01-12-2020 21:27:56 About Us Contact Us



ఈ నెల(జులై)31న జీ5 లో నేరుగా విడుదల కానున్న సినిమా మేకసూరి.ఇటీవల నారా రోహిత్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. మేకసూరి ట్రైలర్ కు అటు ప్రేక్షకుల నుండి ఇటు పరిశ్రమ నుండి మంచి స్పందన వస్తుంది.టైటిల్ పోస్టర్ నుండే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా.. ట్రైలర్ తో అంచనాలు భారీగా పెంచింది.ఆ సినిమా గురించి వివరాల్లోకి వెళ్తే..


ఒక గ్రామంలో కసాయి బృందానికి చెందిన వ్యక్తి మేకసూరి.ఆ మేకసూరి రాణి అనే అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.కానీ.. ఆ రాణి ని కొంతమంది అతి కిరాతకంగా చంపేస్తారు.ఎవరు చంపారు?ఆ హత్య కు ప్రతీకారం తీసుకునేందుకు సూరి నక్సల్స్ సహాయం తీసుకుంటాడు.చివరకు చేసిన వారిని సూరి ఎలా పట్టుకుంటాడు.. ఎలా చంపాడు అనేది సినిమా సారాంశం.పూర్తిగా గ్రామ స్థాయిలో జరిగే సంఘటనలతో ఈ సినిమా తెరకెకించారు.


దర్శకుడు త్రినాథ్ వెలిసిల ఈ సినిమాకు దర్శకత్వం చేశారు.దర్శకుడిగా ఇది తొలి సినిమా అయినప్పటికీ విడుదలైన ట్రైలర్ తో పరిశ్రమలో గొప్ప డైరెక్టర్ అవుతారు అనే పేరు సంపాదించుకున్నారు.పలు సినిమాలకు సంగీతం అందించిన ప్రజ్వల్ క్రిష్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.. ఈ సినిమా ట్రైలర్ లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి ప్రశంసలు లభించాయి.అలానే ఈ సినిమాలో నాలుగు పాటలకు కూడా మంచి స్పందన వస్తుంది.ఈ సినిమాతో ప్రజ్వల్ క్రిష్ పెద్ద సంగీత దర్శకుడు అవుతారు అని విశ్లేషకుల అంచనా..


ఫన్ బకెట్ వీడియోలతో యూట్యూబ్ ఛానల్ ద్వారా యువతకు బాగా చేరువైన సుమయా.. ఈ సినిమాలో హీరోయిన్ గా చేశారు.మేకసూరి పాత్రలో అభినయ్ కనిపించారు.చాలా బాగా నటించినట్లు ట్రైలర్ లోని సన్నివేశాలను చూస్తే అర్ధమవుతుంది.భారీ అంచనాల నడుమ.. చిన్న చిన్న వ్యక్తులు.. పెద్ద పెద్ద ఆశలతో..ఈ నెల 31న విడుదల జీ 5 లో విడుదల చేస్తున్న సినిమా మేకసూరి.చూడాలి మరి.. ఎప్పుడు కొత్త కథలను.. కొత్త రకమైన సినిమాలను ఆదరించే మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి తీర్పు ఇస్తారో..!?