05-12-2020 13:48:16 About Us Contact Us



హృదయకాలయం దర్శకులు.. కొబ్బరిమట్ట నిర్మాత.. సంపూర్ణేష్ బాబు అనే పాత్ర సృష్టి కర్త సాయి రాజేష్ (స్టీఫెన్ శంకర్) గారు గతంలో తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి సంఘటన జరిగినా మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి సహాయం చేస్తుంటారు.కరోనా బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.. ఆంధ్రప్రదేశ్..తెలంగాణలలో హాస్పిటల్ లో బెడ్స్ దొరకడం కష్టంగా ఉంది..లేక ఎవరికి సమాచారం అందిస్తే తమవారికి కరోనా ఉన్నట్లు ప్రభుత్వాలకు తెలిసి వారికి వైద్యం అందుతుంది అని తెలియక కష్టాలు పడుతున్న వారి సమాచారం సేకరించి.. ఆ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం మొదలు పెట్టారు. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి అనుకుంటున్న కరోనా బాధితులు ట్విట్టర్ ద్వారా ఆంధ్ర వారు #COVID19APHELP అని..తెలంగాణ వారు #COVID19TSHELP అనే హాష్ ట్యాగ్ తో ట్వీట్లు వేస్తే వారి గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు.వారి పూర్తి వివరాలతో పాటు రెండు నంబర్స్ కూడా పెట్టాలి.


ఇప్పటికే ట్విట్టర్ ద్వారా సహాయం కోరిన వారికి మంత్రులు కేటీఆర్.. ఈటెల రాజేంద్ర గారు స్పందిస్తున్నారు.అయితే సాయి రాజేష్ చొరవతో టెస్టులు జగరాలి..అంబులెన్స్ కావాలి..హాస్పిటల్ లో బెడ్ కావాలి..రక్త సహాయం కావలి.. వెంటిలేటర్ పొందాలి అనుకునే కరోనా బాధితులకు సహాయం కావాలి అనుకుంటున్న వారికి ఇది ఉపయోగపడనుంది.


ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో అందరికి అందుబాటులో ఉంటారు సాయి రాజేష్.ఇప్పటికే కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ లో సహాయం చేశారు సాయి రాజేష్. ఇప్పటికే తమ వంతు బాధ్యతగా పరిశ్రమ మొత్తం ఆర్థిక సహాయం చేసింది..అలానే వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చే విషయంలో కూడా పరిశ్రమలో కొందరు ముందుకు వచ్చారు. ఇప్పుడు తాజాగా సాయి రాజేష్ ట్విట్టర్ ద్వారా ఇచ్చిన పిలుపుతో నేటి మధ్యాహ్నం నుండి తెలుగు పరిశ్రమలోని సెలబ్రిటీస్ ట్వీట్లు వెయ్యడం ప్రారంభించారు.సమాచారం లేక బాధ పడుతున్న అనేకమందికి ఇది పరిష్కారం కానుంది.ఎప్పుడు కొత్త ఆలోచనతో వచ్చే సాయి రాజేష్ ఆలోచన నేడు అనేకమందికి కరోనా సమయంలో ప్రాణాలు కాపాడనుంది.అందుకే మా వంతుగా సాయి రాజేష్ గారి ప్రయత్నాన్ని అభినందిస్తూ..ఆడికమండికి తెలిసేందుకు తొలిసారి సినిమా గురించి కాకుండా ఆర్టికల్ వేస్తున్నాం.త్వరగా మనం కరోనా నుండి బయటపడాలి అని కోరుకుందాం.