24-01-2022 15:46:13 About Us Contact Us


గత కొన్ని రోజులుగా మనం తరుచు సామాజిక మద్యమలలో వింటున్న సినిమా పెరు ‘మధ’.ఈ సినిమాకి ఇంత హైప్ ఎందుకో తెలియాలి అంటే పూర్తిగా ఈ ఆర్టికల్ ఒక్కసారి చదవాల్సిందే..!

తెలంగాణలోని మెదక్ లో జన్మించి,హైదరాబాద్ లో స్థిరపద్ద ఒక్క అమ్మాయి శ్రీ విద్య బసవ.2010-12 మధ్య సమయంలో యాడ్స్ షూట్ చేసుకుంటూ కాలం గడుపుతున్న విద్య సినిమాల పట్ల మక్కువతో ఒక కథ రాసుకుంది.కొన్ని సంవత్సరాలకు 2017లో ఆ కథను తన డబ్బులతో తీయాలి అని మొదలు పెట్టింది,అటు ప్రొడ్యూసర్ గా ఇటు దర్శకురాలిగా రెండు తానే చేస్తూ సినిమాను పూర్తి చేసింది.తన తల్లి ఇందిరా ప్రోత్సాహంతో ఆ కథ,’మధ’అనే సినిమాగా చిత్రీకరించుకుంది.

చిన్న సినిమాకు విడుదల ఎంత కష్టమో మన అందరికి బాగానే తెలుసు,కానీ తను తన సినిమాని ఎన్నో జాతీయ అంతర్జాతీయ సినిమా పోటీలకు పంపింది.గడిచిన రెండు సంవత్సరాలలో ఉత్తమ దర్శకురాలిగా ఎనిమిది,ఉత్తమ టెక్నిషియన్ గా ఏడు,ఉత్తమ సినిమాగా మూడు,ఉత్తమ నటిగా మూడు ఇలా 26 అవార్డులను మద సినిమా గెలుచుకుంది.మన తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేదికలపై తెలిపిన సినిమా ‘మధ’.

ఈ సినిమా టీజర్ చూసిన దర్శకుడు హరీష్ శంకర్ ఆ చిత్ర బృందాన్ని అభినందించారు.ఆ తర్వాత ఆ సినిమా విడుదలకు ఇబ్బందులు పడుతుంది అని తెలుసుకున్న హరీష్ ఆ సినిమా విడుదలకు సహాయపడవాల్సిందిగా మహేష్ కొనేరును కోరారు,అంతటితో ఆగకుండా ఈ సినిమా ప్రచార బాధ్యతలను సైతం తానే తీసుకున్నారు.వీరిద్దరి సహృదయం వల్ల ఈ సినిమా ఈ నెల 13న మనందరి ముందరికి రానుంది.

ఈ ఇద్దరు మాత్రమే కాక మంచి సినిమాను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చి నటి రకుల్ ప్రీత్ సింగ్,మంచు లక్ష్మి,హీరో నవదీప్,దర్శకుడు నాగ అశ్విన్ తమదైన మాట సహాయం చేస్తున్నారు.మంచి సినిమా అని భావించి ఇలా ముందుకు వచ్చిన వీరందరూ అభినందనీయులు.

సినిమా ట్రైలర్ చూస్తే ఇది సైకలాజికల్ త్రిల్లెర్ అని అర్ధమవుతుంది.మన తెలుగు అమ్మాయి ‘మధ’తో జాతీయ,అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొంది,ఇప్పుడు మన ముందుకు వస్తుంది కనుకనే ఇంతటి హైప్,ఇంత బజ్ సినిమాకు వచ్చింది.ఈ శుక్రవారం (మార్చ్13న)మద మనందరి ముందుకు రానుంది.’మధ’సినిమాతో మరో మహిళా దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కానుంది.మంచి సినిమాను ఎప్పుడు ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారు అని కోరుకుందాం.

అలానే సినిమా టీజర్ నచ్చి సినిమాకు ఈ స్థాయిలో సహాయపద్ద దర్శకుడు హరీష్ శంకర్ గురించి తన మాటలలో “‘యాక్షన్’ అని చెప్పడానికి వచ్చి ‘కట్’చెప్పి వెళ్లిపోయే దర్శకుడు కాదు హరీష్,సినిమా పట్ల తన ప్రేమను,ఎదుటి వారికి సహాయ పడేందుకు ముందుకు వస్తూనే ఉంటాడు”.అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో “హరీష్ శంకర్ స్థాయి వేరు,తన స్థానం వేరు”.

శ్రీ విద్య బసవ,తన తల్లి ఇందిరా బసవ గారికి,నటించిన ట్రిష్ణ ముఖర్జీ,వెంకట రాహుల్,సినిమాటోగ్రఫీ అభిరాజ్ నైర్,సంగీత దర్శకుడు నరేష్ కుమారన్ కు విడుదల సందర్భంగా శుభాకాంక్షలు,శుభాశిస్సులు..!