01-12-2020 17:44:23 About Us Contact Us



మార్చ్ 13.. తెలుగులో చివరి సినిమా విడుదలైంది.. మార్చ్ మూడవ వారం నుండి కరోనా కారణంగా సినిమా హాళ్లు మూసివేయ్యడంతో తెలుగు ప్రజలు కొత్త సినిమా చూసి మూడు నెలలు గడిచింది.. గతంలో విడుదలై చూడని సినిమాలను ఓ.టి.టి లలో.. టీవీలలో చూస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరో నెల వరకు సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదు.. అందుకే సినిమాలను ఓ.టి.టి లలో నేరుగా విడుదల చేయాలని కొందరు ఆలోచిస్తుంటే.. మరి కొందరు సినిమా హాల్స్ ఓపెన్ చేశాక విడుదల చేయాలని భావించారు.. ఇలాంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. పెంగ్విన్ సినిమా దర్శక నిర్మాతలు జులై 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు..


మహానటి తో దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా మారిన కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెలుగు.. తమిళ.. మళయ భాషల్లో రేపు అమెజాన్ ప్రైమ్ లో పెంగ్విన్ విడుదల కానుంది.. ఇప్పటికే విడుదలైన టీజర్.. ట్రైలర్.. మరియు విడుదలైన సినిమాలోని ఒక్క పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.. దక్షిణాదిన నేరుగా ఓ.టి.టి లో విడుదల కానున్న తొలి అతి పెద్ద సినిమా పెంగ్విన్..


ఈ సినిమాకు ప్రచారం చాలా గ్రాండ్ గా చేశారు.. ఎలాగో ఓ.టి.టి లో విడుదల కానుంది కనుక ప్రచారం కూడా సామాజిక మాధ్యమంలో చేశారు.. ఈ చిత్ర టీజర్ ను తెలుగులో సమంతా.. తమిళంలో త్రిష.. మలయాళంలో మంజు వారియర్.. హిందీలో తాప్సి విడుదల చేశారు.. తర్వాత కొద్దీ రోజులకు ట్రైలర్ ను తెలుగులో నాని.. తమిళంలో ధనుష్.. మలయాళంలో మోహన్ లాల్ విడుదల చేశారు.. మొన్న సినిమాలోని ఫస్ట్ సింగల్ ను ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ విడుదల చేశారు..


తమిళంలో మంచి పేరు పొందిన ప్రముఖ దర్శకుడు కార్తీక్ సబ్భారాజ్ నిర్మాణ సారథ్యంలో.. ఈశ్వర్ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెకించారు.. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు..


మూడు నెలల తర్వాత కొత్త సినిమా వస్తుండటం.. ఓ.టి.టి లో తొలి పెద్ద సినిమా కావడం.. ప్రచారం కూడా బాగా జరగడం.. ఇప్పటికే విడుదలైన పాట.. ట్రైలర్.. టీజర్.. బాగుండటంతో సినిమా పై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొంది.. మరోవైపు ఓ.టి.టి లో నేరుగా సినిమా విదులైతే.. ప్రజల స్పందన ఎలా ఉంటుంది.. ఎంత మంది వీక్షిస్తారు అనే వాటి గురించి చిత్ర పరిశ్రమ కూడా ఆశక్తిగా ఎదురు చూస్తుంది.. ఒక క్రైమ్ త్రిల్లర్ గా సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది..