01-12-2020 16:51:55 About Us Contact Us



బానుమతి రామకృష్ణ.. నవీన్ చంద్ర.. సలోని లుత్ర జంటగా.. రాజా చెంబోలు.. వైవా హర్ష ప్రధాన పాత్రలలో.. శ్రీకాంత్ నగోతి దర్శకత్వంలో.. ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న చిత్రం. శ్రవణ్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.. ఈ సినిమా జులై 3న ప్రేక్షకుల ముందు రానుంది.. ఆహా ద్వారా విడుదల చేయనున్నట్లు సినిమా బృందం ఇటీవల తెలిపింది..


ఇప్పటికే విడుదలైన టీజర్.. ట్రైలర్.. పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.. రెండు వేరు వేరు ప్రపంచాల నుండి వచ్చిన ముప్పయి ఏళ్ళు పైబడిన అమ్మాయి అబ్బాయి మధ్య జరిగే సంఘటనల సారాంశం ఈ సినిమా.. ఇండిపెండెంట్ ఉమెన్ గా సొసైటీ లో ఉంటూ.. 5ఏళ్ళు ప్రేమించిన రాము అనే అబ్బాయి వదిలేయడంతో ఆ బాధ నుండి బయటపడ్డ 30ఏళ్ళ అమ్మాయి భానుమతి కి.. తెనాలి తప్ప ఏ ఊరు తెలియని 33 ఏళ్ళ రామకృష్ణ హైదరాబాద్ కు వచ్చి తన ఆఫీస్ లో తనకు పరిచాయమవుతాడు.. అలా పరిచయమైన వీరిద్దరి కథ ఏమైంది అనేది సినిమా.. ట్రైలర్ చూస్తుంటే డైలాగ్స్ బాగా రాసుకున్నట్లు తెలుస్తుంది..


ఈ కాలంలో కెరియర్ లో సెటిల్ అవ్వాలి అని పెళ్ళికి ఆలస్యం చేస్తున్న అనేక మందికి ఈ కథ వారి జీవితంలా కనిపించవచ్చు.. ఇది ఓ.టి.టి. కంటెంట్ అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.. దింతో సినిమాపై ప్రజల్లో ఆశక్తి నెలకొంది0.. ఇప్పటికే సినిమా చూసిన కొందరు విమర్శకుల నుండి మంచి స్పందన వచ్చింది.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు సైతం సినిమా విజయం సాధిస్తుంది అని..తను ఇటీవల కాలంలో ఇటువంటి మంచి ప్రేమ కథ కలిగిన సినిమా చూడలేదు అని చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి..


అందాల రాక్షసి సినిమాతో హీరోగా హిట్ అందుకున్న నవీన్ చంద్ర.. అరవింద సమేత వీరరాఘవతో నటుడిగా అటు విమర్శకుల ప్రశంసలు.. ఇటు ప్రజల ఆదరణ పొందారు.. ఇప్పుడు ఈ సినిమాతో అలాంటి గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు.. ఇక కథనాయికి సలోని లుత్ర కు.. తెలుగులో ఇది తొలి సినిమా..ఇప్పటికే తమిళం.. హిందీలో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.. పలు యాడ్స్ లలో కూడా నటించారు.. ఈ సినిమాతో తెలుగులో సైతం మంచి పేరు లభిస్తుంది అని నమ్మకంతో ఉన్నారు.. ఈ సినిమాకి సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ చెయ్యగా.. రవి పెరెపు ఎడిటర్ గా చేశారు..


జులై3న నేరుగా ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇప్పటికే ఓ.టి.టి లలో విడుదలవుతున్న చిత్రాలు విజయం సాధిస్తుండటంతో తమ సినిమాకు కూడా అలాంటి ఫలితమే వస్తుంది అని చిత్ర బృందం ఆశిసస్తుంది..