01-12-2020 20:47:49 About Us Contact Us


ప్యాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నిన్న(ఆగస్ట్15న) కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గుడ్ లక్ సఖి సినిమా తెలుగు టీజర్ ను విడుదల చేశారు. విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.ఆ టీజర్ విశేషాలు..


తెలుగు.. తమిళం.. మలయాళ భాషల్లో ఈ టీజర్ విడుదలైంది.తెలుగు నుంచి ప్రారంభించి ఇండియన్ హీరో స్థాయికి చేరిన రెబల్ స్టార్ ప్రభాస్ నిన్న(ఆగస్ట్ 15)స్వాత్రంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం 10 గంటలకు ఫేస్ బుక్ ద్వారా గుడ్ లక్ సఖి సినిమా తెలుగు టీజర్ ను విడుదల చేశారు.మహానటి తో దక్షిణాదిన లేడీ సూపర్ స్టార్ గా మారిన కీర్తి సురేష్ హీరోయిన్ గా.. విభిన్న పాత్రలతో విమర్శకుల ప్రశంసలు పొందుతున్న జగపతి బాబు గారు.. ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలు చేస్తూ.. నేటి తరం కమిడియన్స్ లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో నటించారు.


ఒక్క పల్లెటూరులో.. తాను ఏమి చేసినా అది చెడుగా జరుగుతుంది అని.. ఆమెను బ్యాడ్ లక్ సఖి గా పిలిచే ఒక పాత్రలో కీర్తి సురేష్ కనిపించారు.అదే ఊరిలో నాటకాలు వేసే గోలిరాజా(ఆది పినిశెట్టి).. వీరి మధ్య ప్రేమ.. మధ్యలో ఆ ఉరి ప్రజల నమ్మకాలు.ఇలా సాగుతున్న వారి ప్రేమ కథలోకి..దేశం గర్వించే షూటర్స్ ని తయారు చేసే పనిలో పడ్డ జగపతి బాబు ట్రైనింగ్ సెంటర్ కు సఖి ఎలా చేరుతుంది..చేరిన తర్వాత తన లక్ మారుతుందా లేదా.. అనే కధాంశంతో సినిమా తెరకెక్కినట్లు విడుదలైన టీజర్ ద్వారా అర్ధమవుతుంది.



దర్శకుడు నగేష్ కునుకూర్ పాత్రలకు నటుల ఎంపిక తోనే సినిమాను సగం విజయం వైపు నడిపించేశారు. ఈ సినిమాకు సంగీతం అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం టీజర్ లో చాలా కొత్తగా ఉంది.ఇక కీర్తి సురేష్.. కామెడీ.. సీరియస్.. లవ్.. అన్ని ఈ సినిమాలో చేసినట్లు.. టీజర్ లో కనపడుతుంది.డైలాగ్స్ బాగా రాసుకున్నారు.. బలంగా తగులుతున్నాయి.అలానే కెమెరామెన్ చిత్రన్ దాస్ విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి.హిట్ మరియు మంచి సినిమాలను నిర్మించే.. నిర్మాత దిల్ రాజు సమర్పణలో.. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్(Worth A Shot Motion Arts) నిర్మాణ సంస్థ ద్వారా సుధీర్ చంద్ర.. గుడ్ లక్ సఖి సినిమాను నిర్మిస్తున్నరు. ప్రముఖ డిజైనర్ గా పేరు పొందిన శ్రావ్య వర్మ సహా నిర్మాత.


టీజర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా ఓ.టి.టి ద్వారా విడుదల చేస్తారు అనే వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన ఎక్కడా లేదు.సినిమా ఎలా విడుదలైన విజయం ఖాయం అని చిత్ర బృందం నమ్ముతుంది. లక్ అనేది లేదు.. మన రాత మనమే రాసుకోవాల అనే మంచి సందేశంతో వస్తున్న ఈ సినిమా ఫలితం తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచిచాడాల..!

కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి టీజర్