24-01-2022 16:22:05 About Us Contact Usఅలా సరదాగా కాసేపు బంధు..మిత్రులతో గడపాలి అంటే మన తెలుగు వారికి స్వాతంత్రం రాక ముందు నుండి తెలిసిన ఒక పని..సినిమా హాల్ కి వెళ్ళి ఒక సినిమా చూసి రావడం..మన తెలుగు ప్రేక్షకులు అదే టాకీస్ లో మూగ సినిమాలు చూశారు..పరాయి భాష సినిమాలు చూశారు..ఆ తర్వాత మన తెలుగు సినిమాలు వచ్చాక వాటిని చూస్తూనే ఉన్నారు..దేశంలో ఏ ప్రాంతీయ భాషకు మనకు ఉన్న సినిమా హాల్స్ ఉండవు..రెండు తెలుగు రాష్ట్రాలలో మాస్ హాల్స్ నుండి మల్టీ ప్లక్స్ దాక 2800 పైన స్క్రీన్లు ఉన్నాయి..నిత్యం సినిమా తోరణాలతో వచ్చే ప్రక్షుకులతో కళ కళ లాడే సినిమా హాళ్లు రెండు నెలలు నుండి బోసి పోయాయి..కానీ అవి తిరిగి సాధారణ స్థితికి రావడం ఖాయం..!అలాంటి సినిమా హాళ్లకు ఇప్పుడు ఓ.టి.టి వల్ల ఏదో అయిపోతుంది అంటే నమ్మడం ఎలా.!?


1995లో తెలుగు నాట ఈటీవీ..జెమినీ..అంటూ బుల్లితెర అని పిలిచే టీవీలో తెలుగు భాష లో వినోదాన్ని అందించే చానెల్స్ వచ్చాయి..వీటి తర్వాత టెలివిజన్ రంగం మన తెలుగులో బాగా అభివృద్ధి చెందింది..ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో టీవీ ఉంది..సినిమాలు టాకీస్ లో వచ్చి వెళ్ళాక వాటిని టీవీలో వెయ్యడం ప్రారంభమైంది..అయినా సినిమా హాల్ కు ప్రేక్షకులు రావడం ఆపలేదు..నిజానికి ఆ 90 చివల్లో నుండి తెలుగు నెల పై అనేక సినిమా హాల్స్ పుట్టుకొచ్చాయి..మల్టీ ప్లక్సులు వచ్చాయి..ఇంట్లో కూర్చొని చేతిలో రిమోట్ నొక్కుతూ ఇష్టం వచ్చిన ఛానల్ మార్చుకునే అవకాశం సగటు ప్రేక్షకుడికి ఉన్నా సినిమా హాల్ కి మాత్రం వస్తూనే ఉన్నారు..


టెలివిజన్ రంగం వల్ల నష్టం రాలేదు అని సినిమా హాళ్ళు ఊపిరి పీల్చుకునే లోపే..డి.వి.డి ప్లేయర్ లు వచ్చాయి..విడుదలైన కొద్దీ రోజులకే చిత్ర బృందలు సీడీలు రూపంలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేలా చేశారు..టివితో పాటు డి.వి.డిలు కూడా ప్రతి ఇంట్లో సాధారణం అయిపోయాయి.. కేవలం రెండు టికెట్ల ధరతో ఎంత మందైనా..ఎన్ని సార్లైనా చూసే అవకాశం డి.వి.డి రూపంలో ఇంట్లో వున్నా..ప్రేక్షకుడు సినిమా హాల్ కు రావడం మానలేడు..


ఆ డివిడి వచ్చాక చిత్ర పరిశ్రమ అతి పెద్ద సమస్యను ఎదురుకుంది..తొలిసారి ఆ భూతం తెలుగు నేల పై అడుగు పెట్టింది..అదే పైరసీ..2004నాటికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు స్వయంగా వెళ్ళి సిడి షాప్ లో తన సినిమా పైరసీ సీడీలు తగలపెట్టాల్సి వచ్చింది అంటే..ఏ స్థాయిలో పైరసీ జరిగిందో అర్థం చేసుకోవచ్చు..హాల్ లో కెమెరాతో తీసి వాటిని ఒకే డి.వి.డి లో కొత్తగా వచ్చిన మూడు నాలుగు సినిమాలు అమ్మేవారు..అయినా సినిమా హాల్స్ కు ఏమి కాలేదు..2013 సమయానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదలకు ముందే 90నిమిషాల సినిమా బయటకు వచ్చింది..కానీ థియేటర్ లో ఆ సినిమా భారీ ఓపెనింగ్స్ తో పాటు మంచి వసూళ్లు సాదించింది..ఇప్పుడు సినిమా విదులైన ఒకటి రెండు రోజుల్లోనే కొన్ని వెబ్ సైట్స్ లో సినిమా పైరసీ వచ్చేస్తుంది..ఒక రకంగా చెప్పాలి అంటే చిత్ర పరిశ్రమ పైరసీ తో కలిసి జీవిస్తుంది..అయినా సినిమా హాల్ కి ప్రేక్షకుడు రాక ఆగలేదు..తన మొబైల్ లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉన్నా ప్రేక్షకుడు 100 రూ కు మించి ఖర్చు పెడుతూ సినిమా హాల్ లో సినిమా చేస్తున్నాడు..


మరి ఇప్పుడేదో కొత్తగా ఓ.టి.టి.లు వచ్చాయి..సినిమా విడుదలైన నెలా,రెండు నెలల్లోనే సినిమాను అందులో విడుదల చేస్తున్నారు..ఈ కరోనా కారణంగా ఏకంగా సినిమాలు కొన్ని నేరుగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు..అంత మాత్రాన ప్రేక్షకుడు సినిమా హాల్ కి రాకుండా పోతాడా..!?తన అభిమాన నటుడు సినిమా తొలిరోజు తొలి ఆట కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి..భారీగా డబ్బులు ఇచ్చి మరీ సినిమాను చూస్తున్న ఆ అభిమాని హాల్ కి రావడం మానేస్తాడా?కుటుంబంతో సరదాగా గడిపేందుకు పిల్లలతో కలిసి వారానికో..రెండు వారాలకో సినిమా హాల్ కి వచ్చే ఆ కుటుంబం ఇప్పుడు సినిమా హాల్ కి రావడం మానేస్తుందా..వారం అంతా ఆఫీస్ లో టెన్షన్ తో గడిపే యువత..మిత్రులతో కలిసి ప్రతి వారం చివర్లో ప్రశాంతత కోసం సినిమా హాల్ కి వస్తుంటారు..ఇప్పుడు వారు రావడం ఆగిపోతారా.!?ఇంటర్ నుండి..బీటెక్..డిగ్రీ..అంటూ కాలేజీలలో చదివే విద్యార్థులు..బంక్ కొడితే మిత్రులతో సమయం గడిపేందుకు హీరో..హీరోయిన్ పేర్లు తెలియక పోయినా దగ్గరల్లో వుండే ఏదో ఒక సినిమా హాల్ లో దూరుతారు..వారు ఇప్పుడు రావడం మానేస్తారా.!?


కాసేపు మన వారితో కలిసి సరదాగా ప్రపంచాన్ని పరిచిపోయి..చీకటి గదిలో ముక్కుమొహం తెలియని వారితో మూడు గంటల పాటు వెండి తెరపై పెద్ద పెద్ద మనుషులుగా కనిపించే ఆ వెండితెరను చూస్తూ మరో ప్రపంచంలోకి వెళ్ళి..ఆ ప్రపంచంలో వచ్చిన ఆనందాన్ని..బాధని..తాను ఆస్వాదించి..అందరితో కాసేపు సమయం గడిపి..తిరిగి తన ప్రపంచంలోకి వచ్చే ఆ సగటు సినీ అభిమాని..ఎప్పటికి హాల్ కు రావడం మానదు..బహుశా కరోనా తెచ్చిన ఆర్థిక మాంద్యం వల్ల సినిమా హాల్ రావడం కొంత తగ్గిస్తాడు ఏమో గాని..అసలు రావడం మాత్రం ఆగడు..అలా ఆగే వాడైతే టెలివిజన్ రంగం వచ్చినపుడో..డివిడి వచ్చినపుడో..ఫ్రీగా పైరసీ దొరుకినప్పుడే ఆగిపోయేవాడు..ఇవన్ని ఉన్నా సినిమా హాల్ కి వస్తున్న ప్రతి సినీ అభిమాని ఎప్పటికి సినిమాని ఆ సినిమా థియేటర్ లోనే చూస్తాడు..చిత్ర పరిశ్రమ కూడా ఆ టికెట్ ధర పై దృష్టి సారించాలి..అలానే రెండు తెలుగు ప్రభుత్వాలు సైతం కొంత టాక్స్ లో రాయితీ..ఎక్కువ షోలు వేసుకునే అవకాశం లాంటివి కలిపిస్తే..వచ్చే వేసవి ముగిసే సమయానికి సినిమా హాళ్లకు మళ్ళీ పూర్ణవైభవం వస్తుంది..