05-12-2020 13:25:03 About Us Contact Us


ఈశ్వర్ తో పరిచయమై.. వర్షం తో భారీ విజయం సాధించి.. ఛత్రపతి తో యంగ్ రెబల్ స్టార్ గా మారిన అమ్మయిల డార్లింగ్.. ఆరడుగుల మిస్టర్ పర్ఫెక్ట్.. ఉప్పలపాటి ప్రభాస్ రాజు.రేపు(అక్టోబర్23న) అటువంటి బాహుబలి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..!


ప్రముఖ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు మరియు శివ కుమారిల మూడవ సంతానం ప్రభాస్.భీమవరంలో కొద్ది సంవత్సరాలు చదువుకున్న ప్రభాస్.. ఆ తర్వాత హైదరాబాద్ లో పూర్తి చేశారు.పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి వారసుడిగా 2002లో జయంత్. సి. పరంజాయ్ దర్శకత్వంలో.. ఆర్.పి.పట్నాయక్ సంగీత దర్శకుడిగా.. శ్రీదేవి విజయకుమారి హీరోయిన్ గా ఈశ్వర్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.వెంటనే రాఘవేంద్ర సినిమా చేశారు.తొలి రెండు సినిమాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.



2004లో విదులైన వర్షం సినిమాతో భారీ విజయం అందుకున్నారు ప్రభాస్.అక్కడ నుండి అందరికి తెలిసిన చరిత్రే.తాను చేసిన ఒక్కో సినిమాతో తనకంటూ అభిమానులను పెంచుకుంటూ పోయారు ప్రభాస్.ఛత్రపతి.. పౌర్ణమి.. బిల్లా సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు.డార్లింగ్.. మిస్టర్ పర్ఫెక్ట్.. మిర్చి.. సినిమాలతో అమ్మయిల అభిమాన హీరో అయిపోయారు.ఈ మూడు సినిమాల భారీ విజయంతో యువతలో మంచి ఫాలోయింగ్ తో పాటు కుటుంబ ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. పదేళ్ళ సినీ జీవితంలో భారీ విజయాలతో పాటు పరాజయాలను చూసిన ప్రభాస్ అల్ టైం స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు.


అమ్మయిల “డార్లింగ్”.. “పౌర్ణమి” యొక్క “బుజ్జిగాడు”.. “బిల్లా” తో “రెబల్” స్టార్ గా మారిన “మున్నా”.. “మిర్చి” లాంటి “ఈశ్వర్”.. ఇప్పటికీ “ఎక్ నిరంజన్” అంటున్న “అడివి రాముడు”.. “యోగి” “రాఘవేంద్ర” స్వామి భక్తుడు..”వర్షం” తో బాక్స్ ఆఫీస్ లో “చక్రం” తిప్పిన “ఛత్రపతి” ని.. “మిస్టర్.పర్ఫెక్ట్” అంటూ.. “సాహో” “బాహుబలి” అంటూ దేశం కీర్తించింది.ఇప్పుడు “రాధే శ్యామ్” తో మన ముందుకు వస్తున్నారు “ఆదిపురుషు”..



2015లో విడుదలైన బాహుబలి సినిమాతో ప్రభాస్ తెలుగు స్టార్ హీరోల జాబితా నుండి దేశం మొత్తం తెలిసిన ప్రాంతీయ స్టార్ హీరోల జాబితాలో చోటు సంపాదించారు.బాహుబలి 2 విడుదల సమయానికి ప్యాన్ ఇండియా హీరోగా అవతరించారు ప్రభాస్.సాహో.. రాధే శ్యామ్.. ఆదిపురుషు.. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇలా తాను చేస్తున్న ప్రతీ సినిమా.. అన్ని భాషలలో విడుదల చేస్తూ.. భారీ బడ్జెట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు.అటు దక్షణ చిత్ర పరిశ్రమలతో పాటు.. ఇటు బాలీవుడ్ లో సైతం జండా పాటెందుకు ముందుకు వెళ్తున్నారు ప్రభాస్.


రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి వారసుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించి.. యంగ్ రెబల్ స్టార్ గా పేరు పొంది.. వరస విజయాలతో కోట్లాది మంది అభిమాన రెబల్ స్టార్ గా మారారు.ఇప్పుడు ప్రాంతీయ చిత్ర పరిశ్రమ నుండి ప్యాన్ ఇండియా హీరోగా ఎదిగారు.చేస్తున్న సినిమాలు భారీ విజయాలు సాధించి తెలుగు హీరో స్థాయి.. స్టామినా.. దేశ.. విదేశాల్లో ప్రతిధ్వనించాలని కోరుకుంటూ..రేపు (అక్టోబర్ 23న) పుట్టినరోజు జరుపుకుంటున్న రెబల్ స్టార్ ప్రభాస్ గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంశాలు..!