24-01-2022 17:00:57 About Us Contact Us


రేపు (ఆగస్ట్ 22న) పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమంలో రచ్చ చేసేందుకు అభిమానులు.. ఆయనకు శుభాకాంశాలు తెలిపేందుకు చిత్ర పరిశ్రమ సర్వం సిద్ధం చేసుకుంటుంది.నేడు సాయంత్రం ఆరు గంటల నుండి రేపు సాయంత్రం ఆరు గంటల వరకు 100 అతిరథమహారధులు మోషన్ పోస్టర్స్ ని విడుదల చేస్తుంటే.. మెగా హీరోలు.. ప్రత్యేకంగా శుభాకాంశాలు తెలపనున్నారు.


అంజనీ కుమారుడు.. సుప్రీమ్ హీరో.. గ్యాంగ్ లీడర్.. దాదాపు నాలుగు దశాబ్దాల నుండి తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఏలుతున్న వెండితెర మెగాస్టార్.. కోట్లాదిమంది అభిమానుల ఆరాధ్యదైవం.. కొణిదెల చిరంజీవి గారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం దేశ.. విదేశాల్లో ఘనంగా జరుగుతుంటాయి.తెలుగు రాష్ట్రాలలో వారం రోజుల నుండే పండగ వాతావరణం కనిపిస్తుంది.ఇక హైదరాబాద్ లో అయితే ప్రతి ఏటా అభిమానులు అంతా ఒక పండగలా ఈవెంట్ చేసుకుంటూ వుంటారు.అలాంటిది కరోనా కారణంగా ఈ వేడుకలకు ఈ సారి అంతరాయం కలిగింది.దింతో అభిమానులను నిరాశ పరచకూడదు అని అటు చిరంజీవి అభిమానుల సంఘం.. ఇటు మెగా హీరోలు.. మరోపక్క పరిశ్రమ భావించింది.దింతో ఈ సారి వేడుకలు సామాజిక మాధ్యమాల్లో జరగనున్నాయి.నేడు సాయంత్రం ఆరు గంటలకు చిరంజీవి గారి తనయుడు.. మెగా పవర్ స్టార్.. రామ్ చరణ్ కామన్ డీపీ విడుదల చెయ్యడంతో ఆరంభం కానున్న ఈ వేడుకలు.. రేపు సాయంత్రం ఆరు గంటలకు చిరంజీవి గారి ప్రత్యేకమైన పోస్టర్ విడుదల తో ముగుస్తాయి.ఈ వేడుకలో దాదాపు 80మంది అగ్ర సినీ ప్రముఖులు నేడు రాత్రి ఏడు గంటలకు ప్రత్యేకమైన మోషన్ పోస్టర్ తో శుభాకాంశాలు తెలుపుతారు.అలానే మెగా బ్రదర్ నాగబాబు గారు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. మెగా హీరోలు.. అల్లు శిరీష్.. కళ్యాణ్ దేవ్.. మెగా హీరోయిన్ నిహారిక.. నిర్మాతగా మారిన కాస్ట్యూమ్ డిజైనర్ చిరంజీవి గారి కుమార్తె సుష్మితా.. ప్రత్యేకమైన వీడియోల ద్వారా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపనున్నారు.


దీనితో పాటు ఒక చిరంజీవి గారి గురించి పోస్టర్లు.. ఫోటోలు.. వీడియోలు.. విడుదల చేయన్నున్నారు.ఇలా ప్రతి అర్ధగంట కు ఒక కార్యక్రమంలా నేటి సాయంత్రం ఆరు నుండి రేపు సాయంత్రం ఆరు దాక అలరించనున్నారు.కరోనా కారణంగా బయటకు రాకున్నా మెగాస్టార్ అభిమానులు మాత్రం ఆయన పుట్టినరోజును ఇలా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం అందరిలో కుతూహలం పెంచింది.మెగాస్టార్ అభిమానులా మజాకా..!మా(బి.ఆర్.మూవీ జోన్) తరపున్న అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!