05-12-2020 13:27:27 About Us Contact Us



28 సంవత్సరాలలో 12 సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో మూడు సినిమాలు సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో.. రెండు మెగాస్టార్ చిరంజీవి గారితో.. తెలుగు చిత్ర పరిశ్రమలో సెట్స్ కి కేర్ ఆఫ్ అడ్రెస్.. అవార్డ్స్ కి పర్మనెంట్ అడ్రస్ గా మారిన దర్శకులు గుణ శేఖర్.. విభిన్న కథలతో.. విచిత్రమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నారు…


1992లో లాఠీ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు..అంతగా ముందు రాం గోపాల్ వర్మ గారి వద్ద పని చేశారు.. రెండవ సినిమాగా సీనియర్ నటుడు నరేష్ గారితో సొగసు చూడ తరమా అనే సినిమా చేశారు.. 1996లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బాల్యంలోనే మెయిన్ లీడ్ గా పెట్టి రామాయణం అనే సినిమా తీశారు..1998లో మెగాస్టార్ చిరంజీవి గారితో చేసిన చూడాలని ఉంది అని సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.. 2000లో మ్యాన్లీ హీరో జగపతి బాబు గారితో మనోహరం.. 2001లో మళ్ళీ మెగాస్టార్ తో మృగరాజు చేశారు.. 2003 లో విడుదలైన ఒక్కడు తో మరో అతి పెద్ద హిట్ అందుకున్నారు గుణశేఖర్.. అటు మహేష్ బాబు కెరీర్ లో టాప్ మూవీస్ లో ఒక్కటిగా ఈ సినిమా నిలిచింది.. చార్మినార్ సెట్ అప్పట్లో తెలుగు పరిశ్రమలో పెద్ద చర్చ నడిచింది..


ఆ తర్వాత వరుసగా మహేష్ బాబు తో 2004లో అర్జున్.. 2006లో సైనికుడు..అంటూ రెండు సినిమాలు చేశారు.. మధ్యలో విరామం తీసుకున్న గుణశేఖర్.. 2010లో భారీ సెట్ తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో వరుడు సినిమా చేశారు.. 2012లో మాస్ మహరాజ్ రవితేజ తో నిప్పు చేశారు.. 2015 లో అనుష్క ప్రధాన పాత్రదారిగా.. భారీ సెట్స్ తో.. భారీ తారాగణంతో చేసిన సినిమా రుద్రమదేవి.. నిజంగా ఆరోజుల్లో ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్లు చూపించారు.. ఇప్పుడు రానా దగ్గుబాటి తో కలిసి హిరణ్య కశ్యపా అనే పోరాణిక సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..సినిమా ప్రి-ప్రొడక్షన్ వర్క్ మూడు సంవత్సరాలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు కధ పై ఏ స్థాయిలో ఆయన శ్రద్ధ పెట్టారో..అంటే కాక ఇది భారీ వ్యయంతో నిర్మిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.. ఇదే కనుక నిజమైతే పౌరాణిక సినిమా సెట్ ల దర్శకుడు గుణశేఖర్ చేస్తున్నారు కనుక.. కచ్చితంగా మనం కళ్ళు చేదిరేలా ఉంటాయేమో ఆ విజువల్స్… ఊహిస్తుంటేనే ఆనందంగా ఉంది..ఈ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుందాం..


చేసింది తక్కువ సినిమాలే అయినా అందులోనే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.. రాణి రుద్రమదేవి కధ ప్రేక్షకులకు చెప్పాలని..నిర్మాతగా కూడా మారారు.. ఎప్పుడు ఏదో మంచి కథను ప్రేక్షకులకు చెప్పాలి అని చూసే గుణశేఖర్ గారు నేడు 56వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు..బి.ఆర్.మూవీ జోన్ తరపున గుణశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..!