24-01-2022 15:46:55 About Us Contact Usమాస్ హీరోగా పేరు తెచ్చుకొని యంగ్ రెబెల్ స్టార్ గా మారిన ప్రభాస్ ను అమ్మాయిలకు దగ్గర చేసిన డార్లింగ్ సినిమా విడుదలై దశాబ్దం పూర్తి చేసుకోవడంతో అభిమానులు సామాజిక మాధ్యమంలో సంబరాలు జరుపుకుంటున్నారు..వారి ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు డార్లింగ్ సినిమా ప్రభాస్ కారియర్ పై ప్రభావం నుండి సినిమా సాధించిన ఘనతలు దాక అందించేందుకే ఈ వ్యాసం….


2009 ‘బిల్లా’కు ముందు వరకు మాస్ ఆడియాన్స్ కి బాగా చేరువైన ప్రభాస్,ఆ సినిమాతో మంచి స్టైలిష్ లుక్స్ తో అమ్మాయిలను సైతం ఆకట్టుకున్నారు..2010లో ‘తొలిప్రేమ’,’వాసు’,’హ్యాపీ’వంటి సినిమాలతో యూత్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే దర్శకుడిగా పేరు పొందిన “కరుణాకరన్’,’ఉలసంగా ఉత్సాహంగా’ సినిమా తరువాత ప్రభాస్ తో చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి..అప్పటికే ‘మగధీర’,’ఆర్య-2′ వంటి సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్ హీరోయిన్..తమిళనాట ‘రజనీకాంత్’ నటించిన ‘కథానాయకుడు’సినిమాకి సంగీతం అందించిన జి.వి.ప్రకాష్ సంగీత దర్శకుడు..దింతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి..తొలి పోస్టర్స్ తోనే ప్రభాస్ లుక్స్ అందరికి నచేశాయి..కార్గో పాంట్స్,లూజ్ గా విందు టి-షర్ట్స్ లలో ప్రభాస్ అదిరిపోయాడు అనే చెప్పాలి..విడుదలైన ట్రైలర్,సాంగ్స్ లో సైతం గత సినిమాలతో పోల్చుకుంటే ప్రభాస్ చాలా కొత్త లుక్స్ తో ట్రెండీగా కనిపించాడు..


జి.వి.ప్రకాష్ ఆరు పాటల ఆల్బమ్ హిట్ అయింది.’హోసాహూరే..’యూత్ సాంగ్ కాగా..’నీవే..నీవే..’పాట అమ్మాయిల కోసం ప్రభాస్ పాడినట్లు ఉంటుంది.’ఇంకా ఏదో’..’,ప్రాణమా.. ‘లాంటి ఫీల్ గుడ్ లవ్ సాంగ్స్ తో పాటు ‘బుల్లె…’ లాంటి మాస్ సాంగ్ కూడా అలరించింది.ఇలా అన్ని పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.పాటలు హిట్ అవ్వడం,ప్రభాస్ న్యూ లుక్ లో కనిపించడం,కరుణాకరన్ లవ్ స్టొరీ అవ్వడం తో సినిమాపై అంచనాలు పెరుతుపోయాయి..


ఏప్రిల్ 22,2010న ప్రభాస్ ‘డార్లింగ్’సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఏ ముహూర్తన దర్శకుడు డార్లింగ్ అని పేరు పెట్టాడో గాని సినిమా విడుదల రోజు నుండి ఇప్పటి దాక తెలుగు అమ్మాయిల మనసు దోచుకుంటున్న డార్లింగ్ అయిపోయాడు ప్రభాస్..మాస్ హీరో నుండి అమ్మాయిల డ్రీమ్ బాయ్ అయిపోయాడు ప్రభాస్..ఈ సినిమా నుండి ప్రభాస్ కు సోలీడ్ లేడీ ఫాన్స్ బేస్ ఏర్పడిపోయింది..హైట్,ఫిజిక్,టి-షార్ట్స్,క్యాప్ తో ప్రభాస్ అమ్మాయిలను మాయ చేసేశాడు..కరుణాకరన్ సినిమాతో ఎంతటి మాస్ హీరో అయినా అమ్మాయిల లవర్ బాయ్ గా మారాల్సిందే అని మరోసారి ఈ సినిమాతో రుజువైంది..

ప్రభాస్,కాజల్ మధ్య ఫస్ట్ హాఫ్,సెకండ్ హాఫ్ లో సీన్లు చాలా బాగుంటాయి..ఇప్పటికి అవి టీవీలో వస్తుంటే చానల్ మార్చడం కష్టమే..ప్రభాస్,తండ్రి ప్రభు కలిసి కనిపిస్తుంటేనే నవ్వు వచేస్తుంటుంది..అలా కుదిరింది వారి ఇద్దరి మధ్య..అటు స్విట్జర్లాండ్,ఇటు గెస్ట్ హౌస్ లో ప్రభాస్ ఫ్రెండ్స్ కూడా బాగా నవ్వించారు,నిజంగా ఫ్రెండ్స్ బ్యాచ్ ఎలా ఉంటుందో ఆ సినిమాలో చూపించినట్లు ఉంటుంది..ఇంటర్వల్ లో ఇప్పటి దాక మనం చేసిందంతా కథ అని చెప్పడంతో ట్విస్ట్ అదిరిపోతోంది..అప్పటిదాక మనం ఫీల్ అయిందంతా కథ అని కొంచం కోపం కూడా వస్తుంది..సెకండ్ హాఫ్ తో మనం పూర్తిగా ఫస్ట్ హాఫ్ మర్చిపోయేలా తీశాడు కరుణాకరన్..అందుకే సినిమా నుంచి బయటకు వచ్చేసరికి మంచి ఫీల్ గుడ్ మివై చూసి వచ్చినట్లు ఉంటుంది..


యూత్,ఫామిలీ,మాస్ అనే తేడా లేకుండా అందరికీ ఈ సినిమా నచ్చింది.పైగా వేసవి కాలం కావడంతో సినిమాను చూసేందుకు ప్రజలు ఆపకుండా సినిమా హాల్స్ కి వచ్చేశారు..ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా పెట్టిన దానికి రెండింతల వస్సులు సాదించింది అంత..అంటే అక్షరాల డబల్ అన్నమాట..అప్పటికే ఛత్రపతి నిర్మించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ కు డార్లింగ్ కూడా హిట్ అయింది.ప్రభాస్ తో రెండు సినిమాలు నిర్మించిన ప్రసాద్ కు రెండు ప్రాఫిట్స్ ను తెచ్చిపెటింది.ఈ సినిమా తర్వాత ప్రభాస్..కాజల్ తో కలిసి ‘Mr.పర్ ఫెక్ట్’ చేసి హిట్ కంబోగా నిలిచారు,కాజల్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించడంతో పాటు క్యూట్ లుక్స్ తో యువతలో చాలామందికి డార్లింగ్ అయిపోయింది..కరుణాకరన్ సైతం డార్లింగ్ సినిమా తర్వాత అంత పెద్ద హిట్ అందుకోలేదు,అంటే ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు..ప్రభాస్ ఈ సినిమా తర్వాత మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ కి చేరువయ్యాడు..డ్రెసింగ్ స్టైల్,లుక్స్ మొత్తం ఈ సినిమా తరువాత పూర్తిగా మారిపోయాయి..


ఇలా అందరికి కారియర్ లకు టర్నింగ్ పాయింట్ గా మారిన డార్లింగ్ సినిమా వచ్చి దశాబ్దం గడిచింది అంటే నమ్మడం కష్టంగానే ఉంది..నాకు మాత్రం నెల్లూరు నర్తకి టీయేటర్ లో కూర్చొని సినిమా చూసిన అనుభూతి ఇంకా గుర్తుంది..చాలా రోజులు అయింది అందరం ఇంట్లోనే ఉన్నంగా ఒక్కసారి మళ్ళీ డార్లింగ్ సినిమా చూద్దాం..!10సంవస్తారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి,కాజల్,శ్రద్ధాదాస్,డైరెక్టర్ కరుణాకరన్,అందరి ‘డార్లింగ్’ రెబెల్ స్టార్ ప్రభాస్ కు,డై హార్ట్ ఫాన్స్ నుండి,సినీ పరిశ్రమ నుండి మా “బి.ఆర్.మూవీ జోన్”టీం తరుపున శుభాకాంక్షలు..!