24-01-2022 16:27:48 About Us Contact Usనిఖిల్ సిద్దార్థ్.. కొత్త పెళ్ళి కొడుకు.. నేడు అర్జున్ సురవరం జీ తెలుగు లో రానున్న సందర్భంగా ప్రచారం కొరకు.. సామాజిక మాధ్యమంలో కాసేపు అభిమానులతో మాట్లాడారు.. ఇందులో అభిమానులు సంధించిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి..


ఇప్పటికే లాక్ డౌన్ లో మేక్ ఓవర్ అవుతున్నట్లు ఫోటోలు బయట పెట్టిన నిఖిల్ ను సిక్స్ ప్యాక్ ఎప్పుడు అని అడుగగా.. కార్తికేయ 2 లో ఉండచ్చు అని చెప్పారు.. అలానే మరో ప్రశ్నకు కార్తికేయ2 లో పాము కాదు పాములు ఉంటాయి అని బదులిచ్చారు.. అలానే తను కొత్తగా లాక్ డౌన్ లో ఏం నేర్చుకున్నారు అని అడిగితే.. తాను ఫిల్మ్ మేకింగ్ పాఠాలు గత 3 నెలలుగా హాజరవుతునట్లు చెప్పారు.. లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోయింది.. దింతో అందరూ ఇంట్లో నుండి మొబైల్.. కంప్యూటర్ ద్వారా వీడియో కాల్స్.. మాట్లాడుతున్నారు.. ఇదే కోవలో ఎవరి దగ్గరో నిఖిల్ దర్శకత్వ పాఠాలు నేర్చుకుంటున్నరా.. లేక ఇప్పటికే అప్లోడ్ చేసిన ఏవైనా ఆన్ లైన్ క్లాసుల వీడియోలు చూస్తున్నారా అనే విషయం ఆయన చెప్పలేదు..


14 సంవత్సరాల సినీ జీవితంలో.. 17 సినిమాలు నటించిన అనుభవం.. తో 35 ఏళ్ళ వయసులో దర్శకత్వ మెలకవులు నేర్చుకుంటున్నరు నిఖిల్ సిద్దార్థ్.. ఇప్పటికైతే.. లాక్ డౌన్ వల్ల వచ్చిన కాళీ సమయాన్ని వృధా చేయకుండా.. తను పని చేస్తున్న చిత్ర పరిశ్రమలోని కొత్త విషయాలు నేర్చుకోవడం అనే తపనతో పాఠాలు వింటునట్లు అర్ధమవుతుంది.. ప్రస్తృతనికి తానేడో నిజంగా దర్శకత్వం చేయాలి అనే ఆలోచన లేకున్నా.. భవిషత్తులో ఏమి జరుగుతుందో ఎవరు ఉహించలేము కదా.. కానీ.. అటు వర్క్ ఔట్స్.. ఇటు డైరెక్షన్ పాఠాలు రెండు కూడా తను ఉన్న చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలే.. సినీ రంగంపై నిఖిల్ కు ఎంత ఇష్టం ఉందో.. ఉహించకుండా దొరికిన కాళీ సమయాన్ని తాను గడుపుతున్న విధానం చూస్తే అర్ధమవుతుంది.. నిఖిల్.. కార్తికేయ 2.. 18 పేజీస్ అనే రెండు సినిమాలలో నటిస్తున్నారు.. వాటిల్లో కొత్తగా ఎలా కనపడుతారో చూడాలి.. ఇదండీ సరదాగా అభిమానులతో నిఖిల్ పంచుకున్న విషయాలు..