24-01-2022 15:43:26 About Us Contact Us


20వ దశాబ్దం చివర్లో అప్పుడప్పుడే ఇంటర్నెట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న రోజులు..,యాహు,జిమెయిల్ నుండి సామాజిక మాధ్యమం అంటూ మన దేశ యువత ఆర్కుట్,ఫేస్బుక్ లలోకి వస్తున్న రోజులు,సరిగ్గా అప్పుడే యూట్యూబ్ అనే అప్లికేషన్ లో వీడియోలు చూడచ్చు అని తెలుసుకుంటున్న రోజులు.యువత నోకియా బేసిక్ మోడల్ ఫోన్స్ నుండి స్మార్ట్ ఫోన్లు వాడడం మొదలు పెట్టారు.

2010 నాటికి చదువుకుంటున్న యువతకి ఫేస్బుక్,యూట్యూబ్ చాలా సాధారణం అయిపోయాయి.ఇంతలో మన తెలుగు నేల పై షార్ట్ ఫిలిమ్స్ అనే పిలుపు వినిపించింది.పోటీల కోసం తీస్తున్న లఘు చిత్రాలను ఎక్కడో విశాఖలో చదువుకుంటున్న కొందరు యూట్యూబ్ లో పెట్టడం మొదలు పెట్టారు.తర్వాతి రోజుల్లో,ఆ సంస్థ కు ఏం.ర్.ప్రొడక్షన్స్ అని నామకరణం చేసి యూట్యూబ్ వీక్షకుల కోసం షార్ట్ ఫిలిమ్స్ తీసే స్థాయికి చేరింది.

దశాబ్దం గడిచే సరికి అనేక మంది నటీనటులు మన వెండితెరకు ఆ యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ నుండి పరిచయమయ్యారు.ప్రతి రోజు ప్రపంచంలో ఏదో ఒక చోట నుండి తెలుగులో ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ విడుదల అవుతుంది.కానీ ఇప్పటికీ,అప్పటికీ ఒక నటి గురించి చిన్న విషయమైనా సామాజిక మద్యమలలో యువత ఆసక్తి చూపుతుంటారు.ఒక్కటి రెండు రోజులు తన వద్ద నుండి అప్డేట్ రాకుంటే తనకేమైందో అని పోస్టులు పెట్టె వారు నేటికి వున్నారు.ఆమె లఘు చిత్రాలు వదిలి వెండితెర పైకి వెళ్లి దాదాపు అర్దదశాబ్దం అవుతున్నా మరెందరో నటీమణులు వచ్చినా ఆమె స్థానం చెక్కు చెదరలేదు.ఇప్పటికి ఏ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ ని పోల్చాలన్నా అమెతోనే.

కళ్ళతో అభినయం,మంచి పొడుగు,చక్కటి వస్త్రాలు,చూసేందుకు అచ్చ తెలుగు ఆడ పిల్లలా చూసేందుకు అందంగా ఉండటమే కాదు.తన కొంటె చూపులతో ఆ రోజు నుండి నేటి వరకు ఎందరో కుర్రకారులను తన అభిమానులుగా చేసుకుంది.నిన్న మొన్న ఆమె నటించిన వెబ్ సిరీసులను కూడా కేవలం ఆమె కోసం చూసిన వారు ఉన్నారు అంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు.ఆమె ఎవరో కాదు సామాజిక మాధ్యమ ‘మహనటి’ ‘చాందిని చౌదరి’.ఆమెను ‘సామాజిక మాధ్యమ సావిత్రి’ అని పిలవడం అతిసేయోక్తి కాదేమో…!

వెబ్సైట్ లో లఘు చిత్రాలు అనే కాలమ్ పెట్టాము,కొత్తగా వచ్చే యువతను వారి ప్రతిభను అభినందించేందుకే పెట్టాము.తొలి ఆర్టికల్ ఎవరి పైన రాయాలి అని ఆలోచిస్తుంటే నాకు ఇప్పటి వారిలో అనేక పేర్లు వెంటవెంటనే గుర్తుకొచ్చాయి.అంతలో తొలి ఆర్టికల్ నేటి తరం వారికి,రానున్న యువతకు స్ఫూర్తి దాయకంగా ఉండాలి అనిపించింది.వెంటనే నాకు గుర్తుకు వచ్చిన పెరు చాందిని చౌదరి.తన నటన,తన పట్టుదల కచ్చితంగా నేటి తరానికి స్ఫూర్తి.

చాందిని చౌదరి తొలి రోజుల షార్ట్ ఫిలిమ్స్ హీరోయిన్.ఇప్పుడంటే అమ్మయిలు టిక్-టాక్ లు చేస్తున్నారు కానీ ఆ రోజుల్లో తెలుగమ్మాయి తన ఫోటో సామాజిక మాద్యమంలో పెట్టిన వెంటనే ఇంట్లో దాని పై పెద్ద గొడవే జరిగేది.ఇక షార్ట్ ఫిలిమ్స్ అంటూ యూట్యూబ్ లో చేసినప్పుడు బంధుమిత్రుల నుండి తనకు,తన తల్లి తండ్రులకు ఎంతటి విమర్శలు వచ్చి ఉంటాయో ఉహించండి.ఇప్పుడంటే ఎక్కడో కొందరు సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్స్ చేస్తుంటారు,కానీ తాను చేసే రోజుల్లో మన అనుకున్న వారే అనేక మాటలు మొహం మీద అని వుంటారు కదా.!కూతురి పై నమ్మకంతో తనకు ఇష్టమైన పని చేసేందుకు స్వేచ్ఛ ఇచ్చిన తన తల్లితండ్రులు కచ్చితంగా అభినందనియులు.అందుకే ఆమె కచ్చితంగా సినీ రంగంలోకి ఇప్పుడు వచ్చిన,రానున్న ఎంతో మంది తెలుగు అమ్మాయిలకు స్ఫూర్తి.చాందిని చౌదరి మరెనో సంవత్సరాలు సినీ రంగంలో కొనసాగించాలి అని కోరుకుందాం..!