24-01-2022 15:36:27 About Us Contact Usగడిచిన రెండు దశాబ్దాలుగా తెలుగు నాట..మళ్ళీ ఒక పేరు మంత్రంలా మారి అందరూ జపం చేస్తున్నారు..కళ్ళు చెదిరే స్టెప్పులు..మతి ప్రబించేలా గుక్క తిప్పుకోకుండా..చెప్పే భారీ డైలాగులు..అతి చిన్న ముఖ కవళికతో భావాన్ని వ్యక్తపరిచే అద్భుతమైన నటన..అప్పుడప్పుడు తాన్ గాత్రంతో ఒక పాట..తెలుగు ఖ్యాతిని..ప్రపంచానికి తెలియ చేసిన యుగ పురుషుడు..విశ్వ విఖ్యాత..నట సార్వభౌమ..నందమూరి తారక రామారావు గారే..స్వయంగా మళ్ళీ తన పేరు పెట్టి వదిలిన బ్రాహ్మస్త్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్..


1991లో ఎన్టీఆర్ గారి దర్శకత్వంలో వచ్చిన విశ్వామిత్ర సినిమాతో ఎనిమిదేళ్లకు వెండితెరకు పరిచయమయ్యారు తారక్..ఆనాడు భరతుడిగా జూనియర్.ఎన్టీఆర్ ని చూసి మురిసిపోయాడు..తాత సీనియర్ ఎన్టీఆర్..ఇద్దరు కలిసి నటించిన సినిమా తో తెరంగేట్రం చేసిన తారక్..1996లో ప్రముఖ దర్శకులు గుణశేఖర్ గారి దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణంలో రాముడిగా విమర్శకుల ప్రశంసలు పొందారు తారక్..తన నటనకు 13 ఏళ్ళకే అవార్డులు అందుకున్నారు..చిన్న వయసులోనే కూచుపూడి నేర్చుకున్న తారక్..13 ఏళ్ళకు నటనలో మంచి పేరు రావడంతో చిత్ర పరిశ్రమ చూపు ఆ బాలుడిపై పడింది..ఇక వయసు రావడమే తరువాయి..హీరో అవ్వడం కచ్చితం అని అర్థమైపోయింది..దర్శక..నిర్మాతలు..ఎదురు చూడటం మొదలు పెట్టారు..


18ఏళ్ళ వయసులో నిన్ను చూడాలని అనే సినిమాతో 2001లో హీరోగా పరిచయమయ్యారు..అదే సంవత్సరం ప్రపంచం మెచ్చిన జక్కన్న రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా స్టూడెంట్ నంబర్..1..సినిమాతో మంచి పేరు వచ్చింది..డైలాగ్ తో పాటు అభినయం..డాన్స్..ఇలా ఒక్కటేంటి అన్నింటిలో మార్కులు పడిపోయాయి..సుబ్బుతో తొలి సంవత్సరమే మూడు సినిమాలు చేసిన నేటి తరం హీరోగా సరి కొత్త రికార్డ్ నెలకొల్పారు..2002లో మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాతో మాస్ ఆడియాన్స్ కి బాగా దగ్గరయ్యారు..సరిగ్గా అప్పుడే 2003లో జక్కన్నతో కలిసి సింహాద్రి అంటూ వచ్చారు..ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే ఒక మైలురాయి..20 ఏళ్ళ కుర్రాడు.. దాదాపు అన్ని బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టేశాడు..71 సంవత్సరాల తెలుగు చిత్ర పరిశ్రమకు వసూళ్ళలో కొత్త అంఖ్యలను చూపించారు తారక్..


నాటి నుండి నేటి దాక వెనక్కి చేసుకుంది లేదు..19ఏళ్ళు..28 సినిమాలు..13 హిట్లు..6 పాటలు..అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్లు..యమదొంగతో పౌరాణికం చేసిన నేటి తరం హీరో..ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న తారక్..బృందావనం..అదుర్స్..బాద్షా..రభస లాంటి సినిమాలతో ఫామిలీ ఆడియాన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు..ఒక దశలో తారక్ మాస్ అభిమానులు తెగ బాధ పడిపోయారు..అప్పుడే 2015లో నిజాన్ని చెప్పుతో కొట్టినట్లు సూటిగా చెప్పే పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చింది టెంపర్ సినిమా..ఒక్కసారి తన నట విశ్వరూపంతో అటు మాస్..ఇటు క్లాస్ అని తేడా లేకుండా అందరిని అలరించారు తారక్..వెంటనే నాన్నకు ప్రేమతో సినిమాతో మరో ఫామిలీ హిట్ సాధించారు..ఈ సినిమాలో తన నటన డ్రెస్సింగ్ స్టైల్ చక్కటి లుక్స్ తో ఫామిలీ ఆడియాన్స్ కు బాగా కనెక్ట్ అయ్యారు..వరస హిట్స్ కొడుతున్న కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ ఇచ్చుట అన్ని రికార్డులను తిరగరాయబడును..అనేలా ఉంది ఆ సినిమా..


ఎప్పుడు అంతగా మాస్ సినిమా తియ్యని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..తొలిసారి మాస్ హీరో ఎన్టీఆర్ తో సినిమా అనగానే తన పందా మార్చుకొని..మాటలతోనే కాదు..ఫైట్స్ తో కూడా బలంగా కొట్టాడు..దింతో అరవింద సమేత..భారీ విజయం సాధించింది..ఒక స్టార్ హీరో..హీరోయిన్ టైటిల్ సినిమా చెయ్యడం ఈ తరానికి ఇదే తొలిసారి కావచ్చు..శీర్షికలో చిన్నదిగా వీర రాఘవ అని మాత్రం ఉంటుంది..ఈ సినిమాతో చివరిగా వెండితెరపై కనిపించారు తారక్..బాహుబలి తర్వాత రెండు వేరే సినీ కుటుంబాలలోని ఇద్దరు స్టార్ హీరోలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న రౌద్రం..రణం..రుధిరం.(ఆర్.ఆర్.ఆర్.).సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేస్తున్నారు..తెలంగాణ నేలపై పోరాట వీరుడిగా పేరు పొందిన కొమరం బీమ్ పాత్రలో ఎలా ఉంటాడా అని అందరూ ఎదురు చూస్తున్న సమయం ఇది..


అభిమానులే నాకు అన్ని అని పదే..పదే.. చెప్పిన తారక్..ప్రతి వేడుక వేదిక పై చివరి మాటలుగా..జాగ్రత్తగా వెళ్ళండి..మీ కోసం మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంటారు..ఆ మాటలు మాట్లాడిన ప్రతిసారి అభిమానుల కంట తడి రావాల్సిందే..ఒక్క నందమూరి కుటుంబ అభిమానులను మాత్రమే కాక తన నటనతో..తన మాటలతో..తెలుగు సినీ అభిమానులందరికి చేరువయ్యారు..2017లో బుల్లి తెరపై బిగ్ బాస్ తో సరికొత్త రికార్డులు నెలకొల్పారు..


1983 మే 20న హరికృష్ణ..షాలిని గార్లకు జన్మించిన నందమూరి తారక రామారావు..నేడు 37వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు..నందమూరి వంశానికి మూడవ తరం వారసుడిగా వచ్చి..డాన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్..నటనకు మారు పేరు..డైలాగ్ దీక్షన్ కు మరో పేరు..అణువణువు..కణం కణం..సినిమా సినిమా లా మారిపోయిన..బాక్స్ ఆఫీస్ సేన్ సెషన్..తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన తారక్ అన్నకు పుట్టిన రోజు శుభాకాంశాలు..