03-12-2020 22:08:43 About Us Contact Us



ప్రపంచానికి తెలుగు వారి ఖ్యాతి తెలిసేలా..మన తెలుగు సినిమా స్థాయిని..ప్రపంచ సినిమా స్థాయికి పెంచి..తిరుమల శ్రీవారిని దర్శిచుకోవడానికి వచ్చిన భక్తులు..తమిళనాట..తన ఇంటికి వచ్చి మొక్కే స్థాయికి చేరిన మహనీయుడు..యుగ పురుషుడిగా కీర్తింపబడుతున్న..విశ్వ విఖ్యాత నట సార్వభౌమ..నందమూరి తారక రామారావు గారి జయంతి నేడు..


మే 28 అంటే తెలుగు వారు తప్పక గుర్తుకొచ్చేస్తుంది..తారక రాముని పుట్టిన రోజు అని..పౌరాణికాలలో ఆయన చేసిన నటన అద్భుతం..అనితర సాధ్యం..ఆ కాలంలో చాలా మందికి దేవుడి రూపం అంటే ఆయనే గుర్తుకొచ్చే వారు అంటే..ఆనాడు ఆయన చూపిన ప్రభావం అది..ఏ పాత్రనైనా ఆలోవకగా చేస్తూ..తెలుగు సినిమాకి అన్నితానై నిలిచారు..ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు చేరిన ఆ యువకుడు..నటుడిగా జీవనం ప్రారంభించి..ప్రజలచే నీరాజనం అందుకున్నారు..ఆయన కళ్ళల్లో తేజస్సుకు అంతా దాసోహం అన్నారు..కొన్ని కోట్ల మంది చేత అన్నగారు అని పిలుపిచుకున్నారు..


ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు లేకుండా తెలుగు సినీ పరిశ్రమ చరిత్ర చెప్పడం అసాధ్యం అనే శిఖరాగ్ర స్థాయికి చేరుకున్నారు..ఆయన అభిమానులే ఒక తరం నటులు.. దర్శక నిర్మాతలు..ఆ పేరు ఎప్పుడు ఎక్కడ విన్నా తెలుగు వాడు మా తెలుగోడు అని గర్వంగా దేశ..విదేశాల్లో..కొన్ని దశాబ్దాలుగా చెప్పుకుంటున్నారు..ఆయన నటన..నాట్యం..హావభావాలు గురించి కొత్తగా తెలుగు వారికి చెప్పడానికి ఏమి లేదు..


సినీ రంగం వదిలి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి అడుగు పెట్టి కాంగ్రెస్ ని కాదని కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టిన తొలి నటుడు నందమూరి తారకరామారావు…దెబ్బకి 9 నెలల్లోనే కనీవినీ ఎరుగని మెజారిటీ తో ప్రభుత్వాన్ని స్థాపించారు..ప్రజలకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు..సినీరంగంలో ఏకచక్రాడిపత్యంగా ఏలిన ఆ తారకరముడు..ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి..అదే రాజకీయ కుట్రలకు బలైపోయ్యారు..అయినా ఆయనను గుర్తు చేసుకోకుండా రోజు గడవడం తెలుగువారికి కష్టమే..సినిమా గురించో..రాజకీయం గురించో..ప్రజలకు సేవా కార్యక్రమాల గురించో..ప్రభుత్వంలో సంస్కరణల గురించో..ఇలా ఏది మాట్లాడినా దేని గురించి పెరస్తావించినా..ఆయన పేరు రాక మానదు..అంతటి స్థాయికి చేరిన ఆ మహానియుడిని..నేడు ఆయన 97వ జయంతి సందర్భంగా మరోసారి మనసారా స్మరించుకుందాం..