24-01-2022 17:00:25 About Us Contact Usతెలుగు వెండితెరపై అతి చిన్న వయసులోనే అటు హీరోగా.. ఇటు విలన్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్న నేటి తరం నటుడు.. యాక్షన్ సినిమాలకు కేర్ ఆ అడ్రెస్ గా మారిన మ్యాచో స్టార్ గోపిచంద్ గారు నేడు 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు..


1983 నుండి 1986 మధ్య తెలుగు పరిశ్రమలో వరసగా విప్లవ సినిమాలు వచ్చాయి.. అందులో నేటి భారతం.. దేశంలో దొంగలు పడ్డారు.. దేవాలయం.. వందేమాతరం.. ప్రతిఘటన.. ఇన్ని సినిమాలు చేసిన ఒక రచయిత.. దర్శకులు.. నిర్మాత.. తొటెంపుది కృష్ణ గారు.. ఆయన మరణానంతరం విడుదలైన సినిమా రేపటి పౌరులు.. ఈ సినిమాలు ఆ తరాని కదిలించాయి.. నేటి తరం పీపుల్ స్టార్ గా పేరు పొందిన ఆర్. నారాయణ మూర్తి గారికి స్ఫూర్తి ఈయనే.. అలాంటి టి. కృష్ణ గారి సినీ వారసుడిగా ముత్యాల సుబ్బయ్య వద్ద దర్శక డిపార్ట్ మెంట్ లో పని చేసి.. సొంత బ్యానర్ లో సినిమా ప్రారంభించిన పెద్ద కుమారుడు ప్రేమ్ చంద్ ఆ సినిమా మధ్యలోనే రోడ్ ప్రమాదంలో మృతి చెందారు.. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే..


1979లో ఆ టి. కృష్ణ గారి రెండవ కుమారుడిగా జన్మించి.. 8 ఏళ్ళ వయసులో తండ్రిని కోల్పోయిన ఆ యువకుడి పేరు గోపిచంద్.. బి.టెక్ చదవడానికి రష్యా వెళ్లిన గోపిచంద్ కు తన అన్నయ్య మరణ వార్త మరో షాక్.. వీసా ఇబ్బందుల కారణంగా గోపిచంద్ ఆనాడు రాలేకపోయారు.. ఆ తర్వాత విద్య పూర్తి చేసుకొని వచ్చిన గోపిచంద్.. సినీరంగంలోకి అడుగు పెట్టారు.. తొలుత డైలాగ్ డెలివరీ కోసం శిక్షణ తీసుకున్నారు.. 2001లో తొలివలపు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నారు..2002 లో తేజ గారి దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో విలన్ గా కనిపించారు.. హీరోగా సినిమాలు చేయాలని వచ్చిన గోపిచంద్ నెగటివ్ రొల్ చెయ్యడం అప్పుడు టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయింది.. 2003లో నిజం.. 2004లో వర్షం లో విలన్ గా చేశారు.. తమిళంలో తెలుగు జయం రీమేక్ లోను ప్రతి నాయకుడు పాత్ర చేశారు.. ఇక ఇలాంటి పాత్రలే చేస్తారేమో అనుకునే లోపు.. యజ్ఞం సినిమా తో మళ్ళీ హీరోగా చేశారు.. అక్కడ నుండి వెనక్కి చేసుకున్నది లేదు.. ఆంధ్రుడు.. రణం.. రారాజు.. ఒక్కడున్నాడు.. అంటూ వరస మాస్ సినిమాలతో రాయలసీమలో స్టార్ హీరోగా మారిపోయారు.. 2007లో వచ్చిన లక్ష్యం సినిమా అందరిని ఆకట్టుకుంది.. దింతో చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోగా మారిపోయారు గోపిచంద్..


ఒంటరి.. శౌర్యం.. శంఖం సినిమాలు చేసిన గోపిచంద్ కు సరైన హిట్ పూరి జగన్నాథ్ గారు ఇచ్చారు.. 2007లో వచ్చిన గోళీమార్.. గోపిచంద్ కెరీర్ లో టాప్ సినిమాలలో ఒక్కటిగా పేరు తెచ్చుకుంది.. అటు పేరు ఇటు వస్సులు రాబట్టింది ఈ సినిమా.. గంగా రామ్.. గంగు భాయ్ అంటూ పిల్లల నుండి పెద్దల దాక అందరికి నచ్చిన పాత్ర అది.. ఆ తర్వాత వాంటెడ్.. మొగుడు.. సాహసం.. లోక్యం.. జిల్.. సౌఖ్యం.. గౌతమ్ నందా.. ఆక్సిజన్.. ఆరడుగుల బులెట్ వంటి సినిమాలు చేశారు.. 25వ సినిమాగా 2018లో పంతం అనే సినిమా చేశారు.. గత సంవత్సరం చాణక్య సినిమా చేసిన గోపిచంద్ ఇప్పుడు సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అనే సినిమా చేస్తున్నారు..


అటు విలన్ గా ఇటు హీరోగా మంచి పేరు సంపాదించిన గోపిచంద్.. మరిన్ని సంవత్సరాలు.. ఇలానే పరిశ్రమలో సినిమాలు చెయ్యాలని.. విభిన్న పాత్రలతో మనల్ని అలరించాలని కోరుకుందాం.. మ్యాచో స్టార్ గోపిచంద్ గారికి బి.ఆర్.మూవీ. జోన్ బృందం తరపున జన్మిదిన శుభాకాంశాలు..