03-12-2020 21:45:42 About Us Contact Us



తమ్ముడు..తొలిప్రేమ..బద్రి..ఖుషి..జల్సా..గబ్బర్ సింగ్..అత్తారింటికి దారేది..వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా చూపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని నిత్యం తపించిపోయే ఆ పుస్తక ప్రియుడు..ప్రజల కోసం కెర్రీర్ పీక్స్ స్టేజ్ లో ఉన్న సమయంలో రాజకీయాల వైపు అడుగులు వేశారు..దింతో 2018 జనవరి నుండి వెండితెర పై ఆయన కనిపించలేదు..సంపూర్ణంగా సినిమాలు వదిలేసేందుకు సిద్ధపడిన జనసేనాని..తాను 2018కి ముందు ఇచ్చిన మాట కోసం తిరిగి మళ్ళీ సినీ రంగంలోకి అడుగు పెట్టారు..ఎప్పుడు లేని విధంగా తన పందాకు పూర్తి భిన్నంగా విరామం లేకుండా సినిమాల షూటింగ్స్ లో పాలుగున్నారు..నిజానికి అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సంవత్సరం మే నెలలో ఒక సినిమా.. డిసెంబర్ నెలలో లేదా వచ్చే సంక్రాంతికి మరో సినిమా..వచ్చే సంవత్సరం చివరి నాటికి మరో రెండు సినిమాలు విడుదల కావాలి..కానీ కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ కారణంగా మొత్తం అన్ని పనులు ఆగిపోయాయి..


పవన్ 26వ సినిమాగా హిందీ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన పింక్ సినిమా రీమేక్..దీనికి వకీల్ సాబ్ అని టైటిల్ ఖరారు చేశారు..ఇందులో లాయర్ గా కళ్యాణ్ గారు కనిపించనున్నారు..వేణు శ్రీరామ్ దర్శకుడు..థమన్ స్వరాలు అందిస్తున్నారు..బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు..శిరీష్ నిర్మిస్తున్నారు..ఇప్పటికే “మగువా..మగువా..”అనే పాట విడుదల చేశారు..చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా ప్రభుత్వ అనుమతులతో జూన్ మొదటి వారం నుండి షూటింగ్ ప్రారంభించి..వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది..


27వ సినిమాగా పవన్ కళ్యాణ్ గారికి ఖుషి వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఏ.ఎం.రత్నం గారు నిర్మిస్తున్నారు..వేదం..కంచె..వంటి క్లాసిక్ సినిమాలు చేసిన క్రిష్ జాగర్లమూడి..ఈ సినిమాకు దర్శకులు..ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని..షూటింగ్ ప్రారంభమైంది..అయితే కరోనా లాక్ డౌన్ తో సినిమా పనులు పూర్తిగా ఆగిపోయాయి..జులై రెండవ వారం నుండి సినిమా చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ గారు చేరనున్నట్లు సమాచారం..వచ్చే వేసవిలో సినిమా మన ముందుకు వచ్చే అవకాశం ఉంది..ఇప్పటికే ఈ సినిమాకు వీరుపక్ష అనే టైటిల్ అనుకుంటున్నట్లు..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిది ఒక cow boy వంటి పాత్ర అని..ఔరంగ్ జెబ్ కాలంలో నాటి కధ అని. వార్తలు వస్తున్నా ఎక్కడా అధికారిక ప్రకటన లేదు..



28వ సినిమా..ఒక అభిమాని..తన అభిమాన నటుడిని దర్శకత్వం చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుందో.. గబ్బర్ సింగ్ సినిమా చూపించింది..పవర్ స్టార్ అభిమానులకు చాలా సంవత్సరాలు తర్వాత ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా..కళ్యాణ్ గారి వీరాభిమాని..హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాసింది..8 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ 28వ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం..దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నరు..మైత్రి మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తున్నారు..గబ్బర్ సింగ్ టీం మళ్ళీ జత కట్టడంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి..ఇప్పటికే హరీష్ శంకర్ కు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నుండి సామాజిక మాధ్యమంలో బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అని విన్నపాలు అందుతున్నాయి..ఈ ఏడాది చివర్లో లేదా..వచ్చే సంవత్సరం ప్రారంభంలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది..ఇప్పటికే మరో సినిమా ప్రకటించిన హరీష్..ఈ సినిమా తర్వాతే మిగతావి అని కూడా ప్రకటించారు..ప్రసృతం..ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి..


29వ సినిమా..ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి తో గోపాల..గోపాల..కాటమరాయుడు..వంటి రెండు రీమేక్ సినిమాలకు దర్శకత్వం వహించిన డాలీ..ఈ సారి తానే స్వయంగా ఒక కథ సిద్ధం చేశారట..ఇప్పటికే లైన్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్..పూర్తి కథతో రావాలి అని కోరినట్లు సమాచారం..ఆ పనుల్లో నిమగ్నమయ్యారు డాలీ..మాస్ మహరాజ్ రవితేజ తో వరసగా రెండు సినిమాలు నిర్మించిన రామ్ తళ్లూరి ఈ సినిమాకు నిర్మాత..ఇప్పటికే ఆయనతో సినిమా చేసేందుకు పవన్ కళ్యణ్ గారు మాట ఇచ్చారట..కథ నచ్చితే డాలీ తోనే సినిమా సెట్స్ పైకి వెళ్తుంది..లేకుంటే దర్శకుడు మారే అవకాశం ఉంది..కానీ రామ్ తళ్లూరి నిర్మాతగా కొనసాగుతారు..ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటన వెలుపడలేదు..


ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..2021 చివరి దాక బిజీ..బిజీ..గా గడపనున్నారు..అయితే తన తొలి ప్రాధాన్యత ప్రజా సమస్యలని..ప్రజలకు అవరసరం అంటే తాను షూటింగ్ కు రాలేను అని..ఇప్పటికే నిర్మాతలతో స్పష్టం చేశారట..ప్రజల కోసం వెళ్తున్నారు కనుక దీనికి పూర్తిగా అంగీకరించారట..నిర్మాతలు…