24-01-2022 15:37:10 About Us Contact Us1987లో ఈనాటి గోదావరిలోని రాజోలు అనే గ్రామంలో పెద్ద వంశీ గారు దర్శకత్వంలో “కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్” అనే సినిమా చిత్రీకరణ జరుగుతుంది..అక్కడ షూటింగ్ లొకేషన్ కి రోజు చింతకాయలో,మామిడికాయలో ఇలా వారి ఉరిలో వుండేవి తీసుకొస్తూ అందరితో కలిడివిడిగా ఒక పాప తిరుగుతుండేది..ఆ పాప వయసు ఆరోజుకి 12 లేదా 13 సంవత్సరాలు ఉంటాయి..ఆ పాపకు ఆ షూటింగ్ జరుగుతున్న విధానం,సెట్ వాతావరణం బాగా నచ్చినట్లు ఉంది..వెంటనే ఆ సినిమా షూటింగ్ తర్వాత తను కూడా సినిమాల్లో నటించాలి అని చెన్నై బయలుదేరి వెళ్ళింది,ఆ 7వ తరగతి అమ్మాయి..ఆమె ఎవరో కాదు,వెండితెర ఎలావేల్పుగా మారిన మెగాస్టార్ చిరంజీవి గారి వీరభిమాని..దాదాపు 250 సినిమాల్లో నటించిన ఆర్టిస్ట్..ఒక దశలో అగ్ర హీరోయిన్ లకు ఫ్రెండ్ అంటే తనే అనే స్థాయి..తన కోసం క్యారక్టర్ రాసే స్థాయికి ఎదిగిన నటి..ఫైర్ బ్రాండ్ అని మీడియా అంటుంటే తను నవ్వుతూ మాకు భోజనం తేవడమే తెలుసు అని తెలుగు చిత్ర పరిశ్రమ అంటుంది..క్షణం క్షణం సినిమా వల్లే నేటికి నాకు అవకాశలు వస్తున్నాయి అంటూ చెప్పిన గోదావరి అమ్మాయి హేమ.


1988లో రాజోలు వదిలి వెళ్ళిన హేమ..తెలిసిన వారి ఇంట్లో ఉంటూ నాట్యం నేర్చుకుంటూ..తన ఇబ్బంది తెలిస్తే తల్లి తీసుకెళ్లిపోతుందేమో అని చెప్పకుండా అక్కడే ఒక పూట భోజనం చేస్తూ గడిపిన ఆ 14 ఏళ్ల పిల్ల మొండితనాన్ని మనం ఏమని చెప్పాలి..1989లో కూతురి కోసం తల్లి చెన్నైలో ఇల్లు తీసుకుంటే..తిరిగి వెళ్తే తన ఉరి వారు అవమానిస్తారేమో అనే భయంతో..పట్టుదలతో అడుగులు ముందుకు వేసిన ఆ బాలిక ధైర్యాన్ని మనం ఏమని చెప్పాలి..నాట్యం నేర్చుకుంటూనే వచ్చిన తొలి సినిమా అవకాశంలో తన సత్తా చాటడంతో ఆ తర్వాత కనీసం ఒక్క కంపెనీకి కూడా తను ఆల్బమ్ పట్టుకొని వెళ్లాల్సిన అవసరం రాలేదు.ఆ తొలి సినిమాకు పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు..ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇలా ఎవరో ఒక్కరు మరో సినిమాలో తన గురించి చెప్పడంతో తన ప్రతిభతో ఒక సంవత్సరంలోనే నాలుగైదు సినిమాల్లో అవకాశాలు సంపాదించిన ఆ అమ్మాయి ప్రతిభను ఏమని పొగడలి..త్రివిక్రమ్ గారి భాషలో చెప్పాలి అంటే క్లాస్ లో ఎవరైనా చెబుతారు..ఎక్సమ్ లో రాసే వాడే టాప్పర్..అలానే నటన ఎవరైనా చేస్తారు..కానీ వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నవారే స్టార్ అవుతారు..దీనికి నిలువేట్టు నిదర్శనం హేమ..


1989లో సినిమాలు ప్రారంభించిన హేమ..1991 నాటికి దాదాపు 25 సినిమాలు చేసేశారు..దింతో మంచి వేషం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్న సమయంలో ఇండియన్ స్టార్ డైరెక్టర్ లలో ఒక్కరైన ఆర్.జీ.వి గారి క్షణం క్షణం సినిమా లో పాత్ర దొరికింది.ఆ పాత్ర ఆమెకు ఇప్పటికి కాదు కాదు..హేమ అనగానే మనకు ఎప్పటికీ టక్కున గుర్తుకొచ్చే పాత్రలా నిలిచిపోయింది..ఆ తర్వాత ఆమె వెనక్కి చూసుకునే పని లేకుండా పోయింది..తనకు వచ్చిన పాత్రకి న్యాయం చేసుకుంటూ..తను చేసిన సినిమా వల్ల మరో పాత్ర వచ్చే విధంగా చేసుకుంటూ వెళ్లిపోయిండి.గడిచిన 30ఏళ్ళల్లో 250 పైగా సినిమాలలో చేశారంటే ఆమె బయటకంటే కంటే సినిమాల్లోనే ఎక్కువ గడిపివుంటారు..


2005లో త్రివిక్రమ్ గారి అతడు సినిమాతో నేటి తరానికి బాగా దగ్గరయ్యారు హేమ..స్కీన్ ఏదైనా హేమ చెయ్యలేక పోవడం అనే ప్రశ్న లేదు..కనిపించిన కాసేపైనా అటు ప్రేక్షకులు,ఇటు పరిశ్రమ వారికి గుర్తుండేలా నటిస్తారు హేమ..కుమారి 21 ఎఫ్ లో రాజ్ తరుణ్ కి తల్లిగా చాలా సున్నితమైన పాత్రలో కనిపించారు..నిజానికి ఆమె అలా చేయగలరు అని ఎవరూ ఊహించి వుండరు..ఇక తాజాగా వచ్చిన వినయ విధేయ రామ లో ఆమె మంచి మాస్ పాత్ర లో నాటుగా చెప్పాలి అంటే ఇరగడిశారు అనే చెప్పాలి..సోషల్ మీడియాలో సైతం హేమ ఐస్ బ్యాక్ అన్నారు అంటే ఆ సినిమాలో ఆమె క్యారటర్ ఏ స్థాయిలో కనెక్ట్ అయిందో అర్ధమవుతుంది..ఒక దశలో కమెడియన్ ఎవరైనా వైఫ్ అంటే హేమ అనే స్థాయిలో సినిమాలు చేశారు హేమ..


అలాంటి హేమ సినీ ప్రస్థానం నేటితరంలో చిత్ర పరిశ్రమ వైపు రావాలి అని అనుకునే అమ్మాయిలకు ఆదర్శం..ఏడవ తరగతి చదువుతున్న అమ్మాయి సినిమాల్లోకి వెళ్ళాలి అని చెన్నై కి వెళ్లడం అంటే దాని సాహసం అనే చెప్పాలి..నేటి తరానికి చిన్న ప్రయత్నం చేసేందుకే భయపడుతున్నారు..మరి అమెలా చెయ్యడం అసాధ్యం ఏమో.. “సినిమాలో నటించాలి అనుకున్నారు..హీరోయిన్ అవ్వాలి..ప్రేమ..షోకులు.. అనే సైడ్ ట్రాక్ కి పోకుండా.. సినిమాలు మాత్రమే చేశాను” అని ఒక ఇంటర్వ్యూలో హేమ అన్నారు..ఇదే నేటి తరానికి ఆమె ఇచ్చిన చక్కటి సందేశం అని చెప్పుచు..సినిమాలో పాత్రలు చేయాలి అని వస్తే వాటి మీద మాత్రమే శ్రద్ధ పెట్టాలి..అలా కాకుండా జల్సాలు..ప్రేమ..అంటూ పక్క దారి పడితే మనన్ని పక్కన పెట్టేస్తారు అని అనుకోవడమే..ఎన్నో పాత్రలతో మనల్ని అలరించిన హెమ గారు త్వరలో తనకిష్టమైన డైనమిక్ పోలీసు పాత్ర చెయ్యాలని కోరుకుంటూ హేమ గారికి హాట్స్ ఆఫ్..


మహిళా సాధికారతలో భాగంగా చిత్ర పరిశ్రమలోని తెలుగు మహిళలను గుర్తు చేసుకుంటున్న మేము..నేడు హేమ గారి గురించి వ్యాసము విడుదల చేస్తున్నాము..రేపు నేటి తరం మహిళా దర్శకురాలు నందిని రెడ్డి గారి పై వ్యాసము..