03-12-2020 22:45:22 About Us Contact Us



కరోనా సమయంలో లాక్ డౌన్ పైన మరో పాట తెలుగులో విడుదలైంది..అన్ని పాటలకు భిన్నంగా ఈ పాట ఉంది..ఇప్పుడిప్పుడే కొంచం కొంచంగా లాక్ డౌన్ నుండి విడుదలవుతున్న తెలుగు యువతకు పార్టీ సాంగ్ ఒక్కటి దొరికింది..అది కూడా ర్యాప్ సాంగ్..తెలుగులో అతి తక్కువగా ర్యాప్ సింగెర్స్ ఉన్నారు.. కొత్తగా యూట్యూబ్ లో తరచుగా కనిపిస్తున్న మాహాదేవ శాస్ట్రీ..అదే ర్యాపర్ మాహా..పాడిన పాట ఇది..నటి..దర్శకురాలు..గాయత్రి గుప్తా దర్శకత్వంలో..సంగీత దర్శకుడు శశాంక్ అలమురు సంగీతం అందించగా..అమర్ ఫిక్సలర్ కెమరామెన్ గా..మాహా తానే రాసి..పాడిన పాట “హౌస్ పార్టీ”..


ర్యాప్ అనగానే..మనకు రాని భాషలో..అర్థం లేని పదాల అమరికతో..భయంకరమైన శబ్దం మధ్యలో వచ్చే నాలుగు లైన్లు..ఇది కొన్ని సంవత్సరాల ముందు దాక తెలుగు వారికి ర్యాప్ అనగానే గుర్తుకు వచ్చేది..కొన్ని సంవత్సరాలు గా తెలుగు భాషలో ర్యాప్ పాటలు బాగా క్లిక్ అవుతున్నాయి..కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ లో అనేక పాటలు మన తెలుగులో వచ్చినా అన్ని జాగ్రత్తలు చెప్పేవే..ఇప్పుడు తాజాగా మాహా విడుదల చేసిన ఈ పాట..మంచి పార్టీ సాంగ్ లా అనిపిస్తుంది..


ఔట్ సైడ్.. ఇన్సైడ్..నార్త్ సైడ్..సౌత్ సైడ్..ఔట్
ఇట్స్ హౌస్ పార్టీ..
నా గేమ్ వన్ సైడ్..లో..కీ.. ఖ్వరంతైన్..
ఇట్స్ హౌస్ పార్టీ..


అంటూ భలే సరదాగా..లాక్ డౌన్ లో కొంచం అతి చేస్తున్న వాళ్ళకి చురకలు అంటించేలా లిరిక్స్ చాలా బాగున్నాయి..మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది..కెమెరా మ్యాన్ బాగా తీసినట్లు తెలుస్తుంది..మొత్తం మీద లాక్ డౌన్ లో గాయత్రి గుప్త ప్రయోగం విజయం సాధించింది అనే చెప్పాలి..ఇప్పటి నుండి హౌస్ పార్టీ అంటే..వెంటనే “మాహా హౌస్ పార్టీ” పాట ప్లే చేస్తారు..ఇంకెందుకు ఆలస్యం..హౌస్ పార్టీ సాంగ్ ని మీరు కూడా వినండి..మీరు రిపీట్ లో వింటూనే ఉంటారు..


House Party Maahaa