01-12-2020 17:37:57 About Us Contact Us



2012లో “ఇష్క్” తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘నితిన్’ మళ్ళీ ‘నిత్యా మీనన్’ తో కలిసి నటించడం,సంగీతం సైతం ఇష్క్ తో ఆల్బమ్ హిట్ అందుకున్న ‘అనూప్ రూబెన్స్’ ఇస్తుండడంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.దర్శకుడు ‘కొండ విజయ్ కుమార్’ కు తొలి సినిమా..సినిమా టైటిల్ విషయానికి వస్తే నితిన్ కు ఇష్టమైన “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” చాలా రోజుల తర్వాత “గబ్భర్ సింగ్” తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు..ఆ సినిమాలోని “గుండెజారి గల్లంతయ్యిందే”అనే పాటని సినిమా టైటిల్ గా ప్రకటించారు.దింతో నితిన్ మరోసారి పవన్ కళ్యాణ్ పైన ఉన్న అభిమానాని చాటుకున్నట్లయింది.


అనూప్ రూబెన్స్ తనదైన భానిలతో మరోసారి యువతను అలరించాడు.దింతో మళ్ళీ ఆల్బమ్ హిట్ అందుకున్నాడు అనూప్.మరోపక్క పోస్టర్స్,టీజర్,ట్రైలర్ సైతం యువతను ఆకట్టుకుంది.దింతో విడుదలకు ముందే సినిమా హిట్ టాక్ సంపాదించింది.2013 ఏప్రిల్ 19న విడుదలైన ఈ చిత్రం భారీ విజయం నమోదు చెయ్యడముతో పాటు నితిన్ కారియర్ లోనే 2013 వరకు విడుదల చేసిన అన్ని సినిమాలతో పోల్చుకుంటే అత్యధిక వస్సులు సాధించిన సినిమాగా నిలిచింది.యువత,ఫామిలీ,మాస్ అనే తేడా లేకుండా ప్రతిఒక్కరు సినిమాను చూశారు..


నితిన్ కు స్నేహితురాలైన ప్రముఖ బ్యాట్మింటన్ కక్రీడాకారిణి గుప్త జ్వాల ఈ సినిమాలో ఒక పాటలో డాన్స్ చేశారు.ఆమె అంతకుముందు,ఆ తర్వాత మరే సినిమాలో కనిపించలేదు.దింతో ఈ సినిమాకు అరుడైన గుర్తింపు వచ్చింది.. నితిన్-ప్రవీణ్ ల సన్నివేశాలు..అలీ,నిత్యా మీనన్ ట్రాక్ సినిమాలో బాగా నవ్వుకునే సన్నివేశాలు..మరో అమ్మాయిని ప్రేమించిన నితిన్,చివరకు మళ్ళీ నిత్యా దగ్గరకు రావడంతో సినిమా పూర్తవుతుంది.ఇక్కడ తన బాస్ గురించి తనకే చెబుతాడు నితిన్.ఆ సన్నివేశాలు ఇప్పటికి గుర్తే…


సినిమా విడుదలై 7 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా లో నితిన్ ఫాన్స్ సంబరాలు జరుపుకోవడంతో మరోసారి వార్తల్లోకి ఈ సినిమా నిలిచింది.ఈ సినిమాతో హిట్ పెయిర్ గా నితిన్,నిత్యా,క్రేజీ కంబోగా నిలిచిన అనూప్,నితిన్..సినిమాలోని సన్నివేశాలు అన్ని ఇంకా కళ్ళకు కట్టినట్లే ఉన్నాయి,అప్పుడే సినిమా విడుదలై 7 ఏళ్ళు అయిందంటే నమ్మసఖ్యంగా లేదు..ఏదేమైనా ఇష్క్ తో కొన్ని సంవత్సరాల తరువాత హిట్ అందుకున్న నితిన్ ని ట్రాక్ లోకి తీసుకొచ్చిన సినిమా “గుండెజారి గల్లంతయ్యిందే”.ఎలాగో అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి మరోసారి ఈ సినిమాను చూసి నవ్వుకుందాం..