05-12-2020 13:36:25 About Us Contact Us



1998లో “The Monkey Who knew Too much” అనే భారతీయ ఇంగ్లీష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేసిన కన్నడ అమ్మాయి నిత్యా మీనన్.ఆ తర్వాత 2006లో కన్నడలో “Seven’O,Clock”అనే సినిమాతో హీరోయిన్ గా తన సినీ ప్రస్థానం ప్రారంభించింది.2006 నుండి 2010 మధ్య అటు కన్నడ,ఇటు మలయాళంలో కలిసి 9 సినిమాలు చేసింది.2010లో తెలుగు మహిళా దర్శకురాలు ‘నందిని రెడ్డి’చిత్రీకరించిన “అలా మొదలైంది” సినిమాలో ‘నాని’కి జోడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆ కన్నడ అమ్మాయి.


తెలుగునాట తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకుంది,మరి ముఖ్యంగా ఆమె కళ్ళతో తాను పలికే భావాలకు యువత ఫిదా అయిపోయారు.2012లో ‘నితిన్’ తో కలిసి “ఇష్క్” సినిమా చేసింది నిత్యా,ఈ సినిమాతో తెలుగులో మరో భారీ విజయంతో పాటు యువకుల మనసు దోచేసింది నిత్యా,ఆనాటి నుండి అమెకంటూ తెలుగులో ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడిపోయింది.ఇక అదే ‘నితిన్’ తో చేసి “గుండె జారీ గల్లంతయ్యిందే”తో చక్కని హిట్ అందుకుంది.2014లో వచ్చిన “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు”సినిమాలో తన నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి.దింతో ఆమె ఒక స్టార్ హీరోయిన్ గా తెలుగులో నిలపడిపోయ్యారు.


2015లో అల్లు అర్జున్,త్రివిక్రమ్ ల కలయిక లో వచ్చిన “సన్ ఆఫ్ సత్యమూర్తి”,గుణశేఖర్ తెరకెకించిన “రుద్రమదేవి”సినిమాలలో సినిమాలో బలమైన పాత్రలలో చేసి,హీరోయిన్ గా మాత్రమే కాక కధ,పాత్ర నచ్చితే ఎటువంటి పాత్ర చేసేందుకైనా రెడి అనే సంకేతాలను ఇచ్చింది ‘నిత్యా మీనన్’.కారియర్ పీక్స్ కి వెళుతున్న సమయంలో ఇలాంటి బోల్డ్ డెసిషన్ తీసుకోవడం ఈ తరం నటిమణులలో నిత్యకు మాత్రమే సాధ్యమైంది.ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగులో సినిమాలు చేసినా అవి విజయాలు సాధించలేదు.


2018లో “awe” ,”గీతా గోవిందం”,”ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమాలలో చేసి మెప్పు పొందింది.అడపాదడపా డబ్ అవుతున్న తమిళ సినిమాలలో తెలుగు ప్రక్షుకులకు కనిపిస్తూనే వున్నారు నిత్యా.అయినా తెలుగులో అమెకున్న అభిమానులు కోసం మరో మంచి సినిమాతో తెలుగులో చెయ్యాలి అని ఆశ పడుతున్నారు.ఇప్పటికి తెలుగు యుటవతలో నిత్య ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు,ఆమె అభినయం చూసిన ఎవరైనా అంత త్వరగా ఎలా మర్చిపోయారు ఆమెని!?5భాషల్లో,14 సంవత్సరాల కాలంలో 56 సినిమాలు చేశారు నిత్యా.నేటి తరం హీరోయిన్ కి ఇది అంత చిన్న కెరీర్ కాదు.మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి భాషలో నిత్యా కాతాలో హిట్ సినిమా ఉంది.ఇది కూడా ఒక రికార్డ్ అనే చెప్పాలి,అంతేనా సాధారణంగా హీరోయిన్లు సొంత డబ్బింగ్ చెప్పుకోవడానికి కష్టపడుతుంటే,ఆమె పాటలు కూడా పాడారు.తమిళ,తెలుగు,కన్నడ,మలయాళ బాషలలో 19 పాటలు పాడారు,ఇది కూడా ఏ హీరోయిన్ చెయ్యలేదు.


అలాంటి నిత్యా మీనన్ మరిన్ని సినిమాలు రానున్న రోజుల్లో నటించాలి అని,అందులో మరిముక్యంగా తెలుగులో చెయ్యాలి అని కోరుకుంటూ అమ్మయిల వయసు చెప్పకూడదు కనుక నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న దక్షిణ భారతదేశ హీరోయిన్ నిత్యా మీనన్ గారికి తెలుగు చిత్ర పరిశ్రమ తరపున,తెలుగు ప్రేక్షకుల తరపున,ఆమె అభిమానుల తరపున,మా “బి.ఆర్.మూవీ జోన్” టీం తరపున “పుట్టిన రోజు శుభాకాంక్షలు”..!