24-01-2022 16:46:34 About Us Contact Us


అప్పుడెప్పుడో ఎన్టీఆర్,చిరంజీవి రోజుల్లో మల్టిస్టార్ల సినిమాలు బాగా వచ్చేవి.20వ దశబ్దంలో మటుకు మనకు తెలుగు సినీమాలలో మల్టిస్టార్ల సినిమాలు లేవు.మంచు ఫ్యామిలీ నుండి మోహన్ బాబు,మనోజ్,విష్ణు కలిసి కనిపించినా,రామ్ చరణ్,అల్లు అర్జున్ కలిసి నటించినా ప్రక్షుకులకు మాత్రం అవి పెద్దగా మల్టిస్టార్ల సినిమా అని అనిపించలేదు.ఆ తర్వాతి రోజుల్లో వెంకటేష్ ముందుకు వచ్చి,మహేష్,పవన్,రామ్,వరుణ్ తేజ్ లాంటి వాళ్ళతో చేసినా ప్రేక్షకులు ఇంకా ఏదో కావాలి అని కోరుకున్నారు.

వారి ఉదేశంలో మల్టిస్టార్ల సినిమా అంటే రెండు వేరు వేరు కుటుంబాల స్టార్ హీరోలు కలిసి చెయ్యాలి అని.దీనికి భారీ వ్యయంతో పాటు ఒక పెద్ద కథ కూడా కావాలి.అది సాధ్యమా అని అందరూ భావిస్తున్న సమయంలో ప్రభాస్,రానాలతో రాజమౌళి ముందుకు వచ్చాడు.బాహుబలి సినిమా ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చినా ప్రేక్షకులు దానిని మల్టిస్టార్ల సినిమాలా పరిగణించలేదు.సరిగ్గా అప్పుడే జక్కన్న రామ్ చరణ్,తారక్ లతో సినిమా ప్రకటించారు.ఇది మల్టి స్టార్స్ సినిమా అని ప్రతి ఒక్కరు చెప్పుకొచ్చారు.ఒక్కసారిగా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది.ఇప్పుడు తాజాగా టైటిల్,రామ్ చరణ్ లుక్ బయటకు వచ్చింది.ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.దీంతో మల్టిస్టార్ల సినిమాలు రానున్న కాలంలో మరిన్ని వస్తాయి అని ఆశిస్తున్నట్లు కొందరు సామాజిక మద్యమలలో పోస్టులు పెడుతున్నారు.

సరిగ్గా ఇక్కడే ఒక పెద్ద చర్చకు తెర లేచింది.ఇంతటి భారీ మల్టిస్టార్ సినిమాకు మించిన కాంబినేషన్ మళ్ళీ వస్తుందా అని.ఇంతలో చిత్ర పరిశ్రమ నుండి ఒక వార్త వినిపిస్తుంది.దీనికి మించిన కాంబినేషన్ తో అతి భారీ చిత్రం ఒకటి రానున్నది అనేది ఆ వార్త సారాంశం.సినిమా గురించి తెలుసుకునేందుకు ప్రయతించగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలకు ఒక్కపుడు కేర్ ఆ అడ్రస్ గా మారిన గీతా ఆర్ట్స్,అంతా పెద్ద సినిమా చేసి చాలా రోజులయింది.మరో పక్క దేశ స్థాయి సినిమా ఒక్కటి చెయ్యాలి అని దిల్ రాజు సైతం భావిస్తున్నారని,ఇప్పటికే అలాంటి ప్రయత్నంగా భారతీయుడు 2 నిర్మాణంలో భాగమై తప్పుకున్న విషయం తెలిసిందే.దింతో ఈ సారి పెద్ద సినిమా ప్రకటిస్తే అది విడుదల అవ్వాల్సిందే అని అలాంటి కాంబినేషన్ కొరకు ఎదురు చేస్తున్నారట.ఇది తెలుసుకున్న గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్,నేను కూడా ఒక పెద్ద సినిమా అని అనుకుంటున్నాను.ఇద్దరం కలిసి ఒక పెద్ద సినిమా తీయాలి అని అన్నారట,దీనికి ఏకీభవింరాట దిల్ రాజు,అది మల్టీ స్టార్ సినిమా అయితే బాగుంటుంది అని అనుకున్నారట.దింతో ఇద్దరు పెద్ద నిర్మాతలు,భారీ కాంబినేషన్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారట.ఇదంతా ప్రారంభమై ఇప్పటికే ఆరు నెలలు గడించిందట.

ఇంతలో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రి-ఎంట్రీ ఇచ్చారు,పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చెయ్యాలి అని ఉంది అని ఇప్పటికే ఒక ఇంటర్వ్యూ లో కొరటాల శివ చెప్పిన విషయం గుర్తుకొచ్చిన అల్లు అరవింద్.కొరటాల శివను కలిశారట.చిరంజీవి గారి సినిమా తర్వాత తనతో ఒక సినిమా చెయ్యాలి అని కుదిరితే పవన్ కళ్యాణ్ కి తగిన కథ ఒక్కటి సిద్ధం చెయ్యండి అని అడిగారట.అలా వారి మాటల సందర్బంలో ఇలా పెద్ద మల్టిస్టార్ సినిమా ఒకటి తాను,దిల్ రాజు అనుకుంటున్నట్లు చెప్పరాట.ఇది విని వదిలేసిన కొరటాల శివ.కొద్దీ రోజుల తర్వాత అల్లు అరవింద్,దిల్ రాజులను కలిసి తాను ఎప్పుడో 10 సంవత్సరాల ముందు రాసుకున్న ఒక పెద్ద కథను దాదాపు రెండు గంటల పాటు పూర్తిగా చెప్పరాట.మొత్తం విన్న ఇద్దరు కథ అద్భుతంగా ఉంది ఆ ఇద్దరు హీరోలు ఎవరనుకుంటున్నారు అని అడుగగా చెప్పేందుకు మొహమాటపడ్డారట శివ.సరే ఏదైతే అది అయింది అని మహేష్ బాబు,పవన్ కళ్యాణ్ అని అనుకుంటున్నట్లు ఒక పెద్ద బాంబ్ పేల్చారట.దాదాపు రెండు నిమిషాల నిశ్శబ్దం తర్వాత అల్లు అరవింద్,కొరటాల శివ కు కరచాలనం చేస్తూ,మనం చేస్తున్నాం అని చెప్పి బయటకు వెళ్లిపోయారట.ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఇండస్ట్రీలో బాగానే వినిపించిందట.పవన్ అటు సినిమాలు,ఇటు రాజకీయాలలో బాగా బిజీగా ఉండడంతో ఆయనకు ఈ విషయం చెప్పలేదు,మహేష్ సైతం విదేశాలలో ఉండడంతో కొరటాల శివ కూడా చిరంజీవి 152వ సినిమా ఆచార్య సినిమా పనులలో బిజీ అయిపోయారు.

విదేశాల నుండి తిరిగి వచ్చిన మహేష్ ను కలవల్సిందిగా దిల్ రాజు చెప్పగా ఇద్దరం వెళ్దాం అని అన్నారట.శివ కేవలం లైన్ చెప్పగానే మీ మీద నమ్మకం ఉంది మనం చేద్దాం పూర్తి కధ మరోసారి వింటాను అని చెబుతూ మరో హీరో పాత్ర ఎవరు చేస్తారు అని అడగగా పవన్ కళ్యాణ్ అని బదులు ఇచ్చారట దిల్ రాజు.మహేష్ బాబు ఒక్కసారిగా “ఈ కథ ఆయనకు చెప్పారా,దీనికి కళ్యాణ్ గారు ఒప్పుకున్నారా” అని కుతూహలంగా అడిగారట.ఇంకా లేదని,ఇక ఎలా ఈ సినిమా చర్చలు ప్రారంభం అయ్యిందో మొత్తం వివరించారట దిల్ రాజు.నేను సిద్ధమే కానీ ఆయన చెయ్యాలి కదా అని చెప్పి,ఆయన సరే అని చెప్పాకే పూర్తి కథ వింటాను అని చెప్పరాట.

దీంతో స్కీన్ పవన్ కళ్యాణ్ ఇంటికి షిఫ్ట్ అయింది.ఈ సారి ఇద్దరు నిర్మాతలుతో కలిసి దర్శకుడు,పవన్ ఇంటికి చేరుకున్నారు.కొరటాల శివని చూసిన పవన్ అన్నయ్య ఆచార్య సినిమా గురించి ఆరా తీశారట.కధ చెప్పకుండా ముందు అల్లు అరవింద్ అసలు మొత్తం ఏమి జరిగిందో చెప్పరాట.మహేష్ బాబుకి కధ చెప్పినట్లు ఆయన ఒప్పుకునట్లు కూడా చెప్పడంతో పవన్,ఆయన ఒప్పుకున్న తర్వాత నేను చెయ్యను అని చెప్పడం భావ్యం కాదు.నేను కూడా చేస్తాను,కానీ కధ బాగుండాలి,ఇలా మేము కలిసి చేస్తే రానున్న రోజుల్లో మరిన్ని మల్టీ స్టార్ సినిమాలు వచ్చేలా ఉండాలి అంటే కానీ,వెనక్కి వెళ్లేలా ఉండకూడదు అని అన్నారట.కొంచం బిజీగా వున్నాను సమయం దొరికినప్పుడు మీ కధ వింటాను అని చెప్పి,మహేష్ గారికి నేను ఒప్పుకున్నట్లు,ఆయన చెయ్యడానికి ముందు వచ్చినందుకు ధన్యవాదాలు తెలపమని చెప్పరాట.ఇది జరిగి దాదాపు 10-15 రోజులు గడించిన తర్వాత దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు.దింతో సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి.

ఆచార్య తదుపరి పనుల చేసుకుంటూ వెళ్తున్న కొరటాల శివకు కళ్యాణ్ గారి వద్ద నుండి ఫోన్ వచ్చిందట. ఈ ఆదివారం నేను ఖాళీగా ఉంటాను,మీకు ఇబ్బంది లేకుంటే వీడియో కాల్ ద్వారా కధ వింటాను అని అన్నారట.సరే అని చెప్పిన కొరటాల శివ ఈ లోపే మహేష్ కి స్క్రిప్ట్ పూర్తిగా చెప్పి ఒకే చేసుకున్నారట.మార్చ్ 29న పవన్ కు కధ వీడియో కాల్ ద్వారా చెప్పగా ఆయన వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.పవన్ ఇక సినిమాల నుండి పూర్తిగా తప్పుకొని రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు,సామాజిక స్పృహ కలిగిన కధ,మరో పక్క మల్టీ స్టార్ సినిమా కావడంతో ఈ సినిమాతోనే తాను సినిమాలు వదిలేస్తాను అని శివకు చెప్పి వీడియో కాల్ కట్ చేశారట.ఆ సాయంత్రం మహేష్,పవన్,దిల్ రాజు,అల్లు అరవింద్,కొరటాల శివ గ్రూప్ వీడియో కాల్ లో మాట్లాడుకున్నట్లు,దీని దాదాపు 5 భాషలలో విడుదల చెయ్యాలి అని నిర్ణయించుకున్నారట,అయితే ఈ సినిమాకు మాటలు రాసేందుకు త్రివిక్రమ్ ని పవన్ సూచించినట్లు దానికి అందరూ ఏకీభవించినట్లు,త్రివిక్రమ్ కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు.ఈ కరోనా వైరస్ మన దేశం నుండి పూర్తిగా పోయిన వెంటనే ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి దీని అధికారికంగా ప్రకటిద్దాం అని చెప్పరాట పవన్.కనుక అన్ని అనుకున్నట్లు జరిగితే మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో ప్రకటించనున్నారట.

అంటే రెండు పెద్ద సంస్థలు గీతా ఆర్ట్స్,ఎస్.వి.సి.సి. బ్యానర్లో వరస విజయాలు అందుకుంటున్న కొరటాల శివ దర్శకత్వంలో,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించగా,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భారీ సినిమా ప్రకటన త్వరలో..,

ఈ కాంబో పై నా మాట:-

గతంలో అంటే ఒక దశాబ్దం ముందు మన తెలుగు పత్రికలలో ఒక వార్త ప్రధాన పత్రికలో మొదటి పేజీలో వచ్చేది.ఆ తర్వాతి రోజు ఆ వార్త అవాస్తవం అని,ఇది కేవలం ఏప్రిల్ 1న ఫూల్స్ డే కనుక అలా ప్రచురించాము అని చావు కబురు చల్లగా చెప్పేవారు.కొద్దీ రోజులకి అది మొదటి పేజీలో సంగం వార్త రాసి,మిగతా వార్త కోసం ఫలానా పేజీలో అని ఉంటుంది తియ్యగా అది ఏప్రిల్ ఫూల్ అని ఉంటుంది.కానీ ఇప్పుడు అలాంటివి కనిపించడం లేదు,పైగా కరోనా వల్ల పేపర్లు,టీవీలు అదే వార్తలు చూపిస్తూ ఫూల్స్ డే అనే రోజుని కూడా పక్కన పెట్టారు.అందరూ ఇంట్లో వుంటారు కానున్న పైగా కరోనా వార్తలతో టెన్షన్ పడుతున్నాము కనుక కాసేపు అందరూ సరదాగా నవ్వుకుంటారు అని ఈ వార్తను వేస్తున్నాము.ఇందులో ఏ ఒక్క మాట నిజం కాదు.ఇలా వారి పేర్లు తీసుకునేందుకు పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,దిల్ రాజు,అల్లు అరవింద్,కొరటాల శివ,త్రివిక్రమ్ గార్లను క్షమించమని కోరుతున్నాము.మీరు,ఈ రోజు ఎవరైనా ఫూల్ చెయ్యాలి అని అనుకోని ఇంట్లో ఉన్నమే ఎట్లా అనుకుంటే ఈ వార్త కథనాన్ని వారికి పంపండి.కాసేపు అందరూ సరదాగా నవ్వుకోండి.మళ్ళీ ఇలాంటి వార్త మా వెబ్సైట్ లో చూడాలి అనుకుంటే ఇంకో సంవత్సరం ఆగాల్సిందే.