01-12-2020 18:07:08 About Us Contact Us



5 నెలల ముందు విడుదలైన ఉండిపోవా పాట నుండి సామాజిక మాధ్యమంలో నిత్యం బాగా వినిపిస్తున్న పేరు ప్రియాంక శర్మ..2015 నుంచి సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమకు తెలిసిన ఈ ఢిల్లీ భామ..సవారి సినిమాతో చిన్న హీరోయిన్ స్థాయి నుండి పెద్ద హీరోయిన్ స్థాయికి చేరింది..ఇలాంటి సమయంలో ఏదైనా స్టార్ హీరో సినిమాలో చేస్తే..స్టార్ స్టేటస్ వచ్చే అవకాశం కనపడుతుంది..కొందరిలా ముంబై నుండి రావడమే పెద్ద హీరో సినిమా తో పరిచయం కాలేదు..ఒకో మెట్టు ఎదుగుతూ వస్తుంది ప్రియాంక..


మిలిటరీ కుటుంభంలో పుట్టిన ప్రియాంక శర్మ హైదరాబాద్ లోనే డిగ్రీ పూర్తి చేసింది..సినిమా రంగం పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని ఇంట్లో చెప్పింది..తలితండ్రులు పూర్తిగా మద్దతు నిలవడంతో ఫిల్మ్ నగర్ వైపు అడుగులు వేసింది..నటన బాగా చేస్తుండటం..డాన్స్ లో కూడా ప్రావీణ్యం ఉండటం..చూడటానికి అందంగా కనిపిస్తుండడం..సెట్ లో ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చేస్తుండటంతో..పరిశ్రమలోనే ఆ నోటా..ఈ నోటా తన పేరు బాగా ప్రచారమైంది..ఒక సినిమాలో పని చేసిన వారు మరో సినిమాకు రెఫర్ చేస్తూ పోయారు..తొలి సినిమా తర్వాత వరసగా చిన్న సినిమా అవకాశాలు వచ్చాయి..ఒకరకంగా చెప్పాలంటే..చిన్న సినిమాలలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది ప్రియాంక..ఇదంతా కూడా ఆమె పరిశ్రమకు వచ్చిన మూడేళ్ళలో అయిపోయింది..ఆ సమయంలో బంధం రేగర్డ్ అనే ఇండిపెండెంట్ సినిమా కూడా చేశారు..


వరసగా ఇలా చిన్న సినిమాలు చెయ్యడం వల్ల తన కెరియర్ కు పెద్దగా ప్రయోజనం లేదని గ్రహించిన ఆమె..చిన్న సినిమాలు చెయ్యడం ఆపేశారు..అదే సమయంలో ఆమె తీసిన ఇండిపెండెంట్ సినిమా దర్శకుడు సాహిత్ మోత్కురి..హీరో నందుతో ఒక సినిమాను చేసేందుకు సిద్ధమయ్యారు..తనను నమ్మి ఇండిపెండెంట్ సినిమాలో పని చేసిన వారందరిని అందులో పెట్టుకున్నారు..తెలిసిన టీం..కధ నచ్చడంతో ఈ సినిమా ఒప్పుకున్న ప్రియాంక కు ఈ సినిమా పెద్ద మలుపు తిప్పింది..సినిమా ఫస్ట్ లుక్ నుండే బాగా హైప్ రావడం..తొలి పాట బాగా హిట్ అవ్వడం సినిమా తో తనకు గుర్తింపు వస్తుంది అని భావించింది ప్రియాంక..కానీ అప్పుడు విడుదలయ్యింది ఉండిపోవా పాట..


ఆ పాటను ప్రియాంక శర్మ పడుతున్నట్లుగా చిత్రీకరించి వీడియో సాంగ్ గా విడుదల చేశారు..దేశవిదేశాల నుండి మంచి స్పందన వచ్చింది..మా తమ్ముడు ఇటీవల కర్ణాటకకు వెళ్తే..అక్కడ యువత ఈ పాట పెట్టి డాన్సులు వేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు పాట ఏ స్థాయికి చేరిందో..ఒక యూట్యూబ్ లోనే 30 మిలియన్ మంది ఆ పాటను వీక్షించారు..దింతో ప్రియాంక శర్మకు యూత్ లో మంచి ఫాల్లోవింగ్ ఏర్పడింది..సినిమా కోసం చేసిన ఒక ప్రోమోషల్ ఇంటర్వ్యూ లో నందు..చేసిన ప్రాంక్ తో ప్రియాంక బోరుమని ఏడ్చింది..అది కూడా బాగా ట్రెండ్ అయింది..ఇలా సినిమా విడుదలకు ముందే ప్రియాంక పెద్ద హీరోయిన్ గా మారిపోయారు..సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ హీరోయిన్ గా మారిపోయిన ప్రియాంక శర్మ మరిన్ని సినిమాలు చెయ్యాలని..రానున్న రోజుల్లో స్టార్ హీరోయిన్ గా మారాలి అని కోరుకుంటూ..నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రియాంక శర్మ కు బి.ఆర్.మూవీ జోన్ బృందం తరపున పుట్టిన రోజు శుభాకాంశాలు..