03-12-2020 21:31:25 About Us Contact Us



పెళ్లైన కొత్తలో..యమదొంగ.. నవ వసంతం.. హరే రామ్.. కింగ్.. శంభో..శివ శంభో.. గోళీమార్.. రక్త చరిత్ర వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన దక్షిణాది స్టార్ హీరోయిన్ ప్రియమణి.. ఫామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ తో గత సంవత్సరం భారీ విజయం సాధించారు .. దాదాపు తొమిదేళ్ళ తర్వాత తెలుగులో ఇప్పుడు వరసగా పెద్ద సినిమాలు చేస్తుంది..నిన్న ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన రెండు సినిమాల పోస్టర్లు అందరిని ఆకట్టుకున్నాయి.. 2011 తర్వాత పెద్ద సినిమాలు తెలుగులో చెయ్యలేదు ప్రియమణి.. మధ్యలో రెండు చిన్న చిత్రాలు చేశారు.. కానీ.. ఢీ అనే డాన్స్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉన్నారు ప్రియమణి..


నీది నాది ఒకే కథ సినిమాతో ఘన విజయం సాధించిన వేణు ఉడుముల దర్శకత్వంలో..దగ్గుబాటి రానా కథానాయకుడిగా..సాయి పల్లవి కథనాయికి గా చేస్తున్న సినిమా విరాట పర్వం..1992 కాలంలో జరిగిన విప్లవ పోరాట నేపథ్యంలో జరిగిన కథలా ఇప్పటికే విదులైన పోస్టర్స్ ద్వారా అర్ధమవుతుంది.. మొహం మీద చిరునవ్వు..చేతితో పులను తాకుతూ.. భుజంపై తూటా మోస్తున్న ఒక విప్లవకారిణిగా చాలా మంచి పాత్ర ఉంటుందేమో అనేలా నిన్నటి పోస్టర్ లో ఆమె కనిపించారు.. అయితే.. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాట పర్వం సినిమాలో ‘కామ్రేడ్ భారతక్క’ కూడా అంతే కీలకం.. మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని నమ్మిన పాత్ర ప్రియమణి చేస్తున్నారు అని సినిమా బృందం తెలిపింది.. దింతో కామ్రేడ్ భారతక్క పాత్రలో ప్రియమణి ఎలా చేశారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది..


తమిళంలో స్టార్ హీరో ధనుష్ నటించిన.. గత సంవత్సరం భారీ విజయం నమోదు చేసుకున్న సినిమా అసురన్.. ఈ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ నారప్ప పేరు తో చేస్తున్నారు.. ఇందులో వెంకటేష్ కి భార్య పాత్ర చేస్తున్నారు ప్రియమణి.. ప్రముఖ దర్శకులు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకులు..నిన్న ఈ సినిమా పోస్టర్ లో ఆమె ఒక పల్లెటూరు గృహిణిలా కనిపించారు.. చక్కగా చిరకట్టుకొని.. బొట్టు.. పూలు పెట్టుకొని.. పచ్చని పొలాల మధ్య.. ఎద్దుల బండి పై వెళ్తున్నట్లు కనిపించారు.. రాయలసీమలో జరిగినట్లుగా చూపిస్తున్నారు కనుక రాయలసీమ యాసలో సంపూర్ణ పాత్ర ప్రియమణి తొలిసారి చేస్తుండటంతో ఆమె పాత్రపై ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోయాయి..


దాదాపు 9ఏళ్ళ తర్వాత రెండు భారీ చిత్రాలు చేస్తున్నట్లు పోస్టర్స్ రావడం.. అటు బాబాయ్.. ఇటు అబ్బాయి తో సినిమా చేస్తుండటం.. అవి రెండూ కూడా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ లో నిర్మిస్తుండటం.. రెండు విభిన్న పాత్రలు ఆమె పోషిస్తూవుండటంతో ఆమె తిరిగి తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి సంచలనం అవుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.. నటనపరంగా గతంలోనే విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రియమణి.. తన రీ-ఎంట్రీ తో ఎలా ముందుకెళ్తారో చూడాలి..