03-12-2020 21:38:00 About Us Contact Us



బాల నటుడిగా తెరంగేట్రం చేసి..తిరిగి హీరోగా పరిచయమై..నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకొని..అటు త్రిల్లర్..ఇటు మాస్ సినిమాలతో విజయాలు అందుకొని..తాత..తండ్రుల పేర్లు నిలబెట్టిన ప్రొడ్యూసర్ గా మారిన హీరో….నందమూరి కళ్యాణ్ రామ్.అలాంటి కళ్యాణ్ రామ్ 42వ పుట్టినరోజు నేడు.


1978 జులై 4న నందమూరి హరికృష్ణ లక్ష్మిలకు జన్మించాడు కళ్యాణ్ రామ్.బాల్యం మొత్తం హైదరాబాద్ లోనే గడిపారు.1989లో బాబాయ్ బాలకృష్ణ హీరోగా చేసిన బాల గోపాలుడు సినిమాలో నటించారు.ఆ తర్వాత ఇంజినీరింగ్ కోయంబతుర్ లో చదివారు..అమెరికాలోని చిగాగో రాష్ట్రంలో మాస్టర్స్ చదివారు.తిరిగి హైదరాబాద్ చేరిన కళ్యాణ్ రామ్ హీరోగా చిత్ర రంగంలోకి అడుగు పెట్టారు.2003లో తొలి చూపులోనే అనే సినిమాతో హీరోగా తెలుగు వారికి పరిచయమయ్యారు. అభిమన్యు.. అతనొక్కడే.. అసాద్యుడు.. విజయదశమి.. లక్ష్మీ కల్యాణం..సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.వరసగా మాస్ సినిమాలు చెయ్యడంతో నందమూరి అభిమానులు వారసుడు వచ్చాడు అని సంబరాలు జరుపుకున్నారు.సరిగ్గా అప్పుడు 2008లో విడుదలైంది హరే రామ్ అనే సినిమా.ఆ సినిమాతో అటు బాక్స్ అఫిస్ వద్ద భారీ విజయంతో పాటు ఇటు తన నటనకు విమర్శకుల ప్రశంసలు పొందారు.


జయీభవ..కళ్యాణ్ రామ్ కత్తి సినిమాలు చేసిన కళ్యాణ్ రామ్..2013లో ఓం సినిమాతో తొలి 3డి యాక్షన్ సినిమా చేశారు.2015లో వచ్చిన పటాస్ మంచి కామెడీతో ఫామిలీ హిట్ గా నిలిచింది.2016లో పూరి జగన్నాథ్ తో చేసిన ఇజం సినిమా విజయంతో పాటు నటనకు పేరు తెచ్చిపెట్టింది.గత సంవత్సరం విడుదలైన 118 సినిమా.. ఒక క్రైమ్ త్రిల్లర్ గా భారీ విజయం సాధించింది.అలానే బాబాయ్ చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు.. మహనాయకుడు సినిమాలతో కలిపి 20 సినిమాలు చేశారు.



తాత ఎన్టీఆర్ గారి పేరుతో ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి..తొమిది సినిమాలు ఇప్పటి వరకు నిర్మించారు.అందులో తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ.. మాస్ రాజా రవితేజ కిక్2 సినిమాలు కూడా ఉన్నాయి.అలానే కూతురు నందమూరి తారక అద్విత పేరుతో అద్విత క్రియేటివ్ స్టూడియోస్ పేరుతో సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ చేసే సంస్థ ప్రారంభించారు.బాబాయ్ లెజెండ్..తమ్ముడు మనకు ప్రేమతో వంటి సినిమాలకు ఈ సంస్థ పని చేసింది.


వారసత్వంగా సినిమా రంగంలోకి అడుగు పెట్టినా ఎప్పుడు ఒక స్టార్ హీరోగా తనను తాను చూసుకోలేదు కళ్యాణ్ రామ్.నలుగుతో కలిసిపోటు..కొత్త హీరోగా ఒకో సినిమాతో ఒకో మెట్టు ఎదుగుతూ వచ్చారు.పరిశ్రమలో మంచివారు అనే పేరు సంపాదించుకున్నారు.అటు నటుడిగా..ఇటు నిర్మాతగా..మరో పక్క సంస్థ అధిపతిగా క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఉంటారు కళ్యాణ్ రామ్.అయినా ఎవరు పలుకరించినా ఆప్యాయంగా పాలకరిస్తారు అని పరిశ్రమ వర్గాలు చెప్తుంటాయి.


అలాంటి కళ్యాణ్ రామ్ పరిశ్రమలో అనేక సంవత్సరాలు ఉండాలని.. భారీ విజయాలు చూడాలని కోరుకుంటూ
.. నందమూరి కళ్యాణ్ రామ్ గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంశాలు..