03-12-2020 21:55:49 About Us Contact Us



బాల నటుడిగా పరిచయమై.. అటు బుల్లి తెరపై సీరియల్స్ చేస్తూ.. ఇటు వెండితెరపై హీరోగా సినిమాలు చేస్తూ.. తనదైన నటనా శైలితో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న హీరో మానస్.అలాంటి మానస్ పుట్టిన రోజు నేడు…


తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. తల్లి టీచర్.. ఒక్కడే కొడుకు.తల్లిదండ్రులడి వైజాగ్.. కానీ.. తండ్రి ఉద్యోగ రిత్యా ముంబై.. గోవా.. వైజాగ్.. హైదరాబాద్.. ఇలా తండ్రితో పాటు బాల్యంలో అన్ని ఊర్లు తిరిగేశాడు మానస్.చిన్నతనం నుండి డాన్స్ అంటే ఇష్టం.. మెగాస్టార్ అభిమానైన మానస్.. స్కూల్ వేదికల పై చిరంజీవి గారి స్టెప్స్ ని అలానే దింపేసేవాడు.. ఆ తర్వాతి రోజుల్లో వెస్టర్న్ డాన్స్ నేర్చుకున్నారు.అలా ఒక వేదిక పై డాన్స్ చేస్తున్న మానస్ కు బాల నటుడిగా నరసింహనాయుడు సినిమాలో అవకాశం లభించింది.అంటే అక్కడ నుండి డాన్స్ నుండి నటన వైపు అడుగులు వేశాడు మానస్.రెండవ సినిమాగా చేసిన హీరో లో మానస్ నటనకు అటు విమర్శకుల.. ఇటు ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి.ఆ సినిమాకు తన నటనకు గాను.. ప్రభుత్వం నంది అవార్డ్ తో సత్కరించగా అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ చేతుల మీదగా ఆ అవార్డ్ అందుకున్నారు మానస్.అదే సినిమాకు.. మా టీవీ అవార్డ్ ను హీరో అల్లు అర్జున్ చేతుల మీదగా తీసుకున్నారు.



మూడవ సినిమాగా సూపర్ స్టార్ మహేష్ బాబు అర్జున్ సినిమాలో నటించారు.ఒక పక్క చదువు.. మరో పక్క హైదరాబాద్ కు దూరంగా ఉండటంతో అనేక సినిమాలు వదులుకున్నారు మానస్.ఒక పక్క చదువు.. మరో పక్క సినిమాలలో మానస్ ప్రతిభను చూసి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారు మెచ్చుకున్నారు.పై చదువుల కోసం సినిమాలకు విరామం ఇచ్చిన మానస్ బాగా చదువుతున్నా.. సినిమా మీద ప్రేమ తగ్గలేదు.దింతో తిరిగి సినిమాల వైపు అడుగులు వేశారు మానస్.జలక్ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మానస్.గ్యాప్ ఇచ్చిన మానస్.. స్టైల్ గా కనిపించి.. అందరిని ఆకట్టుకున్నారు.


గ్రీన్ సిగ్నల్.. నుతిలో కప్పలు.. సినిమాలు చేసిన మానస్ కు కాయ్ రాజా కాయ్.. తో మంచి పేరు లభించింది.ప్రేమికుడు.. సోడా…గోలిసోదా.. లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నక్షత్రం సినిమాతో సాయిధరమ్ తేజ్.. సందీప్ కిషన్ తో కలిసి నటించారు.ప్రసృతం బుల్లి తెరపై కోయిలమ్మ.. మనసిచ్చిచూడు..సీరియల్స్ చేస్తున్నారు మానస్. వెండితెరపై క్షిరసాగరమధనం.. పాయల్ రాజపుట్ తో కలిసి W5 అనే సినిమా చేస్తున్నారు.అటు వెండితెర.. ఇటు బుల్లి తెర లతో బిజీ..బిజీ..గా గడుపుతున్న మానస్.. ఓ.టి.టి. లను కూడా వడలకుడదు అని మరో ఓ.టి.టి సినిమా చేస్తున్నారట..!


బాల నటుడిగా పరిచయమై.. బుల్లితెర.. వెండితెర అనే తేడా లేకుండా దూసుకుపోతున్న మానస్.. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా.. మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.