03-12-2020 21:41:56 About Us Contact Us



సుధాకర్ నాయుడు అంటే పెద్దగా ఎవరు గుర్తుపట్టకపోవచ్చు.. అదే జీవి.. అనగానే అందరికి గుర్తుకొస్తారు.. ఒక నటుడిగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి.. ప్రతినాయకుడిగా ఎదిగి.. దర్శత్వం సైతం చేశారు.. ఒక తెలుగు మాత్రమే కాక.. తమిళ.. కన్నడ.. హిందీ భాషల్లో సైతం సినిమాల్లో నటించారు.. అలా ఆయన దాదాపు 400 పైన సినిమాలు చేశారు.. అలాంటివి జి.వి గారి పుట్టినరోజు నేడు.. దాసరి గారు చిరంజీవి గారి లోని చివరి రెండు అక్షరాలు తన పేరు ముందర పెట్టడంతో జీవి సుధాకర్ నాయుడు గా మారిన జీవి గారి గురించి ఒక కథనం..


పోలీసు కుటుంబంలో జన్మించిన సుధాకర్ నాయుడు.. చెన్నై లో విద్యాభాసం చేశారు.. లా చదివేందుకు ఢిల్లీ.. వెళ్లి దానిని తిరిగి ఆంధ్ర ప్రదేశ్ లో పూర్తి చేశారు.. విదేశాల్లో లా మాస్టర్స్ చేసి వచ్చారు.. ఒక పక్కా తెలుగు విద్యార్థిగా విదేశాలు వెళ్ళిన జీవి.. తిరిగి స్వదేశానికి ఒక అమెరికన్ వేషధారణలో వచ్చారు.. బాగా పెరిగిన హెయిర్ తో దాసరి గారికి తెచ్చిన బహుమతి ఇచ్చేందుకు వెళ్లారు.. అక్కడ ఆయనను చూసి సినిమాలో చెయ్యాలి అంటూ తొలి సినిమా దాసరి గారి దగ్గర చేశారు.. అక్కడ నుండి కృష్ణ వంశీ గారు చేసిన అంతపురం లో అవకాశం వచ్చింది.. అక్కడ నుండి ఇక ఆయన తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.. మధ్యలో ఆక్సిడెంట్ కారణంగా.. తన లా ప్రాక్టీస్ లో భాగంగా ఆయన పై పడిన కేసు కారణంగా కొంత గ్యాప్ వచ్చినప్పటికీ.. ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు.. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుండి నేటి తరం హీరోల దాక అందరితో నటించారు జీవి గారు.. గడిచిన 20 ఏళ్ళల్లో 400 సినిమాలు చెయ్యడం ఒక రికార్డ్ అయితే.. అందులో ముఖ్య పాత్రలు.. చాలా మంచి సినిమాలు.. ఎక్కువ హిట్ సినిమాలు చెయ్యడం మరో రికార్డ్.. నితిన్ తో హీరో.. శ్రీకాంత్ తో రంగ ది దొంగ సినిమాలను తెరకెకించి.. తన దర్శకత్వ ప్రతిభను చూపించారు జీవి..


చదువుకున్నది న్యాయశాఖ వల్ల కావచ్చు చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏ వివాదం తలెత్తినా తాను అక్కడికి వచ్చి సాధ్యమైనంత వరకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ వుంటారు.. సినిమా లో క్యారక్టర్(పాత్ర) కోసం నా క్యారక్టర్ (వ్యక్తిత్వం) చంపుకొను అని గతంలో చెప్పారు జీవి.. తన వంట్లో పట్టు ఉన్నంతవరకు విలన్ పాత్రలు మాత్రమే చేస్తాను అని చెప్తున్న జీవి గారు మరిన్ని సంవత్సరాలు చిత్ర పరిశ్రమలో ఉండాలి అని.. చిరస్తాయిలో నిలిచిపోయే పాత్రలు ఆయనకు ఇంకా రావాలి అని కోరుకుందాం.. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న జీవి సుధాకర్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంశాలు..