24-01-2022 16:25:55 About Us Contact Us“బాబు రెడి బాబు..లైట్స్ ఒన్..కెమెరా రోలింగ్..యాక్షన్..”

‘భద్ర’ తో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ‘తులసి’తో తనలోని మాస్ యాంగిల్ చూపించి,’సింహ’ సినిమాతో తన బాక్స్ ఆఫీస్ ‘దమ్ము’ని నిరూపించి..మాస్ పల్స్ తెలిసిన ‘సరైనోడు’గా పేరు గడించి ‘జయ జానకి నాయక’ వంటి హిట్ లతో ‘లెజెండ్’ గా మారాడురా ‘వినయ విధేయ రామ’..మన ‘బోయపాటి శ్రీను’ రా మామ..!


గుంటూరులో జన్మించి,విద్యాబ్యాసం పూర్తి చేసి ఫోటోలు తియ్యడం పైన ఉన్న ఇష్టంతో ఈనాడులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న బోయపాటి శ్రీను ని చూసి తన బంధువు తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప రచయిత,దర్శకుడు,నటుడు పోసాని కృష్ణ మురళి గారు ముత్యాల సుబ్బయ్య గారి స్టూడియోలో దర్శకత్వ శాఖ లో 1997లో చేర్పించారు..ఆ తర్వాత అదే పోసాని గారి దగ్గర ఒక చిన్న మాట,పవన్ కళ్యాణ్ గారి ‘గోకులంలో సీత’..’పెళ్లి చేసుకుందాం’..’పవిత్ర బంధం’..’మెగాస్టార్ చిరంజీవి’ గారి ‘అన్నయ్య’..’మసున్న మహారాజు’ వంటి సినిమాలకు పని చేశారు.


2004లో బన్నీకి ఒక కథ చెపేందుకు వెళ్లారు,అయితే కధ బాగున్నా తను చేస్తున్న సినిమాలు పూర్తవడానికి చాలా సమయం ఉండడంతో దిల్ రాజు దగ్గరకు స్వయంగా తీసుకెళ్లారు అల్లు అర్జున్..దిల్ రాజుకు ఆ కధ నచ్చి,అటువంటి మాస్ సినిమాకు మాస్ మహరాజ్ రవితేజ అయితే బాగుంటుంది అని ఆయనతో చేసేందుకు సిద్ధపడ్డారు దిల్ రాజు..కథ చర్చ జరిగేంతసేపు క్రింద కారులో కూర్చొని తిరిగి వచ్చి నచ్చిందా అని అడిగారు అంత అల్లు అర్జున్..మరి ఆ కధ బన్నీ కి ఎంత నచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు..


2005లో రవితేజ,మీరా జాస్మిన్ కలిసి నటించిన భద్ర సినిమా తో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమయ్యారు బోయపాటి శ్రీను..ఆ తర్వాత 2007లో విక్టరీ వెంకటేష్ తో చేసిన తులసి సినిమాతో మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు..2010లో మాస్ ఆడియాన్స్ కి అల్ టైం ఫేవరేట్ హీరోలలో ఒక్కరైన బాలకృష్ణ తో కలిసి సింహ సినిమా చేశారు బోయపాటి..ఆ సినిమాతో అనాటివరకు బాలయ్య పేరు మీద వున్న రికార్డ్స్ అన్ని మారిపోయాయి..చరిత్రను తిరగరాసింది ఆ సినిమా..ఆ ఒక్క సినిమా బోయపాటి శ్రీను గారిని స్టార్ డైరెక్టర్ జాబితాలో చేర్చింది..సరైన సినిమా పడితే బాలయ్య బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలా ఉంటుందో చూపించిన సినిమా..సింహ డైలాగ్స్ ఎప్పటికి ఎవర్ గ్రీన్..నందమూరి అభిమానులు ఎప్పటి మర్చిపోలేని సినిమా సింహ…బోయపాటి,బాలకృష్ణ గారి కెరీర్ చెప్పడప్పుడు సింహ ముందు సింహ తర్వాత అని కచ్చితంగా చెప్పుచు..


అంతటి హిట్ సినిమా తర్వాత 2012లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన సినిమా పెద్దగా విజయం సాధించలేదు..కానీ అందులోని సెంటిమెంట్ సన్నివేశాలు,మాస్ ఫైట్స్,సాంగ్స్ ఇప్పటికి మనం చూస్తూనే ఉంటాం..2014లో మళ్ళీ బాలకృష్ణ తో చేసిన లెజెండ్ సైతం భారీ విజయం నమోదు చేసింది,ఈ సినిమాతో బాలకృష్ణ,బోయటి కాంబినేషన్ కు మంచి పేరు వచ్చింది.2016లో అల్లు అర్జున్ తో చేసిన సరైనోడు మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించింది..2017లో వచ్చిన జయ జానకి నాయక బెల్లంకొండ శ్రీనివాస్ కి అల్ టైం హిట్ గా నిలిచింది..ఈ సినిమాతో బోయపాటి స్టార్ హీరో లేకున్నా ఎంతటి హిట్ కొట్టగలదో నిరూపించింది..2019లో వచ్చిన వినయ విధేయ రామ మాత్రం ఆయన అభిమానులను నిరాశ పరిచింది.ఇంతలో మళ్ళీ బాలకృష్ణ తో సినిమా అనగానే బోయపాటి విల్ బి బ్యాక్ అంటూ సంబరాలు జరుపుకుంటున్నారు..


చేసింది 9 సినిమాలే అయినా బోయపాటికి ఉన్న స్టార్ ఇమేజ్ వేరు..వచ్చే నెలతో 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న బోయపాటి శ్రీను గారు మరిన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమకు ఇవ్వలి అని కోరుకుందాం..నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న దమ్మున్న దర్శకుడు సరైనోడు “బోయటి శ్రీను”గారికి పుట్టిన రోజు శుభాకాంశాలు..