05-12-2020 13:15:40 About Us Contact Us


సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ లోని హే ఇది నేనేనా.. పాట రెండు రోజులుగా ట్రెండింగ్ లో నిలిచింది. తమన్ స్వరపరిచిన ఈ పాట ఇప్పుడు ప్రతి యువకుడి నోటా వినిపిస్తుంది. కేవలం యూట్యూబ్ లో మాత్రమే రెండు రోజుల్లో ఈ పాటను 20లక్షల మంది విన్నారు అంటేనే ఆ పాట ఎంతలా చేరిందో తెలిసిపోతుంది. వివరాల్లోకి వెళ్తే..


అప్పటి వరకు ఏ అమ్మాయి వెంట పడని ఒక్క అబ్బాయి(విరాట్).. అమ్మాయి(అమృత) వెనక పడితే తనలోని మార్పును గమనించిన ఆ సోలో కుర్రాడు పాడిన పాట..”హేయ్.. ఇది నేనేనా.. హేయ్ ఇది నిజమేనా..” పాట. పాట రాసిన రఘురామ్ నేటి తరానికి చాలా దగ్గరగా పదాలను రాశారు.మరోపక్క లిరిక్స్ కి తగ్గట్లు మరో చక్కటి మెలోడీ రాగం ఇచ్చారు సంగీత దర్శకులు తమన్.దింతో యువతకు పాడుకోవడానికి మరో పాట దొరికినట్లు అయింది.ప్రముఖ గాయకుడు సీడ్ శ్రీరామ్ ఈ పాటను పాడటం మరో విశేషం.



సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్,నభా నటేష్ లు హీరో,హీరోయిన్ గా.. అటు కెమెరా.. ఇటు దర్శక శాఖలలో పని చేసిన సుబ్బు తొలిసారి దర్శకత్వం చేస్తున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్.ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్.. ఏస్.వి.సి.సి బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.నిజానికి ఈ సినిమా వేసవికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా కరోనా వల్ల సినిమా వాయిదా పడింది.ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ తో ఐదు సినిమాలకు సంగీతం అందించిన ధరమ్ తేజ్ మిత్రుడు తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.వీరిద్దరి కలయిక లో వచ్చిన ప్రతి సినిమాలోని పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి.


ఈ సినిమాలోని తొలి పాటగా నో పెళ్ళి.. అనే పాట విడుదల చేశారు.ఇప్పటికే ఆ పాటను 1 కోటి 40 లక్షల మంది విన్నారు.ఇప్పుడు ఈ పాట కూడా ట్రెండింగ్ లో నెంబర్ 1 గా నిలవడం.. పాట చాలా బాగుండటం.. యువత నుంచి మంచి స్పందన వస్తుండటం.. మరో పక్క నేటి నుండి వీకెండ్ కావడంతో ఈ పాటను కూడా చాలా మంది వినే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేక్షకులు అంచనా వేస్తున్నారు.


చిత్రాలహరి.. ప్రతిరోజు పండగే వంటి భారీ విజయాలతో మంచి జోష్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్ కు తన తదుపరి సినిమా ఆల్బమ్ లోని పాటలు వరస విజయాలు సాధిస్తూ ఉండటంతో Hat-Trick విజయాలు అందుకునే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.ఈ సినిమాలోని మిగతా పాటలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావాలని.. ఈ సినిమా భారీ విజయం సాధించి.. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఖాతాలో మరో హిట్ నమోదు కావాలని.. మరో కొత్త దర్శకుడు పరిశ్రమలో బిజీ అవ్వాలని కోరుకుందాం..!

హే ఇది నేనేనా.. పాట..