01-12-2020 19:38:55 About Us Contact Us



ఈషా రెబ్బ మన తెలుగు అమ్మాయి.2013లో ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారు దర్శకత్వం వహించిన అంతకు ముందు..ఆ తర్వాత.. అనే సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది.2015లో మళ్ళీ అదే దర్శకుడు అల్లరి నరేష్ తో చేసిన బందిపోటు సినిమాలో చేసింది.2016లో తమిళంలో చేసిన ఈషా తిరిగి 2017లో మళ్ళీ ఇంద్రకంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో మూడవసారి అమీతుమీ అనే సినిమాలో అడివి శేష్ కు జంటగా నటించింది.ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.ఈ సినిమాతో అమెకంటూ అభిమానులు ఏర్పడారు..


అదే సంవత్సరంలో మాయమాల్,దర్శకుడు అనే సీబీమాలు చేసింది.2018లో కాజల్,నిత్యా మీనన్,రెజినాలతో కలిసి అ!సినిమాలో చేసింది.ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది.అదే సంవత్సరంలో బ్రాండ్ బాబు అనే సినిమాతో నటనలో మంచి మార్కులు కొటేసింది ఈషా.అదే సంవత్సరంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,యంగ్ ఎన్టీఆర్ కలిసి చేసిన ప్రతిష్టాత్మక సినిమా అరవింద సమేత సినిమా లో పూజా హెడ్గే కు చెల్లిగా చేసింది,కాసేపు మాత్రమే కనిపించినా తను చేసిన పాత్రలలో మంచి పాత్రగా నిలిచింది.


సుభ్రమన్యపురం అనే సినిమాలో సుమంత్ తో జత కట్టింది.ఈ సినిమాలో అచ్చ తెలుగు ఆడ పిల్ల పాత్రలో మన పక్కింటి అమ్మాయిలా కనిపించింది.నాగ చైతన్య సవ్యసాచి లో గెస్ట్ రోల్ చేసింది.2019లో తన చుట్టు తిరిగే రాగల 24 గంటల్లో అనే త్రిల్లర్ సినిమా చేసింది.ఇలా గడిచిన ఏడు సంవత్సరాలలో చేసింది కేవలం 12 సినిమాలే అయినా మంచి పేరు సంపాదించుకుంది ఈషా రెబ్బ..


ఇప్పటికి ఏ స్టార్ హీరోతో హీరోయిన్ గా చెయ్యనప్పటికి తనకంటూ తెలుగు యువతలో ఒక స్థానాన్ని సంపాదించుకుంది.చూసేందుకు చక్కని తెలుగు అమ్మాయిల ఉండటం,ముఖంలో అన్ని భావాలు స్పష్టంగా కనిపిస్తూ వుండడటం తో ఆమెకు ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్న క్రేజ్ ఉంది.ఇప్పటికే సోషల్ మీడియాలో ఇండస్ట్రీ లో మోస్ట్ అండర్ రేటడ్ హీరోయిన్ అంటూ అభిమానులు పెడుతూ వుంటారు.తెలుగు అమ్మాయి సినీపరిశ్రమలో ఈ స్థాయికి రావడం గర్వకరణంతో పాటు సినిమా రంగంలోకి రావాలి అని అనుకుంటున్న ఎంతోమంది అమ్మాయిలకు తాను ఒక ఆదర్శంగా నిలిచింది.అలాంటి ఈషా రెబ్బా కు రానున్న రోజుల్లో మంచి సినిమాలు రావాలి అని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు..