01-12-2020 17:12:35 About Us Contact Us



ప్రముఖ నిర్మాణ సంస్థలు.. సురేష్ ప్రొడక్షన్స్.. మరియు వియకాం 18 కలిసి నిర్మిస్తున్న చిత్రం కృష్ణ అండ్ హిస్ లీల.. క్షణం సినిమాతో అందరిని త్రిల్ చేసిన రవికాంత్ పెరుపు.. దర్శకుడు. గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్దార్థ్ జొన్నలగడ్డ హీరో.. కృష్ణ అండ్ హిస్ లీల.. Based on True Rumours.. చిత్రానికి సంబంధించి వరసగా మూడు రోజులుగా విడుదలవుతున్న టీజర్స్ సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తున్నాయి..


నాలుగు నెలల క్రితం ఈ సినిమా టీజర్ విడుదలైంది. ముగ్గురు అమ్మాయిలతో.. ఒక అబ్బాయి ప్రేమ ప్రయాణం.. టీజర్ తోనే యూత్ లో మంచి హైప్ సాదించింది ఈ సినిమా.. అందులో తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర కథనాయకులలో ఒక్కరైన రానా దగ్గుబాటి సినిమా ప్రెసెంట్స్ అని వేస్తున్న సినిమా ఇది.. C/O కంచరపాలెం తర్వాత రానా ప్రెసెంట్ చేస్తున్న సినిమా కావడంతో సినీ వర్గాలలో సైతం ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి..


ఈ నెల 22న.. కృష్ణ ఫస్ట్ లవ్.. పేరుతో సత్య అనే పాత్ర గురించి వీడియో విడుదల చేశారు.. జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్ సత్య పాత్ర పోషించారు.. దీనికి మంచి స్పందన లభించింది. 23వ తేదీన.. రాధ.. హాఫ్ ఆ కృష్ణ పేరుతో మరో టీజర్ విడుదల చేశారు. కన్నడ హీరోయిన్ షాలిని వదనికట్టి ఆ పాత్రలో కనిపించారు. 24న రుక్సార్.. కృష్ణ’స్ బేబీ పేరు తో మూడవ టీజర్ విడుదల చేశారు.. రుక్సార్ పాత్రలో రన్ రాజా రన్.. టచ్ చేసి చూడు.. ఫేమ్.. సిరాత్ కపూర్ చేశారు.


ముగ్గురి పాత్రలు.. ఆ ముగ్గురితో కృష్ణ అనుబంధం ఆ టీజర్స్ సారాంశం.. యూట్యూబ్ లో గడిచిన మూడు రోజులుగా ఈ సినిమా టీజర్స్ ట్రెండ్ అవుతున్నాయి.. మీరు ఉహించినదాని కంటే ముందరే వస్తున్నాం అని ఇటీవల బృందం సామాజిక మాధ్యమంలో తెలపడం.. చిత్రం యూత్ కి బాగా దగ్గరైయె విధంగా ఉండటంతో సినిమా నేరుగా ఓ.టి.టి లలో విడుదల చేయాలని.. దర్శక.. నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఎప్పుడు.. ఏ ఆప్ లో అనే విషయాలు గాని.. అసలు ఓ.టి.టి లో విడుదల చేస్తున్నారా అనే అంశం గురించి గాని అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు.. ఇప్పటికే టీజర్స్ ట్రెండ్ అవుతుండటంతో.. త్వరలో పాటలు.. ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.. ఇప్పటికే భారీ అంచనాలు అందుకోవడంతో సినిమా విడుదల గురించి పై అందరూ ఆశక్తిగా వేచి చూస్తున్నారు..