05-12-2020 13:50:02 About Us Contact Us



విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి సినీ వారసుడిగా.. తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి నటసింహ గా పేరు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ గారి 60వ పుట్టిన రోజు నేడు.. ఈ సందర్భంగా ఆయన గురించి వ్యాసము..


1960 జూన్ 10న మద్రాస్ లో ఉండటంతో చెన్నై లో జన్మించిన బాలయ్య.. తన బాల్యం.. విద్యాబ్యాసం అక్కడే చేశారు.. ఆ తర్వాత పరిశ్రమ హైదరాబాద్ కు రావడంతో హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో కామర్స్ లో బ్యాచ్ లర్ డిగ్రీ పూర్తి చేశారు.. 14ఏళ్ళ వయసులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో తాతమ్మ కల అనే చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు బాలయ్య.. అక్కడ నుండి ఐదు సినిమాలలో నటించారు.. ఆ తర్వాత మళ్ళీ 1984లో కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో సాహసమే జీవితం అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఇక అక్కడ నుండి వెనక్కి చేసుకున్నది ఎన్నడూ లేదు..


1984 నుంచి నేటి వరకు 105 సినిమాలు చేశారు.. మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు.. పొరణికంతో మొదలు పెట్టి.. ప్రేమికుడి నుండి.. త్రిపాత్రాభినయం దాక.. ఇలా తన సినీ ప్రస్థానంలో బాలకృష్ణ చెయ్యనిది ఏమీ లేదు.. 1990ల నుండి అగ్ర కథానాయకులలో ఒక్కరిగా పేరు తెచ్చుకున్నారు.. ఇక రాయలసీమ ఫ్యాక్షన్ కథలతో 2000 నుండి వరస సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద వస్సులు రాబడుతున్నారు.. దర్శకుల హీరోగా పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు.. చెప్పిన సమయనికి సెట్ కు రావడం.. క్రమశిక్షణ.. ఈ వయసులో కూడా పట్టుదల.. ఇవే ఆయనను ఈ స్థాయికి తోసుకొచ్చాయి..


సేవా భావం కూడా బాలకృష్ణ గారికి ఎక్కువే.. బసవతారకం కాన్సర్ హాస్పిటల్ నడుపుతూ పేద వారికి అండగా నిలుస్తున్నారు.. ఎంతో మందికి ఆర్థిక సహాయం చేశారు.. విపత్తు సమయంలో తన వంతు సహాయం చెయ్యడం ఎప్పుడు మరవలేదు బాలకృష్ణ గారు.. బాలయ్య సినిమా విడుదలైతే చాలు అభిమానులు సినిమా థియేటర్ దగ్గర.. కోకో కోల పెప్సీ బాలయ్య బాబు సెక్సీ.. కింద పైన ఊపు.. బాలయ్య బాబు తోపు.. అంటూ అనేక నినాదాలు చేస్తూ ఉంటారు..


తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్న బాలకృష్ణ గారు.. సింహ.. లెజెండ్.. వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను గారితో కలిసి మరోసారి రానున్నారు.. పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన డైలాగ్ బాగా ఆకట్టుకుంది.. ఈ సినిమా విజయం సాధించాలని.. మరిన్ని సినిమాలతో ఆయన మనల్ని అలరించాలని కోరుకుంటూ నేడు 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్న బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు..