24-01-2022 16:12:15 About Us Contact Usహ్యాపీ డేస్ నుంచి ఇప్పటి దాక తెలుగువారికి పక్కింటి కుర్రాడిగా బాగా నచ్చిన హీరో మన హైదరాబాద్ పొరగాడు నిఖిల్ సిద్దార్థ్..2007లో వచ్చిన హ్యాపీ డేస్ లో ఊరు నుంచి పట్నం వచ్చిన ఒక విద్యార్థిగా కనిపించిన నిఖిల్..అంకిత్..పల్లవి & ఫ్రెండ్స్..యువత వంటి సినిమాలతో సాధారణ తెలుగుయువకుడిగా మంచి మార్కులు కొట్టేశారు..సినిమాలకు సైతం మంచి స్పందన వచ్చింది..కళవర్ కింగ్..ఓం శాంతి..ఆలస్యం అమృతం..వీడు తేడా..డిస్కో..ఇలా వరసగా సినిమాలు చేస్తూ పోయారు నిఖిల్..సినిమాలు అయితే చేస్తున్నారు కానీ ఆయనకు బ్రేక్ ఇచ్చే సినిమాగా ఏది రాలేదు..


సరిగ్గా అప్పుడే 2013లో స్వామిరారా..అనే సినిమా చేశారు నిఖిల్..ఆ సినిమా కమర్షియల్ హిట్ తో పాటు నిఖిల్ ని మరో మెట్టు ఎక్కించింది..2014లో కార్తికేయ..2015లో సూర్య వర్సెస్ సూర్య సినిమాలతో భిన్నమైన కథలతో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందు వచ్చారు..వీటికి కూడా ప్రేక్షకుల నుండి మెప్పు పొందారు..శంఖరాభరణం కొంచం నిరాశ పరిచినా..2016లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా తో అతి పెద్ద హిట్ అందుకున్నాడు..ఈ సినిమాతో నిఖిల్ మరో లెవల్ కి చేరిపోయాడు..ఆ తర్వాత కేశవ..కిరిక్ పార్టీ రీమేక్ కిరాక్ పార్టీ..తమిళ్ సినిమా రీమేక్ అర్జున్ సురవరం..చేశారు నిఖిల్..ప్రసృతం 2014లో విజయం సాధించిన కార్తికేయ సినిమాకు సెక్వల్..మరియు ప్రతిష్టాత్మక బ్యానర్ గీత ఆర్ట్స్2 మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిముస్తున్న..స్టార్ దర్శకుడు సుకుమార్ అందించిన స్క్రిప్ట్ తో..కుమారి 21ఎఫ్ దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం చేస్తున్న సినిమా 18 పేజిస్ అనే సినిమా చేస్తున్నారు..


తన భిన్నమైన నటనతో తనకంటూ అభిమానులని పొందిన నిఖిల్..మినిమమ్ గ్యారంటీ హీరోగా మారిపోయారు..ముందు సినిమా ఎలా ఉన్నా..నిఖిల్ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి..ఆ తర్వాత సినిమా కథను బట్టి సినిమా ఫలితం ఉంటుంది..ప్రేక్షకులు నిఖిల్ సినిమా అంటే థియేటర్ కు వస్తారు..ఎటువంటి గాడ్ ఫాథర్ లు లేకుండా స్వయం కృషితో ఇక్కడ దాక వచ్చిన నేటి తరం కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్..యువ హీరోల సినిమాలను ఎప్పుడు సోషల్ మీడియా లో ప్రోత్సహిస్తూ..మంచి ఆరోగ్యవంతమైన పోటీని నెలకొపుతున్నారు నిఖిల్..ఇటీవలే పెళ్లి చేసుకున్నరు..


ప్రజలకు సేవ చేసేందుకు కూడా ముందుతాడు నిఖిల్..ఇటీవల కరోనా సమయంలో సైతం సనీతైజర్లు..మస్కులు పంపిణీ చేశారు..అలాంటి నిఖిల్ నేడు 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు..తీస్తున్న రెండు సినిమాలు భారీ విజయాలు సాధించాలని..మరిన్ని సంవత్సరాలు పరిశ్రమలో కొనసాగాలని.. తన కెరియర్ లో ఇప్పటికే విమర్శకుల నుండి ప్రశంసలు పొందిన నిఖిల్ ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టి..తన స్టామినా నిరూపించాలని..కోరుకుంటూ.. మా బి.ఆర్.మూవీ జోన్ తరపున..హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..