24-01-2022 16:58:17 About Us Contact Usతెలుగు చిత్ర పరిశ్రమ మెగా నిర్మాత అల్లు అరవింద్ గారి చేతుల మీద ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఈ రోజు (జులై 25న) సాయంత్రం ఏడు గంటలకు జోహార్ సినిమా పోస్టర్ విడుదలైంది.అదే సమయంలో సినిమాను నేరుగా ఆహా యాప్ ద్వారా ఆగస్ట్ 14న విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.ఈ లైవ్ ద్వారా ఈ సమాచారాన్ని విడుదల చేసినందుకు చిత్ర బృందం ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.


దర్శకుడు తేజ మర్ని దర్శకత్వంలో వస్తున్న తొలి సినిమా ఇది.ఇల్లు పోగొట్టుకున్న ఒక ముసలి తాత పాత్రలో ప్రముఖ సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్ గారు చేశారు.జాతీయ స్థాయి పోటీలో పాలుగోనెందుకు కష్టపడుతున్న ఒక క్రీడాకారిణి పాత్రలో నైనా గంగూలీ చేశారు.యువ ప్రేమ జంటగా.. అంకిత్ కోయా మరియు ఎస్టర్ అనిల్ చేశారు.కలుషిత నీటి వల్ల అనారోగ్యం పాలైన ఒక పాపను కపాడుకోలేని నిస్సహాయతలో ఉన్న ఒక తల్లి.ఈ నాలుగు కథలులలో గల ఐదు పాత్రలు తీసుకున్న ఒక్క నిర్ణయం ముందు.. తర్వాత ఏమి జరిగింది అనే కథాంశంతో వస్తున్న సినిమా జోహార్..!


విచిత్రమైన పోస్టర్స్ తో సినిమాపై ప్రేక్షకుల గురి కుదిరేలా చేసుకున్నారు దర్శకుడు తేజ.అలానే ఇప్పటికే విడుదలైన నీ రూపం ఎదురుగా.. పాటకు సైతం ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.నిజానికి వేసవిలో విడుదులకు సిద్ధమైంది ఈ సినిమా.కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో సినిమా విడుదలకు నోచుకోలేదు.ఇప్పటికే పలు సినిమాలు ఓ.టి.టి ద్వారా విడుదల చేస్తుండటం.. మరో పక్క ధియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేకపోవడంతో దర్శక నిర్మాతలు సినిమాను ఓ.టి.టి ద్వారా విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నారు.


నేడు.. ఈ సినిమా ఆహా యాప్ ద్వారా ఆగస్ట్ 14న విడుదల చేస్తున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు.జోహార్ శీర్షిక..హిస్టరీ ఐస్ సెట్ ఆఫ్ లైస్ యగ్రీడ్ అపోన్(History is a set of Lies Agreed upon)తెలుగులో అనువాదిస్తే..చరిత్ర అంగీకరించిన అబద్ధాల సమితి అనే బలమైన అర్థం వస్తుంది.ఇలాంటి బలమైన శీర్షిక తో వస్తున్న సినిమా జోహార్.కొత్త తరహా సినిమాలను ఎప్పుడు ప్రోత్సహించే మన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందో లేదో తెలియాలంటే.. ఆగస్ట్ 14వరకు ఆగాల్సిందే..!