24-01-2022 16:07:34 About Us Contact Usభవ్య క్రియేషన్స్ తమ తదుపరి చిత్రం ఆనంద్ దేవరకొండతో అని ఇప్పటికే తెలిపింది.తాజాగా ఆ సినిమా పేరు మిడిల్ క్లాస్ మెలోడీస్ అని టైటిల్ ఖరారు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది.వివరాలలోకి వెళ్తే..


విజయ్ దేవరకొండ తమ్ముడిగా పరిచయమై తొలి సినిమాతోనే తన నటనకు విమర్శకుల ప్రశంసలు పొందిన ఆనంద్ దేవరకొండ హీరోగా..తమిళ,మలయాళంలో హీరోయిన్ గా పేరు తెచ్చుకొని ..చూసి చూడంగానే.. అనే సినిమాతో తెలుగులో మరిచాయమైన వర్షా బొల్లం హీరోయిన్ గా కలిసి నటిస్తున్న సినిమా మిడిల్ క్లాస్ మెలోడిస్.వినోద్ అనంతోజు.. దర్శకుడిగా గా ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు.కేర్ ఆఫ్ కాంచరపాలెం మ్యూజిక్ దర్శకుడు స్వీకర్ అగస్తీ ఈ సినిమాకు బాణీలు అందించనున్నారు.భవ్య క్రియేషన్స్ పతాకం పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


గుంటూరు జిల్లా బాపట్ల వాసి వినోద్ ఇప్పటికే శున్యం అనే లఘు చిత్రం ద్వారా తన దర్శకత్వ ప్రతిభకు ప్రశంసలు అందుకున్నారు.ఆ తర్వాత కొన్ని లఘు చిత్రాలు చేసి హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న వినోద్ పరిశ్రమలో సూపరిచితుడే.ఇప్పుడు తొలి సినిమా అవకాశం వచ్చింది.ఇప్పటికే ఈ సినిమా పట్ల పరిశ్రమలో అంచనాలు బాగానే ఉన్నాయి.దర్శకుడితో పాటు భవ్య క్రియేషన్స్.. నిర్మాణ సంస్థ కావడం..అంతేకాక ఆనంద్ దేవరకొండ దొరసాని తర్వాత చిత్రం కనుక కూడా అంచనాలు పెరగడానికి కారణం.


సినిమా టైటిల్ లోనే ఇది సామాన్యుడికి దగ్గరగా ఉండనున్నట్లు అర్ధమవుతుంది.త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నట్లు బృందం తెలిపింది.