24-01-2022 15:39:19 About Us Contact Us1983 మే 20న..డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు..నిర్మల దేవి గార్లకు మనోజ్ జన్మించారు..10 ఏళ్ళ వయసులోనే..విశ్వవిఖ్యాత నతసార్వభౌమ..నందమూరి తారకరామారావు గారి మేజర్ చంద్రకాంత్ సినిమాతో తెరంగేట్రం చేశారు..మరో రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మనోజ్..విదేశాల్లో చదువు పూర్తి చేశారు..2004లో వచ్చిన దొంగా..దొంగది..సినిమాతో హీరోగా పరిచయమయ్యారు..తొలి సినిమాకే మంచి పేరు తెచ్చుకున్నారు..నాటి నుండి ఇప్పటికి వరకు జయాపజయాలు సంబంధం లేకుండా వెనక్కి తిరిగి చూడలేదు మనోజ్..స్టార్ హీరోగా..రియల్ హీరోగా..త్వరలో ప్రొడ్యూసర్ గా ఇలా మనందరి అభిమాన నటుడు సొట్టబుగ్గలోడు మనోజ్ గారి పై ప్రత్యేక కథనం..


2005లో శ్రీ..2007లో రాజు భాయ్..2008లో నేను మీకు తెలుసా..2009లో ప్రయాణం..2010లో..బిందాస్..వేదం..ఝుమ్మంది నాదం..2012లో మిస్టర్.నూకయ్య..ఊ కొడతారా..ఉలిక్కి పడతారా..2013లో పోతుగాడు..2014లో పాండవులు..పాండవులు..తుమ్మెదా..కరెంట్ తీగా..2016లో శౌర్య..ఎటాక్..2017లో గుంటురోడు..ఇప్పుడు 2020లో అహం బ్రహ్మాస్మి..రాజ్ భాయ్ లాంటి మాస్ సినిమా వెంటనే..నేను మీకు తెలుసా అంటూ..మతిమరుపు పాత్ర..అంతలోనే విమానాశ్రయంలో ఒక చిన్న ప్రేమ కథ..వెంటనే బిందాస్ లాంటి కామెడీ..కుటుంబ కథా చిత్రం..ఇంతలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో మల్టీ స్టార్ సినిమా వేదం..అది కూడా విభిన్నమైనది..వెంటనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారితో ఝుమ్మంది నాదం..వెంటనే..వెన్నుపోటును గురించి తెలిపే మాస్ సినిమా..మిస్టర్ నూకయ్య..నతరత్న బాలకృష్ణ గారు..అక్క మంచు లక్ష్మి గారితో కలిసి భయానక త్రిల్లర్ ఊ కొడతారా..ఉలిక్కి పడతారా..ఆ తర్వాత వరస ప్రేమ కథల పోతుగాడు..అంతలోనే కుటుంబం మొత్తం నవ్వుకునే పాండవులు..పాండవులు..తుమ్మెదా..అదే ధోరణిలో ఇప్పుడు అహం బ్రాహ్మస్మి..ప్రతి సినిమా ఒక విచిత్రమైన కథ..అందులో విభిన్నమైన పాత్ర..


ఇలా హిట్స్..ప్లాప్స్ అనే సంబంధం లేకుండా కొత్త కథలను నిత్యం ప్రోత్సహిస్తుంటారు మనోజ్..స్టార్ హీరోలు..వారసులు..యువ హీరోలు..కొత్త హీరోలు..అనే బేధాలు లేకుండా ఒక మూస ధోరణిలో కమర్షియల్ ఫార్ములా తో ముందుకు వెళ్తుంటే..హిట్ అనే ఆలోచన లేకుండా తన సినీ ప్రస్థానం మొత్తం కొత్త కథలను చేశారు మనోజ్..అందుకే నేను అంటాను..కొత్త కథల కోసం తన సినీ జీవితాన్ని పణంగా పెట్టారు మనోజ్..అంటే కాక తాను రీల్ హీరో మాత్రమే కాదు..రియల్ హీరో కూడా..వైజాక్ లో హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు..విశాఖ చేరి అభిమానులు..శ్రేయోభిలాషులతో కలిసి రోడ్లు ఊడ్చారు..తెలంగాణలో పరువు హత్య జరిగితే..ఘాటైన వ్యాఖ్యలతో స్పందించారు..ఇలా అనేక సంఘటనలతో తను తెర మీదే కాదు..తెర బయట కూడా హీరో అనే రుజువు చేశారు..ఇప్పుడు కూడా వేరే రాష్ట్రం వారైనా వలస కార్మికుల నుండి ” భయ్యా..హమ్ పహుంచ్ గయా”అనే పిలుపు కోసం తన వంతుగా శ్రమిస్తున్నారు..అంటే కాదు వ్యవసాయం గురించి ఒక పెద్ద కార్యమే తలపెట్టారు..త్వరలో అది కూడా దిగ్విజయంగా ప్రారంభం కావాలని..రైతుకు మేలు జరగాలని కోరుకుందాం..


సాధారణంగా ప్రతి హీరోకు కొందరు అభిమానులు వుంటారు..కానీ కొంతమందికి మాత్రం..ప్రతి సినీ అభిమానికి ఆ హీరో మీద ఇష్టం ఉంటుంది..జయాపజయాలకు సంబంధం లేకుండా అందరి హీరోల అభిమానులు తొలి రోజు ఆ హీరో సినిమాకు వస్తారు..గతంలో అది మాస్ మహరాజ్ రవితేజ అయితే..ఇప్పుడు నేటి తరానికి రాకింగ్ స్టార్ మనోజ్..రెండు తెలుగు రాష్ట్రాలలో ఏదో ఒక్క చోట ప్రతి హీరో అభిమాని ఒక్కరు మనోజ్ సినిమాకు ఫ్లెక్స్ కడతారు..మెగాభిమానులు..నందమూరి తమ్ముళ్లు..అక్కినేని ఫాన్స్..దగ్గుబాటి..ఘటమానేని..ఇలా ప్రతి హీరో అభిమాని మనోజ్ సినిమా అనగానే సినిమా హాల్ వద్ద కనిపిస్తారు..ఇది నా ప్రత్యక్ష అనుభవం..ఇది ఒక అరుదైన గౌరవం..సినీ అభిమానులు అందరివాడుగా మారారు మనోజ్..విభిన్న పాత్రలు చెయ్యడం వల్లనో..అందరి హీరోలతో సఖ్యతగా ఉండటమో..బయట జరుగుతున్న విషయాల పై నిర్మొహమాటంగా చెప్పాడమో..కారణం ఏదైనా అందరి హీరో అభిమానుల అభిమానం పొందుతున్న హీరో మనోజ్..నిత్యం తారక్ వెంట వుండే మనోజ్..పవర్ స్టార్ పవన్ గారికి మద్దతుగా పోస్టులు పెడుతుంటారు..వీరిద్దరి లక్షణాలు మనోజ్ లో చాలా ఉన్నట్లు అనేక సార్లు ఇరువురి అభిమానులే సామాజిక మాధ్యమాలలో లో చెప్పుకుంటుంటారు..


ఇప్పటి దాక కేవలం తన నటనతో కొత్త కథలను ప్రోత్సహించిన మనోజ్..ఇప్పుడు మంచు మనోజ్ ఆర్ట్స్ ద్వారా స్వయంగా తానే నిర్మించేందుకు సిద్ధపడ్డారు..అలాంటి రియల్ హీరో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారు నేడు 38వ పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుండి..సినీ అభిమానుల నుండి..మా బి.ఆర్.మూవీ జోన్ టీం నుండి..పుట్టిన రోజు శుభాకాంక్షలు..!