24-01-2022 16:05:41 About Us Contact Us


ఒక నలబై ఏళ్ల క్రితం హైదరాబాద్ లో ఒక సాధారణ కుటుంభంలో ఒక పాప జన్మించింది..డిగ్రీ దాక హైదరాబాద్ లో చదివి,మాస్టర్స్ ఢిల్లీ లో చేసింది..సివిల్స్ లేక మరో చదువు చదవాలి అనుకున్న ఆ అమ్మాయి చివరి సెమిస్టర్ చివరి పరీక్ష రాస్తూ..ఇక జీవితంలో పరీక్షలు రాయకూడదు అని నిర్ణయించుకుంది..తిరిగి హైదరాబాద్ చేరింది..ఆరు నెలలు కాళిగా ఉండడంతో అమ్మ అరుస్తుంది అని ఏదో ఒక ఉద్యోగంలో చేరేందుకు పోయి..ఒక రోజులో మానేసింది..ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి అని భావించి యాడ్ ఏజెన్సీ లో అడుగు పెట్టిన ఆ అమ్మాయి..తెలిసిన వారు చెప్పడంతో 1995లో గుణ్ణం గంగరాజు గారి తొలి సినిమా లిటిల్ సోల్జర్స్ అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది..ఆ పిల్లల సినిమా చిత్రీకరణను బాగా ఎంజాయ్ చేసిన తను..ఈ చిత్ర పరిశ్రమలోనే విందలి అని నిర్ణయించుకుంది..ఆమె నేటి తరంలో వన్ అండ్ ఓన్లీ లేడీ స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి గారు..


తొలి సినిమా తర్వాత గులాబీ సినిమా చూసి కృష్ణ వంశీ దగ్గర చేసేందుకు నిర్ణయించుకుంది..లిటల్ సోల్జర్స్ సినిమా కెమరామెన్ రసూల్..గులాబీ సినిమాకి కెమరామెన్ కావడంతో ఆయన ద్వారా వంశీ గారిని ఆడిగించింది..అమ్మాయి దర్శకత్వ టీంలోకి ఏంటి మన టైం అంతా సెట్ ఎవ్వడు అని చెప్పరాట వంశీ గారు..మరో సినిమాకి కొన్ని రోజులు మాత్రమే పని చేసిన ఆమె అక్కడ నచ్చక ఏమి కాళిగా తిరగడం మొదలు పెట్టారు..అప్పుడే ఒక కన్నడ సినిమాకి పని చేసేందుకు సిద్ధపడ్డారు..ఆ సినిమా హీరోని వేరే సినిమా సెట్ లో కలిసేందుకు వెళ్లిన నందిని కి అక్కడ ఒక స్నేహితురాలు దొరికింది..ఆమె వల్ల తన జీవన ప్రయాణం మారిపోయింది..కన్నడ రాకుండా,కన్నడలో తీయాలి అని లేకున్నా కన్నడ సినిమా ఎందుకు చేస్తావు అంటూ తన ప్రియుడు వద్ద చేయమని సూచించారట ఆ స్నేహితురాలు..అయితే ఆయనను అప్పటికే అడిగాను వద్దు అన్నారు అని చెప్పింది నందిని..ప్రియురాలి ఫోన్ తో ఒప్పుకున్నాడు ఆ దర్శకుడు..ఆమె ఎవరో కాదు అప్పటికే స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన రమ్య కృష్ణ..ఆ దర్శకుడు ఎవరో కాదు కృష్ణ వంశీ..


రమ్య కృష్ణ ఫోన్ తో తొలుత అయిష్టంగానే ఒప్పుకున్న కృష్ణ వంశీ..ఆ తర్వాత ఆయన కోర్ టీంలో మెంబెర్ గా మారిపోయారు..చంద్రలేఖ హాస్పిటల్ సెట్ మొత్తం అన్ని తానే కొన్నాను అని చెపుతుంటారు నందిని..అంతలా ఆ సినిమాకి పని చేశారు..అక్కడ నుండి అంతఃపురం..సముద్రం..మురారి..ఇలా వంశీ గారి టీం లో సినిమాలు చేస్తూ వెళ్లిపోయారు..సినిమా నిర్మాణం బాగా ఎంజాయ్ చేసిన నందిని..చాలా విషయాలు వంశీ గారి దగ్గర పని చేసేటప్పుడు నేర్చుకున్నారు..ఖడ్గం సినిమా చిత్రీకరణ సమయంలో కృష్ణ వంశీ గారు పిలిచి ఇలా ఎంతకాలం పని చేస్తావు..డైరెక్టర్ అవ్వవా అని అడగడంతో తాను ఆలోచన చెయ్యడం మొదలు పెట్టారు..దర్శక విభాగంలో తెలుగు చిత్ర పరిశ్రమలో నేటి తరంలో మహిళ పని చెయ్యడం..అది ఇన్ని సంవత్సరాలు బహుశా నందిని రెడ్డి గారు మాత్రమే అయివుంటారు..


ఇక ఆమె కధ రాయడం పూర్తయింది..ఎందరికో కథలు చెప్పాడు కానీ ముందుకు వెళ్లడం లేదు..తనకిష్టం లేకున్నా స్నేహితుడు కళ్యాణ్ మాలిక్ చెప్పడంతో దామోదర్ గారికి కధ చెప్పారు..సినిమా నిర్మిస్తున్నట్లు చెప్పడంతో సినిమా పట్టాలు ఎక్కింది..కానీ ఇంతటితో పూర్తికాలేదు..అసలు కథ అప్పుడే మొదలైంది..ఫస్ట్ షెడ్యూల్ దాక అంతా బాగా జరిగినా ఆ తర్వాత రష్ చూసిన ప్రతివారు నందిని ని తప్పు పడుతూ వచ్చారు..ఒక ఫార్ములాకు అలవాటు పడిన మన పరిశ్రమలోని అనేకమంది ఆ సినిమా పై విమర్శలు చేయ్యడం మొదలు పెట్టారు..షెడ్యూల్ కి షెడ్యూల్ కి మధ్యలో నాలుగు నెలలు ఆపారు అంటే ఆ సినిమాపై నమ్మకం ఏపాటిదో అర్థమై ఉండాలి..అయినా వెనక్కి తగ్గలేదు..పట్టు విడవలేదు..అలా అనేక మంది విమర్శల మధ్య దాదాపు రెండు సంవత్సరాల తర్వాత సినిమా విడుదలైంది..సినిమా విడుదల రోజు సాయంత్రం ఫస్ట్ షో కి ప్రేక్షకులతో చూసిన నందిని ఒక అద్భుతమైన అనుభూతి పొందారు..తాను రాసుకున్న చిన్న జోక్ కి ప్రేక్షకులు అందరూ గెట్టిగా నవ్వుతుంటే..అప్పటి వరకు తను పడ్డ కష్టం మర్చిపోయారు..కాసేపు కళ్ళు చమర్చి ఉంటాయి కూడా..


కొత్త తరహా సినిమాకి తొలుత విమర్శలు..తర్వాత అభినందనలు తప్పవు కదా మరి..ఆ తర్వాత 2013 లో జబర్దస్త్ చేశారు..2016లో మళ్ళీ కల్యాణ వైభోగమే సినిమాతో యూత్ కి బాగా దగ్గరయ్యారు..2019లో సురేష్ ప్రొడక్షన్స్ లో సమంత ప్రధాన పాత్రదారిగా చేసిన ఓహ్ బేబీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి నిలిచిపోయే ఒక క్లాసిక్ తీశారు..


ఏమి చెయ్యాలో తెలియని చదువు పూర్తి చేసిన ఒక అమ్మాయి..అత్నకు తెలియని రంగంలోకి అడుగు పెట్టినా..ఇష్టం ఉంటే ఏ స్థాయికి ఎడగుతారో నందిని చూపించారు..దర్శక విభాగంలో ఏ ఒక్క మహిళ లేకున్నా అడుగు ముందుకు వెయ్యడం అంటే మాములు విషయం కాదు..ఎందరు విమర్శించినా తాను నమ్మిన కథతో అడుగు ముందుకు వేసి భారీ విజయం సాధించడం మరో గొప్ప విషయం..ఇలా సినీ రంగంలో దర్శకత్వం వైపు అడుగులు వెయ్యాలి అనుకునే నేటి తరం అమ్మాయిలకు నందిని స్ఫూర్తి..మరో మంచి సినిమా అందించాలి అని కోరుకుందాం..


మహిళా సాధికారత లో భాగంగా చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న తెలుగు మహిళల పై రాస్తున్న వరుస కధనాలలో నేడు నందిని రెడ్డి గారిది..రేపు నటి అంజలి పై వ్యాసము..