస్మార్ట్ శంకర్.


ఇప్పుడు 2020లో స్టార్ హీరోగా మారిన నేటి తరం రౌడీ విజయ్ దేవరకొండ తో కలిసి దేశ స్థాయిలో భారీ సినిమా చేస్తున్నారు పూరి..ఈ సినిమా నిర్మాణంలో కరణ్ జోహార్ కుడా ఉన్నారు.ఇలా తన 20ఏళ్ళ సినీ జీవితంలో 32 సినిమాలు చేశారు.నేటి తరం దర్శకులలో చాలా మంది జీవితంలో చేసే సినిమాలు ఆయన ఈ 20ఏళ్లలో చేశారు. ఒక్క సంవత్సరంలో 3 సినిమాలు చేసినా,అతి తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేసినా..అవన్నీ పూరి మార్క్ దర్శకత్వ ప్రతిభకు అర్థం పడతాయి.. కన్నడ లో పునీత్ రాజ్ కుమార్.. తెలుగు తో రామ్ చరణ్ వంటి సినీ వారసులను పరిశ్రమకు పరిచయం.. అక్కడ రాజ్ కుమార్.. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు అడిగి చేయించుకున్నారు. డైలాగ్స్ విషయానికి వస్తే..


పవన్ కళ్యాణ్(బద్రి):- నువ్వు నందా,నందా అయితే నాకేంటి నేను బద్రి బద్రీనాథ్.
మహేష్ బాబు(పోకిరి):- ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లోక్ అవుడో వాడు పండు,నేనే..
నాగార్జున(శివమణి):- నా పేరు శివమణి,నాకు కొంచెం మెంటల్.
అల్లు అర్జున్(దేశముదురు):- జాయింట్లు జారిపోతాయి,ఫిలమెంట్లు రాలిపోతాయి..
రవితేజ(ఇడియట్):- సిటీ కి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు..పోతుంటారు..కానీ,చంటిగాడు.. లోకల్..
ఎన్టీఆర్(టెంపర్):- నా పేరు దయా,నాకు లేనిదే అది..
ప్రభాస్(బుగ్గిగాడు):- టిప్పర్ లారీ వచ్చి గుడితే ఎలా ఉంటుందో తెలుసా..



ఇలా ప్రతి సినిమాలో పదుల సంఖ్యలో డైలాగ్స్ మనకు టక్కున గుర్తొచ్చేస్తాయి..హీరోల మ్యానరిజంలలో సైతం పూరి మార్క్ ఉంటుంది.ఆయన సినిమా డైలాగ్స్ లో జీవిత సత్యాలు కూడా ఉంటాయి..ఉదాహరణకు,నాకు బాగా నచ్చిన డైలాగ్.. నేనింతే సినిమాలో.. “ఈ ప్రపంచంలో ప్రతీ ఒక్కడు స్వార్థ పరుడే ఇదే మాటచెప్తే ఏ నా కొడుకు ఒప్పుకోడు..”.ప్రపంచంలో జరుగుతున్న నిజాలని పూరి చూపించే విధానం అద్భుతం.. కొంచం ఘాటుగా చెప్పినా ఆయన ప్రతి సినిమాలో ఒక చక్కటి సందేశం ఉంటుంది.. పాటలకు పూరి సినిమాలో మరో ప్రాత్యేక స్థానం.అందుకే పూరి సినిమా పాటలు మన ప్లే లిస్ట్ లో కచ్చితంగా ఎక్కువే ఉంటాయి. ఆయన సినిమాలే జీవిత సత్యాలు, చాలామందికి ఆదర్శాలు.. ప్రేమ,దేశం పట్ల ఆయనకు ఉన్న గౌరవం ఆయన సినిమాలు చూస్తే మనకు అర్ధమవుతుంది.మనలో చాలా మంది ఆయన మాటలలో ఆటో,ఇటో వెళ్లకుండ మధ్యలో ఊగిసులడుతుంటాం..వీరే ఈ దేశానికి ప్రమాదకరం..వీరు ఉండకూడదు అనేదే తన తపనలా కనిపిస్తూ ఉంటుంది.సమాజం పట్ల తనకున్న బాధ్యత తను ఇలా సినిమాలు తీస్తూ నిర్వహిస్తున్నట్లు కనిపిస్తుంది.


సినిమాల్లోకి రాకముందు నుండే పూరి ఇలానే ఉన్నారు.తాను విశాఖలో ఏడవ తరగతి చదువుతున్న రోజుల్లోనే తన మిత్రులతో మాట్లాడటానికి ఒక ఆఫీస్ ఏర్పచుకున్నారు.. ఆయన శైలే ఆయన పాత్రలకు ఇచ్చారంటే.సొంతగా పూరి కనెక్స్ అనే నిర్మాణ సంస్థ పెట్టి సినిమాలు నిర్మించడమే కాక చాలామందికి అవకాశాలు,మరెందరికో ఉద్యోగాలు ఇస్తున్నారు పూరి.గత సంవత్సరం తన పుట్టినరోజున(ఇదే రోజు).. సినిమాలు చెయ్యలేని వృద్ధ దర్శకులకు ఆర్థిక సహాయం అందించారు పూరి.ఇదే కాదు,చేసిన సహాయం ఎన్నడూ చెప్పుకోలేదు పూరి..సాధారణంగా ప్రేక్షకులు మాట్లాడుకుంటూ..మా హీరో పాత్రలో ఎలా జీవించగలదో చూస్తావు ఆగు,పూరి గారితో మా వాడి సినిమా వస్తుంది.హీరోయిన్ లను చూపించడంలో కూడా తనదైన మార్క్ ఉంటుంది.ఆ అమ్మాయిని సరిగ్గా ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు..ఇప్పుడు పూరితో సినిమా చేస్తుంది కదా..ఇప్పుడు చూడు ఎలా చూపిస్తాడో పూరి..అంటున్నారు.


ఇలా పూరి గారి గురించి రాసుకుంటూ పోతే పుస్తకమే రాయచ్చు.తాజాగా ..తెలుగు చలన చిత్ర పరిశ్రమ సెన్ సెషన్,పంచ్ డైలాగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్,మాస్ సినిమాలకు పర్మనెంట్ అడ్రస్.. పూరి గారి మాటలలో చెప్పాలి అంటే..పూరీ నువ్వు తోపు రా..పూరి నువ్వు తురుము రా.. పూరి నువ్వే మా అందరి రుస్తుం..మరిన్ని దశాబ్దాలు ఇలా సినిమాలు చెయ్యాలని.. మీడియా,పోలీస్,రాజకీయం అనే తేడా లేకుండా సమాజంలో తప్పు చేసే ప్రతి యడవను కడిగేయ్యాలని కోరుకుంటూ.. నేడు యాభై నాలుగవ పుట్టిన రోజు జరుపుకుంటున్న పూరి జగన్నాథ్ గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంశాలు.!