01-12-2020 19:42:08 About Us Contact Us


కృష్ణకాంత్ క్రియేషన్స్ పతాకంపై అలేరి సుధాకర్ రెడ్డి సమర్పణలో వల్లూరుపల్లి నాగజ్యోతి నిర్మిస్తోన్న “కళ్యాణమస్తు” చిత్ర ఫస్ట్ లుక్ ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేశారు. మూవీ టీజర్ ను ఆగస్ట్ 22.న ఉదయం 9:22 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. మంచి కథ .కథనం తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓ.సాయి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో హీరో శేఖర్ వర్మ ..తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను మెప్పించి.. మరో మెట్టు ఎక్కడం ఖాయమని దర్శకుడు తెలిపారు..అందమైన లొకేషన్స్ లో పాటల చిత్రీకరణ పూర్తి చేస్తామని నిర్మాత తెలియజెశారు.. హీరో శేఖర్ వర్మ కి జోడి గా వైభవి రావ్, కీర్తి హీరోయిన్స్ గా నటించబోతున్న ఈ మూవీలో బాహుబలి ప్రభాకర్ ప్రత్యేక పాత్ర లో నటిస్తున్నారు.

నటీనటులు:
శేఖర్ వర్మ, వైభవి రావు, కీర్తి, మధుమణి, కాశీ విశ్వనాధ్, మధు సూధన్, శ్రీనివాస్ అనపర్తి, గెటప్ శ్రీను, రోలర్ రఘు, లీలా మోహన్, సుప్రీత్ తదితరులు..

సాంకేతిక నిపుణులు:
బ్యానర్: కృష్ణకాంత్ క్రియేషన్స్
సమర్పణ: అలేరి సుధాకర్ రెడ్డి
నిర్మాత: వల్లూరుపల్లి నాగజ్యోతి
డైరెక్టర్: ఒ.సాయి
కెమెరామెన్: మల్లికార్జున్ నరగాని
సంగీతం: రఘు రామ్
ఎడిటర్: వి.వి.ఎన్.వి.సురేష్
ఆర్ట్: వెంకటేష్ .సి.హెచ్
పి.ఆర్.ఒ : లక్ష్మీ నివాస్