24-01-2022 16:11:32 About Us Contact Us10రోజుల క్రితం,అంటే మార్చ్ 28న ఒక షార్ట్ ఫిల్మ్ విడుదలైంది.10రోజుల్లో 2లక్షల,పాతిక వేల పైన వ్యూస్ వచ్చాయి.మీరు అనుకోవచ్చు,లాక్ డౌన్ కదా,2.25లక్షల వ్యూస్ అనేవి సాధారణమే కదా,దీని గురించి ఒక ఆర్టికల్ ఎందుకు అని,అదే ఇక్కడ మరి.ఆ ఛానల్ ని 7,500 మంది మాత్రమే ఫాలో అవుతున్నారు.ఇక ఆ ఛానల్ లో లాస్ట్ వీడియో పెట్టి సంవత్సరం దాటింది.మరి అలాంటి ఛానల్ లో షార్ట్ ఫిల్మ్ విడుదలై 10రోజుల్లో 2లక్షల పైన వ్యూస్ అంటే మాములు విషయం కాదు కదా..!ఇక వివరాలలోకి వెళ్తే..,


ఆ షార్ట్ ఫిల్మ్ పేరు “మనసా నమః”.దర్శకుడు దీపక్ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీ ని ప్రజలకు,తన టేకింగ్ స్కిల్స్ ని ప్రొడ్యూసర్లకు ఒకేసారి చూపించాడు.దీపక్ కు సినిమా దర్శకత్వం వహించేందుకు కావలసిన అన్ని లక్షణాలు పూర్తిగా ఉన్నట్లు ఈ 17నిమిషాలు చూడగానే అర్థమైంది.ఇక ఇందులో నటించిన అశ్విన్ సైతం బాగా ఆకట్టుకున్నాడు.ఇప్పటికే ఒక సినిమా చేసిన అశ్విన్ ఎత్తుగా,మంచి కలర్ తో స్క్రీన్ మీద ఫస్ట్ షాట్ చూడగానే లీడర్ లో రానా ని చూసినట్లు కనిపించాడు.ఈ కుర్రాడికి ఒక్క హిట్ పడితే మనకు ఇండస్ట్రీ కి మరో స్టార్ హీరో దొరికేసినట్లే..!


ఇక అమ్మాయిలు మొత్తం ముగ్గురు చేసినా, సొట్టబుగ్గల మధ్య నేను కాసేపు సూర్యలా ఇరుకోపోయా.ఇక ద్రిష్టికా చందర్ కనిపించినంతసేపు గర్ల్ ఫ్రెండ్ ఉన్న ప్రతి ఒక్కరు రోజూ నా పరిస్థితి ఇదే కదా అనేలా ఉంది.అమ్మాయి కూడా పక్కా తెలుగు అమ్మాయిలా బాగా చేసింది.చివరిలో పాప నవ్వించింది.ఇక పాట ఒక అద్భుతం.ఆ పాటను చిత్రీకరించిన రాజుని,ఎడిటర్ ని అభినందించాల్సిందే.ఇక కర్మన్ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ వినపడలేదు అంటే స్కీన్ లో కలిసిపోయింది అని అర్థం ఇక్కడ కూడా అదే జరిగిందని చెప్పాలి.


నాకు బాగా నచ్చిన డైలాగ్,నేడు చేదు గాను,రేపు భయం గాను ఉంటుంది,కానీ ఎప్పుడూ మధురంగా ఉండేది గతం మాత్రమే అనే లైన్ బాగా రాసుకున్నాడు,ఆ ఒక స్కీన్ లో అశ్విన్ నటన,మ్యూజిక్ సరిగ్గా సరిపోయాయి.ఇప్పటికే నారా రోహిత్,అడివి శేష్,సందీప్ కిషన్,శ్రీ విష్ణు,మొదలగువారు ఈ షార్ట్ ఫిల్మ్ ని ప్రశంసించగా,సంగీత దర్శకుడు థమన్ దీనిని విడుదల చేశారు.ఇలా అందరూ కాసేపు ఈ లఘు చిత్రాన్ని చూసి మీ మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకోండి.ఈ షార్ట్ ఫిల్మ్ లింక్ క్రిందఇస్తున్నాము.చూసి ఆనందించండి,కొత్త ట్యాలెంట్ ని ప్రోత్సహించండి.అంతకన్నా ఏమి చేస్తాం అందరం ఇంట్లోనే ఉన్నంగా..!


ఈ “మనసా నమః” చిత్ర బృందానికి అభినందనలు.భవిషత్తులో అశ్విన్,దీపక్ తో పాటు మొత్తం చిత్ర బృందం ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని ఆశిద్దాం..!


మనసా నమః షార్ట్ ఫిల్మ్