24-01-2022 15:31:23 About Us Contact Us2008లో ఖుషి తర్వాత మళ్ళీ సినిమా హాల్ లో జల్సా చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు 2009 లో వచ్చిన కొమరం పులి వల్ల తీవ్ర నిరాశ పడ్డారు.అప్పుడు దర్శకుడు జయంత్.సి.పరాంజయ్ దర్శకత్వంలో హిందీ సినిమా లవ్ ఆజ్ కల్ రీమేక్ చేస్తున్నట్లు వచ్చిన వార్త వారికి ఆనందాన్ని ఇచ్చింది.ఈ సినిమాకి సంగీత దర్శకుడు మెలోడీ బ్రాహ్మ మని శర్మ గారు.బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా రెండవ సినిమా..త్రిషా,క్రితి కర్బందా హీరోయిన్లు..రీమేక్ సినిమా అయినా ఇప్పటిలాగా ఓ.టి.టి ప్లేట్ ఫార్మ్స్ లేవు కనుక పెద్దగా ఎవరు చూడలేదు


తొలుత విడుదలైన పాటలు అభిమానులనే కాదు,ప్రేక్షకులను సైతం అలరించాయి.తీన్ మార్ లోని ప్రతి పాటకు మంచి ఆదరణ లభించింది.సినిమాపై భారీ అంచనాలు పెంచింది.దీనికి ఆజ్యం పోస్టు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాటలు అందించిన్నట్లు,పవన్ కళ్యాణ్ రెండు పాత్రలు చేస్తున్నట్లు తెలియడం తో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.భారీ అంచనాల నడుమ 2010 ఏప్రిల్ 14న అంటే సరిగ్గా 9 ఏళ్ల క్రితం ఈ సినిమా విడుదలైంది.


పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ నుండి చిగురుబోనియా పాట నుండి త్రిషా ని పబ్ లో కలవడం నుండి అర్జున్ పాల్వాయి వచ్చే దాక సినిమా పవన్ రొమాన్స్ సన్నివేశాలు,మరో పక్క పవన్ మంచి ఎనర్జీ తో ఒక ఖుషి,బద్రి టైమ్స్ ని గుర్తు చేశారు.మైకెల్ యాక్టింగ్ తోనే అభిమానులు రచ్చ రచ్చ చేస్తుంటే,అర్జున్ పాల్వాయి రాకతో సినిమా హాల్స్ దద్దరిల్లాయి.త్రివిక్రమ్ పదునైన మాటలు పవన్ నోటి వెంట వస్తుంటే అభిమానులు జల్సా తో తీన్ మార్ ఏశారు.చివర్లో మైకెల్ విదేశాలలో డైలాగ్ కానీ,తిరిగి వచ్చాక త్రిష తో సన్నివేశాలు,పాటలు బాగా ఆకట్టుకున్నాయి.యువతకి రెండు విభిన్న ప్రేమ కథలతో అలరించాడు పవర్ స్టార్.అసలే వేసవి కాలం కావడంతో సినిమా మంచి వస్సులు సాదించింది.అటు ఫామిలీ ఇటు యూత్ అందరికి ఈ సినిమా నచ్చింది.దింతో పవన్ కాతాలో డీసెంట్ సినిమా పడింది.


ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాటలు,అందులో మరి ముఖ్యంగా మణిశర్మ గారి స్వరాలు.సినిమా ఆరంభంలో చిగురుబోనియా అంటూ విదేశీ పాపలతో పవన్ డాన్స్ చేస్తుంటే అందరూ తైతక్కలు ఆడారు.ఆ తర్వాత బార్బీ బొమ్మకి చెల్లిలివా,ప్రపంచ సుందరివా అంటూ రాసిన బాస్కర్ భట్ల పాటకు అందరూ ఫిదా అయిపోయారు.వయ్యారాల జబ్బిలి పాట,అప్పటి నుండి అల్ టైం మెలోడీ లవ్ ట్రాక్ లో స్థానం సంపాదించిన పాట.మరో మూడు,నాలుగు దశాబ్దాలు గడిచినా ఫ్రెష్ గా వుండే లవ్ సాంగ్ ఆలె,బాలె..ఈ పాటకు త్రిష,పవన్ కళ్యాణ్ జీవించేశారు.ఎవ్వరు ఏమనుకున్న పర్వలే అంటూ స్టెప్పులు వేశారు.జై బోలో శంకర మహారాజ్కీ,బోలో కాశీవిశ్వనాథ్కి,హర హర హర హర మహదేవ్ ॥బోలో॥ తెలుగులో శివుని గురించి టాప్ 10 పాటలు తీసుకుంటే ఈ పాట కచ్చితంగా ఉంది,అదే కాదు టాప్ 10 ఒక నాలుగు మణిశర్మ గారివే ఉంటాయి.శివుని పాట అనగానే మణిశర్మ గుర్తుకురావాల్సిందే.ఆయనకు..శివుని మీద ఉన్న భక్తి,ఇష్టం వల్ల కాబోలు,మణిశర్మ గారి మిగతా పాటలకన్నా శివుని పాటలు అద్భుతంగా ఉంటాయి.చివరిలో వచ్చే గెలుపు తలుపులే.. తీసే.. ఆకాశమే నేడు.. నా కోసమే పాట వినే వారిలో మంచి స్పందన కలిగిస్తుంది.


ఇలా త్రిష,క్రితి కర్బందాలతో పవన్ ఆది పాడి 9ఏళ్ళు.
బండ్ల గణేష్ స్టార్ ప్రొడ్యూసర్ అయి 9ఏళ్ళు.
మణిశర్మ,పవన్ అభిమానులతో తీన్ మార్ ఆడించి 9ఏళ్ళు.
పవన్ డ్యూయల్ రోల్ చేసి 9 ఏళ్ళు.
ఇలా మరెనో రికార్డులు,అనుభూతులు ఇచ్చిన తీన్ మార్ విడుదలై 9ఏళ్ళు.రాస్తుంటే సినిమా విడుదల రోజు జ్ఞపకాలు గుర్తుకొస్తున్నాయి.. చాలా రోజులైంది..మరోసారి చూడాల్సిందే…షో టైం తీన్ మార్..