24-01-2022 16:08:54 About Us Contact Usజీవితా రాజశేఖర్..నేటి తరానికి జీవితా రాజశేఖర్ గా బాగా పరిచయమైన పద్మ గారు నిజానికి 1984లో అప్పటి ప్రముఖ దర్శకుడు టి.రాజేందర్ గారి ఇరవై కథకలి అనే తమిళ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..నటిగా ప్రస్థానం మొదలు పెట్టిన తొలి సినిమాలోనే దర్శకుని సూచనతో పద్మ పేరు మార్చి జీవితంగా పరిచయమయ్యారు. కేవలం మూడేళ్ళల్లో ఒక తమిళ భాషల్లో దాదాపు ఇరవైకి పైగా సినిమాలు నటించింది..తమిళంలో స్టార్ గా మారిపోయారు..తొలి సినిమా విడుదలకు ముందే ఆమె నాలుగు సినిమాలకు సైన్ చేశారు..దీనికి కారణం ఆమె తొలి సినిమా ప్రముఖ దర్శకులు టి.రాజేందర్ గారు చెయ్యడం..అప్పటికి అమె ఇంకా ఇంటర్ విద్యార్థిని.. తొలుత ..అతి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు ఆమెకు వచ్చాయి అంటే ఆమె ఆ రోజుల్లో ఎంత బాగా నటించారో,అందరితో ఎలా పద్దతిగా నడుచుకున్నారో అర్ధమవుతుంది.


1987లో విడుదలైన తలంబ్రాలు సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు.ఆ సినిమా లో హీరో రాజశేఖర్ గారు..అటు తమిళం,ఇటు తెలుగు లో కలిపి దాదాపు 40 సినిమాలకు పైన చేశారు..కేవలం రాజశేఖర్ తోనే ఎక్కువ సినిమాలు నటించారు జీవిత గారు..డామిట్ కథ అర్థం తిరిగింది సినిమాలో రాజేంద్రప్రసాద్ గారి తో,జానకి రాముడు సినిమాతో నాగార్జునతో కలిసి నటించారు..అన్న చెల్లెలు సినిమాలో శోభన్ బాబుగారికి చెల్లిగా చేశారు..1990లో రాజశేఖర్ తో కలిసి చేసిన మగాడు సినిమా ఆమె చివరి సినిమా..ఆ సినిమా తర్వాత రాజశేఖర్ గారికి ఆక్సిడెంట్ అవ్వడం తో అప్పటికే బిజీ హీరోయిన్ అయిన జీవిత గారు సినిమాలు చెయ్యడం ఆపేసి రాజశేఖర్ గారి బాగోగులు చూసుకోవడం మొదలు పెట్టారు..జీవిత గారి తండ్రి చనిపోవడంతో సంవత్సరం తర్వాత 1991లో పెళ్లి చేసుకున్నారు..


జీవిత గారి తండ్రి గారిది కాకినాడ,తల్లిగారిది విజయవాడ మద్రాస్ లో చాలా సాధారణ కుటుంభం వారిది.అక్కడ నుండి సినిమాలో నటిగా జీవితం ప్రారంభించి కేవలం ఆరు సంవత్సరాలలో 40కి పైగా సినిమాలు చేసి బిజీ హీరోయిన్ గా పేరు గడించిన ఆమె,పెళ్లి చేసుకొని తిరిగి మళ్ళీ సాధారణ గృహిణిగా మారిపోయారు..ఆ తర్వాత తిరిగి మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు.. 2002లో రాజశేఖర్ గారి శేషు సినిమాకి దర్శకత్వం వహించిన జీవిత గారు,2007లో ఎవడైతే నాకేంటి,2009 లో సత్యమేవ జయతే,2013లో మహంకాళి వాటి సినిమాలకు దర్శకత్వం వహించారు..2004లో ఆప్తుడు,2007లో ఎవరైతే నాకేంటి,2013లో మహంకాళి సినిమాలను నిర్మించారు..ఇలా ఏ రాజశేఖర్ గారి కోసం సినిమాలలో నటించడం ఆపేసారో ఆయన కోసమే మళ్ళీ సినీ రంగంలోకి వచ్చి సినిమాలు చేశారు.


ఇప్పుడు తన పిల్లలు శివావి,శివాత్మికలను హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నారు..ఇప్పటికే చిన్న కూతురు శివాత్మిక దొరసాని సినిమాతో పరిచయం అయ్యింది..కృష్ణ వంశీ గారు చేస్తున్న రంగమార్తాండ సినిమాలో చేస్తుంది..పెద్ద కూతురు శివాని 2స్టేట్స్ రీమేక్ సినిమా ప్రారంభించినా కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది..త్వరలో మరో సినిమాతో ప్రక్షకుల ముందుకు రానుంది..ఇలా ఒక నటిగా జీవితం ప్రారంవించి 1984 నుండి నేటి వరకు సినిమా వ పరిశ్రమ లోనే వున్నారు జీవిత..మా అసోసియేషన్ మెంబెర్ గా ఆక్టివ్ గా వుండే జీవిత,సెన్సార్ బోర్డ్ మెంబెర్ గా పని చేస్తు ఫైర్ బ్రాండ్ గా ముద్ర పొందారు జీవిత..నిజంగా సినిమాల్లో ట్యాలెంట్,హార్డ్ వర్క్ ఉంటే ఏ ఒక్కరి సహాయం లేకుండా చిత్ర పరిశ్రమలో పైకి రావచ్చు అని చెపేందుకు గొప్ప నిదర్శనం జీవిత గారి జీవితం..


నిజంగా అక్కడ అవకాశాలు రావు,లేకుంటే అవకాశాలు కోసం హీరోయిన్లు ఇంకేదో చేయాలి అని బయట జరుగుతున్న ప్రచారం నిజమైతే అదే పరిశ్రమలో 30 ఏళ్ల నుండి చూస్తున్న జీవిత గారు ఒక తల్లిగా తన కూతుర్లని అదే పరిశ్రమకు పరిచయం చేస్తారా..ఆమె అలా తన కూతుర్లని హీరోయిన్ గా పరిచయం చేయడం ద్వారా సినీరంగంలోకి రావాలి అని కోరుకునే అమ్మాయిల ఇళ్ళల్లో చెప్పుకునేందుకు గొప్ప ఉదాహరణగా మారారు..అన్ని తెలిసిన జీవిత రాజశేఖర్ గారు తమ పిల్లలని సినిమాల్లోకి పంపారు కనుక ఏమి తెలియని మీరు మమ్మల్ని పంపించండి అని ఒక నటి అవ్వాలి అనే కోరిక కలిగిన అమ్మాయి తన తల్లితండ్రులతో మాట్లాడగలడు..దీనికి జీవితగారిని మెచ్చుకోవాలి…అంతేకాదు దొరసాని సినిమా విడుదల సమయంలో సామాజిక మాధ్యమంలో అనేక ట్రోలింగ్స్ శివాత్మిక పై వచ్చాయి..దానికి చిన్న వయసు గల ఆ అమ్మాయి ఎంత బాధ పది ఉంటుందో,తల్లిగా అది చూసి ఆమె ఎంత బాధ పడివుంటారో అర్థం చేసుకోవచ్చు..అయినా వెనకడుగు వేయని జీవిత గారికి సెల్యూట్..రానున్న రోజుల్లో ఇద్దరు కూతుర్లు అదే విమర్శకుల ప్రశంసలు పొందే నటిమణులుగా మారి ఆమెకు తిరిగి ఆనందాన్ని ఇస్తారు అని కోరుకుందాం..


నటిగా,హీరోకి అన్ని చూసుకునే భార్యగా, దర్శకురాలిగా,నిర్మాతగా,ఇప్పుడు హీరోయిన్ తల్లి గా 36ఏళ్ళు తన జీవితాన్ని సినీ రంగంలో గడిపేసిన జీవిత గారి ప్రస్థానం సినిమా రంగంలోకి రావాలి అనుకునే ఎందరో అమ్మాయిలకు ఆదర్శం కావాలి అని కోరుకుంటూ..చిత్ర పరిశ్రమలోని తెలుగు మహిళా సాధికారత లో భాగంగా తొలుత జీవితగారి గురించి వ్యాసాన్ని రాశాము..రేపు యాంకర్ గా అడుగు పెట్టి నటిగా మారిన తెలుగు అల్లరి పిల్ల కలర్స్ స్వాతి గారి గురించి..