24-01-2022 15:50:18 About Us Contact Usసాధారణంగా 60ఏళ్ళు పైబడిన వారిని చూసి మనం ఇక రిటైర్ వయసు వచ్చింది ఇంట్లో కూర్చోమని చెబుతాం..,అలాంటిది ఒక వ్యక్తి మాత్రం 10ఏళ్ల ముందు తాను వదిలేసిన ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చాడు.తాను వదిలి వెళ్లిపోయిన సింహాసనంపై మళ్ళీ తానే అధిష్టించాడు..!ఇప్పటికే ఆయన పేరు అర్థమైంది కదా కొన్ని కోట్లమంది ఆరాధ్య దైవం,లక్షలాది మంది రక్తం పంచిన తమ్ముళ్లు గల అన్నయ్య,”పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి” గారు.ఆ వయసులో చిరంజీవి గారు సినిమాల్లోకి రావడమే కాదు తన గ్రేస్ తో బాస్ ఈజ్ బ్యాక్ అని అనిపించాడు.ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా మన ఇళ్లలో 45 ఏళ్ళు దాటిన వారు ఫోన్ తో పడే పాట్లు మనమందరం చూసే ఉంటాం.ఇక సోషల్ మీడియా గురించి వాళ్లకు నేర్పించాలి అంటే మనకున్న ఓపిక మొత్తం అయిపోతుంది.,చివరకు చిరాకు,కోపం కూడా వస్తుంది.ఇప్పుడు విషయంలోకి వెళ్తే..,


గత నెల 25న అంటే తెలుగు వారి కొత్త సంవత్సరంగా చెప్పే ఉగాది పర్వదినాన మెగాస్టార్ సామాజిక మాధ్యమాలలోకి అడుగు పెట్టారు.రావడం,రావడమే అందరిని రఫ్ ఆడించేశారు..తొలి ట్వీట్లలలో సందేశం ఇచ్చిన చిరు ఆ తర్వాత స్వాగతం పలికిన యువ కదానాయకుల నుండి మిత్రులు,కలిసి నటించిన నాటి తరం,నేటి తరం హీరోయిన్ల దాక అందరికి స్వాగతం పలికినందుకు రిప్లై ఇస్తూ కౌంటర్ వేసేసారు చిరు.దింతో ఆయన ఇక్కడ తన పంచ్ టైమింగ్ తో మన అందరిని అలరిస్తారు అని తొలి రెండు రోజుల్లోనే అర్థమైపోయింది.


ఆ తర్వాత కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో సందర్భంలో ఉపాధి కోల్పోయి కష్టాలు పడుతున్న సినీ కార్మికులకు కోటి రూపాయలు ప్రకటించారు చిరు.ఇక అక్కడి నుండి చిన్న,పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క సినీ సెలబ్రిటీ సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.దింతో కరోనా క్రైసిస్ చారిటీ అనే సంస్థ పెడుతున్నట్లు ప్రకటించి కార్యవర్గాన్ని సైతం ప్రకటించారు.ఇక విరాళాలు ఇచ్చిన అందరికి పేరు పేరునా వారిని ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు చెబుతూ అభినందించారు.ఇక మోడీ గారి పిలుపుకు తన సందేశాలను పలు సార్లు వీడియో రూపంలో పంచుకున్నారు.ఇక కరోనా పై నాగ్,ధరమ్,వరుణ్ తేజ్ లతో కోటి గారి పాట పాడిన చిరు..బిగ్ బి,రజినీ,మోహన్ లాల్,మమ్ముటీ,శివ రాజ్ కుమార్,రణబీర్ కపూర్,అలియా భట్ మరి కొంతమందితో కలిసి ఫామిలీ అనే లఘు చిత్రంలో ఇంటి నుండే నటించారు.


ఇక రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ పై తన స్పందన తెలియ చేసిన చిరు,ప్రతి హీరో పుట్టిన రోజుకి తనదైన స్టైల్ లో విషెస్ చెప్పడం ప్రారంభించారు.చరణ్ తో మొదలు పెట్టి నితిన్,అల్లు అర్జున్,అఖిల్ అక్కినేని,అకీరా దాక అందరికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో పాటు తనదైన మాట ఒక్కటి చెబుతూ వచ్చారు.ఆయన ట్వీట్లు ఎంత ఆప్యాయంగా ఉన్నాయి అంటే,అందరూ హీరో అభిమానులు ఆ హీరో పుట్టిన రోజు నాడు సినిమా ఫస్ట్ లుక్ లు,పోస్టర్లు కంటే చిరంజీవి గారు ఏమని విష్ చేస్తారు అని ఎదురు చూసేంతలా ఉన్నాయి,అంతేనా తన దగ్గర ఉన్న ఫోటో కలెక్షన్ లో నుంచి బయటకు ఫోటోలు పెడుతుంటే సినీ అభిమానులు మెగాస్టార్ ఫోటో కలెక్షన్ గురించి పెద్ద చర్చే జరుపుతున్నారు.మెగాస్టార్,ఇలా సమయం తీసుకొని అందరి గురించి పెడుతుంటే అంటూ సినీ ప్రముఖుల నుండి ప్రేక్షకుల దాక అందరూ ఆనందిస్తున్నారు.


ఇక చిరంజీవి గారు,మోహన్ బాబు గారికి రాననుకున్నవా,రాలేననుకున్నవా అనే ట్వీట్.దర్శకుడు పూరి జగన్నాధ్ కి బొంబాయి,బ్యాంకాక్ బీచ్ లను మిస్ అవుతున్నవా అని అడగడం ట్విట్టర్ లో ఆయన ట్వీట్స్ లొనే హైలైట్..!నాలుగు పదుల దాటిన కొందరు సినీ ప్రముఖులను మీరు సామాజిక మాద్యమలలోకి రారా అని అడిగితే,ఇక ఈ వయసులో పెద్దగా అవసరం లేదు అనిపించింది,అర్థం కావడం లేదు అని చెప్తున్న సందర్భంలో 64 ఏళ్ల వయసులో పెద్దరికంగా ట్విట్టర్ లోకే కాక కుర్రాడిలా ఇంస్టాగ్రామ్ లోకి కూడా వచ్చారు.ఇక ట్యాగ్స్,హాష్ ట్యాగ్స్ సోషల్ మీడియా పై బాగా అవగాహన ఉన్న పాతికేళ్ల కుర్రాడిలా పెడుతున్నారు.


వచ్చి 20 రోజులు కూడా కాలేదు అప్పుడే 69 ట్వీట్స్ వేశారు చిరు.ఇక ఇంస్టాగ్రామ్ లో 631కె(6లక్షల 31 వేల మంది)ట్విట్టర్ లో 356కె(3లక్షల 56 వేల మంది)అంటే దాదాపు మిలియన్(10 లక్షల) మంది అనుసరిస్తున్నారు.ఇంస్టాగ్రామ్,ట్విట్టర్ ఫాలోయింగ్ చూస్తుంటే, ఆరు ఏళ్ల పిల్లోడి నుండి అరవై ఏళ్ల ముసలావిడ దాక అందరూ చిరంజీవి గారి అభిమానులు అని చిన్నప్పుడు విన్నాను.ఇప్పటికి అదే నిజం అని అర్ధమవుతుంది.రాననుకున్నారా,రాలేననుకున్నారా అని పరుచూరి బ్రదర్స్ ఏమనుకొని రాశారేమో కానీ,60ఏళ్ల వయసులో సినిమాల్లోకి తిరిగి వచ్చి ఆ డైలాగ్ ఖైదీ 150 ప్రి రిలీస్ వేడుకలో చెప్పి,బ్యాక్ 2 బ్యాక్ “ఖైదీ 150″,”సైరా” తో హిట్స్ అందుకున్న చిరు.64 ఏళ్ల వయసులో సామాజిక మాధ్యమాల్లోకి వచ్చి తన దైన టైమింగ్ తో అదరకొడుతున్నారు.


ఇలా ఆరు పదుల వయసులో సామాజిక మాధ్యమాలలో రఫ్ ఆడిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఇలానే ఒక పక్క పెద్దరికంగా మంచి మాటలు చెబుతూనే,తన పంచ్ టైమింగ్ తో మనందరిని అలరించాలి అని కోరుకుందాం..!


CHIRU TWITTER ACCOUNT


CHIRU INSTAGRAM ACCOUNT